భారత్‌పై దాడులకు అడ్డాగా ఉండొద్దు | America comment on Pak to give assurance | Sakshi
Sakshi News home page

భారత్‌పై దాడులకు అడ్డాగా ఉండొద్దు

Published Sat, Jun 11 2016 3:07 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

America comment on Pak to give assurance

పాక్ హామీ ఇవ్వాలన్న అమెరికా

 వాషింగ్టన్: ప్రధాని మోదీ నేపథ్యంలో పాక్‌కు అమెరికా గట్టి సందేశం పంపింది. భారత్‌లపై  దాడులు జరిపే ఉగ్రవాద సంస్థలకు పాక్‌ను అడ్డాగా మార్చొద్దని, ఆ విధంగా హామీ ఇవ్వాలని కోరింది. ఉగ్రవాద సంస్థలకు పాక్  స్థావరంగా మారిందని మోదీ  అమెరికా పర్యటనలో పేర్కొనడం తెలిసిందే. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని పాక్‌ను అమెరికా ప్రోత్సహించడం ముందడుగని అమెరికా ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు.

ఆ రెండు దేశాల మధ్య సహాయ సహకారాలు పెంపొందుతాయని, ఆ దిశగా చర్చలు సాగితే ఉద్రిక్తతలు తగ్గుతాయ చెప్పారు. మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా మధ్య జరిగిన చర్చల్లో పాకిస్తాన్ అంశం కూడా ఉందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో నెలకొన్న అనేక అంశాలను విస్తృతంగా చర్చించారన్నారు. అమెరికాతో భారత్, పాక్ ద్వైపాక్షిక సంబంధాలు వేరని, కానీ, ఆ రెండు దేశాల మధ్య సంబంధాలనేవి వాటి ప్రాధాన్యతల మీద ఆధారపడి ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement