terrorist group
-
బంకర్ బాంబు దాడిలో... నస్రల్లా మృతి
బీరూట్: లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసింది. నస్రల్లాయే ప్రధాన లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం శుక్రవారం భారీ బాంబు దాడులకు దిగి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేయడం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 80కి పైగా బాంబులతో విరుచుకుపడింది. ఆ క్రమంలో ఏకంగా 2,200 కిలోల బంకర్ బస్టర్ బాంబులను కూడా ప్రయోగించింది. దాడిలో నస్రల్లాతో పాటు ఆయన కూతురు జైనబ్, òహెజ్బొల్లా సదరన్ కమాండర్ అలీ కరీ్కతో పాటు పలువురు కమాండర్లు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. నస్రల్లాతో పాటు తమ సీనియర్ సైనిక కమాండర్ అబ్బాస్ నిల్ఫోరుషన్ (58) కూడా దాడుల్లో మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘నస్రల్లా కదలికలను కొన్నేళ్లుగా అత్యంత సన్నిహితంగా ట్రాక్ చేస్తూ వస్తున్నాం. అతనితో పాటు హెజ్బొల్లా అగ్ర నేతలంతా బంకర్లో సమావేశమైనట్టు అందిన కచి్చతమైన సమాచారం మేరకు లక్షిత దాడులకు దిగాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదావ్ షొషానీ వివరించారు. ‘‘నస్రల్లాను మట్టుపెట్టాం. పలు రకాలైన నిఘా సమాచారం ఆధారంగా నిర్ధారణ కూడా చేసుకున్నాం’’ అని ప్రకటించారు. ‘‘అంతేకాదు, గత వారం రోజులుగా చేస్తున్న దాడుల్లో హెజ్‌బొల్లా్ల సాయుధ సంపత్తిని భారీగా నష్టపరిచాం. దాన్ని పూర్తిగా నాశనం చేసేదాకా దాడులు చేస్తాం’’ అని తెలిపారు. శుక్రవారం నాటి దాడిలో వాడిన బాంబులు తదితరాలపై మాట్లాడేందుకు నిరాకరించారు. ‘‘హెజ్బొల్లా ప్రతీకార దాడులకు దిగుతుందని తెలుసు. మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ప్రకటించారు.హెజ్బొల్లాకు ఇరాన్, ఇరాక్ దన్నుహెజ్బొల్లాకు పూర్తిగా అండగా నిలుస్తామంటూ ఇరాన్, ఇరాక్ ప్రకటించాయి. అత్యంత శక్తిమంతమైన ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ శనివారం అత్యవసరంగా సమావేశమైంది. ఇజ్రాయెల్ దాడులకు గట్టిగా జవాబివ్వాల్సిందేనని ముక్త కంఠంతో తీర్మానించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ సైనిక కమాండర్ మృతికి ప్రతీకారం తీర్చుకునే హక్కుందని ఇరాన్ న్యాయవ్యవస్థ డిప్యూటీ చీఫ్‌రెజా పూర్ ఖగాన్ అన్నారు. ముస్లిం ప్రపంచమంతా పాలస్తీనా, హెజ్బొల్లాలకు దన్నుగా నిలవాలంటూ ఇరాక్ కూడా పిలుపునిచి్చంది. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇరాక్ ప్రధాని మొహహ్మద్ సియా అల్ సుడానీ ఇరాన్, హెజ్బొల్లాతోనే అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగడం ఖాయమంటున్నారు. మరోవైపు, నస్రల్లా మృతితో అంతా అయిపోయినట్టు కాదని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ అన్నారు. హెజ్బొల్లాపై దాడులు మరింత తీవ్రంగా కొనసాగుతాయని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇప్పటికే అదనపు బలగాలను సమీకరించుకుంటోంది! భూతల దాడులను ఎదుర్కొనేందుకు రెండు బ్రిగేడ్లను ఉత్తర ప్రాంతానికి పంపింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వు బెటాలియన్లను కూడా రంగంలోకి దిగాల్సిందిగా ఆదేశించింది. దాంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే తారస్థాయికి చేరిన ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా తమ ప్రజలు నిర్వాసితులయ్యారని ఇజ్రాయెల్ మండిపడుతోంది. దాడులకు పూర్తిగా స్వస్తి చెప్పేదాకా తగ్గేదే లేదంటోంది. ఇజ్రాయెల్ తాజా దాడుల దెబ్బకు లెబనాన్‌లో గత వారం రోజుల్లోనే ఏకంగా 2 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారని ఐరాస చెబుతోంది.కోలుకోలేని దెబ్బ!మూడు దశాబ్దాలకు పైగా హెజ్బొల్లాను నడిపిస్తున్న నస్రల్లా మృతి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బే. హెజ్బొల్లాపై తలపెట్టిన తాజా దాడిలో ఇజ్రాయెల్‌కు ఇది అతి పెద్ద విజయంగా భావిస్తున్నారు. హెజ్బొల్లా హెడ్డాఫీస్‌తో పాటు ఆరు అపార్ట్మెంట్లను నేలమట్టం చేసిన శుక్రవారం నాటి దాడుల్లో మృతులు ఆరుకు, క్షతగాత్రుల సంఖ్య 91కి పెరిగినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండు వారాల క్రితమే లెబనాన్ అంతటా పేజర్లు పేలి పదుల సంఖ్యలో చనిపోగా వేలాది మంది తీవ్రంగా గాయపడటం తెలిసిందే. దాన్నుంచి తేరుకోకముందే వాకీటాకీలు మొదలుకుని పలు ఎలక్ట్రానిక్ పరికరాలు పేలి మరింత నష్టం చేశాయి. ఇదంతా ఇజ్రాయెల్ పనేనని, మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు హెజ్బొల్లా మిలిటెంట్లేనని వార్తలొచ్చాయి. -
బ్రిటన్ అమెరికా దాడులు
వాషింగ్టన్: హౌతీ ఉగ్రవాద ముఠాపై అమెరికా, బ్రిటన్ విరుచుకుపడ్డాయి. మిలిటెంట్ల ఆవాసాలు, ఆయుధాగారాలపై ఆ దేశాల సంయుక్త దళాలు గురు, శుక్రవారాల్లో భారీగా బాంబు దాడులు జరిపాయి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్ల ద్వారా ఏకకాలంలో తోమహాక్ క్షిపణులు తదితరాలు ప్రయోగించి పలు లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో యెమన్ రాజధాని సనా, ఎర్రసముద్రంలో హౌతీల కంచుకోట హుదాయ్దా వంటివి కూడా ఉన్నట్టు వివరించాయి. అక్కడి తీర ప్రాంత రాడార్ సైట్లతో పాటు డ్రోన్, మిసైళ్ల నిల్వ, ప్రయోగ కేంద్రాలను తాజా దాడుల్లో ధ్వంసం చేసినట్టు ప్రకటించాయి. ఎర్రసముద్రంలో ఉగ్ర మూకల దాడులను సహించబోమనేందుకు ఈ దాడులు తాజా రుజువని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఎర్రసముద్రంలో అంతర్జాతీయ రవాణా నౌకలపై హౌతీల మతిలేని దాడికి చరమగీతం పాడి తీరతామన్నారు. అందుకోసం మరిన్ని తీవ్ర చర్యలకు కూడా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ‘‘చరిత్రలోనే తొలిసారిగా యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్లను హౌతీలు ప్రయోగిస్తున్నారు. ఇది అంతర్జాతీయ వర్తకానికి, నౌకలకు, నావికులకే గాక అమెరికా రక్షణ సిబ్బందికి కూడా ప్రమాదకరంగా మారింది’’ అంటూ మండిపడ్డారు. పరిస్థితులు ఉద్రిక్తం సనాలో శుక్రవారం తెల్లవారుజామున కనీసం నాలుగు భారీ పేలుళ్లు సంభవించాయని స్థానిక జర్నలిస్టులు వెల్లడించారు. నగర పశి్చమాన రేపు ప్రాంతంలో కూడా ఐదుకు పైగా భారీ పేలుళ్లు జరిగినట్టు చెబుతున్నారు. అక్కడికి దక్షిణాన ఉన్న తైజ్, ధమర్ వవంటి నగరాలపై కూడా దాడులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు దాడులకు దూరంగా ఉన హౌతీలు గత మంగళవారం ఉన్నట్టుండి భారీగా విరుచుకుపడటం తెలిసిందే. ఎర్రసముద్రంలోని నౌకలపైకి పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించాయి. అమెరికా, బ్రిటన్ యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు తక్షణం స్పందించాయి. 18 డ్రోన్లను, రెండు మిసైళ్లు, ఒక యాంటీ షిప్ మిసైల్‌ను నేలకూల్చాయి. గురువారం కూడా గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో ఒక నౌకపైకి హౌతీలు షిప్ విధ్వంసక బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించారు. అది గురి తప్పడంతో భారీ నష్టం తప్పింది. దాంతో పరిస్థితిపై మంగళవారమే బైడెన్ అత్యవసర సమీక్ష జరిపారు. హౌతీలపై దాడులను తీవ్రతరం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. మరోవైపు బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ కూడా హౌతీలపై పెద్దపెట్టున దాడులు జరిపిందని ప్రధాని రిషీ సునాక్ ప్రకటించారు. తమ సంయుక్త దాడులకు నెదర్లాండ్స్, కెనడా, బెహ్రయిన్ దన్నుగా నిలిచాయన్నారు. దాడులకు స్వస్తి పలకాలని ఆ్రస్టేలియా, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, బహ్రయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా తదితర దేశాలు కూడా ఇప్పటికే హౌతీలను హెచ్చరించాయి. ఎర్రసముద్రంలో నౌకల భద్రత నిమిత్తం 22 దేశాలతో కలిసి ‘ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్’ పేరిట కొత్త సముద్ర రక్షణ మిషన్‌కు అమెరికా తాజాగా తెరతీసింది. ఇందులో భాగంగా నౌకల రక్షణార్థం అమెరికా తదితర దేశాల యుద్ధ నౌకలు ఎర్రసముద్ర జలాల్లో నిరంతరం గస్తీ కాస్తున్నాయి. -
అమెరికన్లంటే ద్వేషం.. తెరపైకి అల్‌ఖైదా కొత్త చీఫ్ పేరు!
న్యూయార్క్: నిషేధిత ఉగ్రసంస్థ అల్‌ఖైదా చీఫ్ అయ్మన్ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటిలోనే డ్రోన్ స్ట్రయిక్ ద్వారా అతన్ని నేల కూల్చింది. గతంలో పాక్ భూభాగంలో అల్ ఖైదా ‘ఎమిర్’(చీఫ్ కమాండర్) బిన్‌లాడెన్‌ను ఎలాగైతే మట్టుపెట్టిందో.. ఇప్పుడు ఆ తర్వాతి చీఫ్‌ను సైతం పక్కా దాడితో మట్టుపెట్టి.. ఉగ్ర సంస్థకు నాయకత్వం లేకుండా చేసింది. అయితే.. అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు హతమై కొన్నిగంటలు గడవక ముందే కొత్త నాయకుడి పేరు తెర మీదకు వచ్చింది ఇప్పుడు. అతని పేరే సైఫ్ అల్-అడెల్. అల్ ఖైదా వ్యవస్థాప సభ్యుడిగా, సీనియర్ మెంబర్‌గా, సంస్థలో నెంబర్ త్రీ పొజిషన్లో ఇంతకాలం ఉన్నాడతను. తర్వాతి నాయకత్వ పగ్గాలు అందుకునే అవకాశాలు ఉన్నాయని మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఓ కథనం ప్రచురించింది. ► ఎఫ్‌బీఐ రికార్డుల ప్రకారం.. అడెల్ ఏప్రిల్ 11న 1960-63 మధ్యలో జన్మించాడు. ► జవహిరిలాగే.. అడెల్ కూడా ఈజిప్ట్ పౌరుడే. అక్కడి ఆర్మీలో కల్నల్ ర్యాంకుతో పని చేశాడు. ► జవహిరి స్థాపించిన ఇజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్లో సైఫ్ అల్-అడెల్ పని చేశాడు. అందులో అతనికి ఎక్స్‌ప్లోజివ్ ఎక్స్‌పర్ట్‌గా పేరు ఉంది. ► 1980లలో ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా దళాలతో కూడా పోరాడాడు. ► అమెరికన్లనే మాట వింటే చాలు రగిలిపోతాడతను. గతంలో అమెరికన్లను హతమార్చిన ఘటనలు, అమెరికన్లకు చెందిన ఆస్తుల విధ్వంసం, అమెరికా భద్రతా విభాగాల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అందుకే ఎఫ్‌బీఐ సైఫ్ అల్ అడెల్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది. ► 1998లో టాంజానియా, కెన్యాలోని రాయబార కార్యాలయాల్లో బాంబు పేలుళ్ల ద్వారా అమెరికన్లను హతమార్చే యత్నం కింద అతనిపై నేరారోపణలు నమోదు చేసిన అమెరికా.. పట్టించినా, సమచారం అందించిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ► 1993 అక్టోబర్‌లో సోమాలియా మోగడిషూ దగ్గర జరిగిన బ్లాక్ హాక్ డౌన్ ఘటనకు మూల కారణం..సైఫ్ అల్-అడెల్. ఆ ఘటనలో అమెరికాకు చెందిన పద్దెనిమిది మంది సర్వీస్‌మెన్ బలయ్యారు. ► ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గా పని చేయడంతో సైఫ్ అల్-అడెల్ బాగా ఆప్తుడిగా మెదిలేవాడు. జవహిరి కంటే అడెల్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు లాడెన్. ► 2001 నుంచే ఎఫ్‌బీఐ మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. ► బిన్ లాడెన్ మరణించినప్పటి నుండి, అల్-అడెల్ ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా మారాడని అనేక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే,బ్లాక్ హాక్ డౌన్ తరువాత చాలాకాలం పాటు ఇరాన్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతనెక్కడ ఉన్నాడన్నది మాత్రం తెలియదు!. ► కేడర్ హోదాలో తర్వాతి ఎమిర్ అయ్యే అవకాశాలు సైఫ్ అల్-అడెల్కు ఎక్కువగా ఉన్నాయి. -
‘చాలా సిగ్గరి.. ఉగ్రవాదిగా మారి షాకిచ్చింది’
కోల్‌కతా: జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాద సంస్థకు చెందినట్లు అనుమానిస్తున్న పశ్చిమ బెంగాల్ యువతి ప్రగ్యా దేబ్నాథ్ అలియాస్ ఆయేషా జన్నత్ మోహనాను శుక్రవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె తల్లి చట్ట ప్రకారం తన కుమార్తెను శిక్షించాలని కోరుతున్నారు. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ హుగ్లీ ధానియఖాలి గ్రామానికి చెందిన ప్రగ్యా దేబ్నాథ్ నాలుగేళ్ల క్రితం అనగా 2016, సెప్టెంబర్ 25 ఉదయం దుర్గామాత పూజ సందర్భంగా బయటకు వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. ప్రతిరోజు ప్రగ్యా అలా బయటకు వెళ్లడం సాధారణమే. దాంతో తల్లిదండ్రులు కూడా అనుమానించలేదు. గంటలు గడుస్తున్నా ప్రగ్యా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన ప్రగ్యా తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దాంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం సమయంలో ప్రగ్యా తల్లికి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. చేసింది ఆమె కుమార్తె. తాను ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్నానని.. ఇస్లాంలోకి మారానని.. తల్లి ఆశీర్వాదం కోసం ఫోన్ చేశానని తెలిపింది ప్రగ్యా. అంతేకాక ఇదే తన చివరి కాల్ అని కూడా అన్నది. ఈ విషయం గురించి ప్రగ్యా తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కానీ వారు ఆ నంబర్‌ను ట్రేస్ చేయలేకపోయారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత శుక్రవారం కౌంటర్ టెర్రరిజమ్ అండ్ ట్రాన్స్‌మిషనల్ క్రైమ్ యూనిట్ పోలీసులు ఢాకాలో ప్రగ్యాను అరెస్ట్ చేశారు. దీని గురించి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ధనియాఖాలి ప్రాంతానికి చెందిన యువతి.. ఉగ్రవాద సంస్థలో చేరింది అని ప్రచారం చేయడంతో ఆమెని తన కుమార్తెగా గుర్తించింది ప్రగ్యా తల్లి. (చొరబాట్లను ఆపుతూ అమరులయ్యారు) దీనిపై ప్రగ్యా తల్లి స్పందిస్తూ.. ‘ఇంటి నుంచి వెళ్లడానికి ముందు నా కుమార్తె ప్రవర్తనలో ఎలాంటి తేడాను మేం గమనించలేదు. ఏదైనా విషయంలో మాకు ఎదురుతిరగడం కూడా మేం ఎప్పుడు చూడలేదు. అలాంటిది ఏకంగా ఉగ్రవాద గ్రూపులో చేరింది. చట్ట ప్రకారం నా కుమార్తెను శిక్షించండి’ అని కోరింది. ఈ విషయం గురించి ఇరుగుపొరుగు వారు మాట్లాడుతూ.. ‘ప్రగ్యా చాలా సాధారణమైన అమ్మాయి. ప్రతి రోజు ఉదయం సైకిల్ మీద కిలోమీటర్ దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం వచ్చేది. తనకు తెలిసిన వారు ఎదురుపడితే.. నవ్వుతూ పలకరించేది. ఎవరితో ఎక్కువగా కలిసేది కాదు. చాలా సిగ్గరి. అలాంటి అమ్మాయి ఉగ్రవాదిగా మారింది అంటే నమ్మబుద్ధి కావడం లేదు’ అంటున్నారు. (నా భర్తని హత్య చేశారు: ఎమ్మెల్యే భార్య) -
కేరళ, తమిళనాడులో తీవ్రవాదుల సంచారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్యాకుమారి జిల్లాలోని చెక్‌పోస్టులో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ విల్సన్‌ను తీవ్రవాద ముఠా హతమార్చడం తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం కేరళ సరిహద్దులో ఉండడం, నిందితులు ఆ రాష్ట్రానికి పారిపోయినట్లు ప్రాథమిక సమాచారంతో రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐని కాల్చిచంపిన కేసు నేపథ్యంలో ఐదుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడినవారు కేరళకు పారిపోయేందుకు సహకరించిన నేరంపై కేరళలో దాక్కుని ఉన్న ముగ్గురిని, ఢిల్లీలో మరో ఇద్దరిని క్యూబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కన్యాకుమారి జిల్లా కిళియక్కావిళై మార్కెట్ రోడ్డులో పోలీసు చెక్‌పోస్టులో ఎస్ఐ విల్సన్ విధుల్లో ఉండగా బుధవారం రాత్రి ఇద్దరు అగంతుకులు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చిన సంఘటన రాష్ట్ర పోలీసు యంత్రాగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కన్యాకుమారి జిల్లా కలెక్టర్, ఎస్పీ, చెన్నై నుంచి డీజీపీ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఐదు ప్రత్యేక పోలీసు బృందాలతో కేసు విచారణ ప్రారంభించారు. తుపాకీ కాల్పులకు పాల్పడే ముందు ఎస్ఐని కత్తులతో పొడిచి చిత్రవధకు గురిచేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. హతుని శీరరం నుంచి తీవ్రవాదులు వినియోగించిన తుపాకీ తూటాలను పోలీసులు సేకరించారు. హత్య జరిగిన ప్రాంతం కేరళ సరిహద్దు కావడంతో ఆ రాష్ట్ర డీజీపీ, ఇతర పోలీసు అధికారులు సైతం చెక్‌పోస్టును పరిశీలించారు. హత్య జరిగిన పరిసరాల్లో సీసీటీవీ కెమెరాల పుటేజీలో నమోదైన దృశ్యాల ద్వారా తిరువితాంగోడుకు చెందిన అబ్దుల్ సమీం, నాగర్‌కోవిల్‌కు చెందిన తవుబిక్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. హంతకులు కేరళ పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షలు బహుమతి ఇస్తామని తమిళనాడు పోలీసుశాఖ, రూ.5 లక్షలు బహుమానమని కేరళ ప్రభుత్వం ప్రకటించాయి. ఇదిలా ఉండగా నిందితులు పారిపోయేందుకు సహకరించిన నేరంపై కేరళ రాష్ట్రం పాలకోట్టైకి చెందిన ముగ్గురిని క్యూబ్రాంచ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నారు. దీనివల్ల కన్యాకుమారి–కేరళ సరిహద్దుల్లో తీవ్రవాద ముఠా సానుభూతిపరులు ఉన్నట్లు భావిస్తున్నారు. -
వీడు సామాన్యుడు కాదు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తలదాచుకుని బీహార్‌లోని బోధ్‌గయ పేలుళ్లకు కుట్ర పన్నిన జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) కీలక ఉగ్రవాది మహ్మద్ జహీదుల్ ఇస్లాం అలియాస్ కౌసర్ సామాన్యుడు కాదని నిఘా వర్గాలు చెప్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని గడగడలాడించేందుకు తక్కువ తీవ్రత గల 500 బాంబు పేలుళ్లకు ఒకేసారి పాల్పడ్డాడని, ఈ కేసులో అరెస్టు అయిన తర్వాత ఆరుగురు పోలీసుల్ని చంపి కస్టడీ నుంచి తప్పించుకున్నాడని పేర్కొంటున్నాయి. బోధ్‌గయ పేలుళ్లకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం పట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో కౌసర్సహా మరికొందరిపై సప్లమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం విదితమే. బంగ్లాదేశ్‌కు చెందిన కౌసర్ చిన్నతనంలోనే ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. 2000లోనే జేఎంబీలో చేరి కీలక వ్యక్తిగా మారాడు. పేలుడు పదార్థాల వినియోగంపై పట్టు ఉండటంతో జేఎంబీ ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యూల్ చీఫ్ సిద్ధిఖుర్ రెహ్మాన్ అలియాస్ బంగ్లా భాయ్‌కి కుడిభుజంగా మారాడు. బంగ్లాదేశ్‌లో వరుస పేలుళ్లు... కౌసర్ సూచనల మేరకు భారీ కుట్ర పన్ని 2005 ఆగస్టు 17న బంగ్లాదేశ్‌లో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు. బంగ్లాదేశ్‌లో ఉన్న 64 జిల్లాల్లోనూ జేఎంబీ క్యాడర్ ఏర్పాటు చేసుకుంది. వారి సాయంతో ఉదయం 11.30 నుంచి 12 గంటల మధ్య 63 జిల్లాల్లోని 300 ప్రాంతాల్లో 500 పేలుళ్లకు పాల్పడ్డారు. తక్కువ తీవ్రత కలిగిన ఈ బాంబుల్ని కేవలం తమ సందేశాలు ప్రజలకు చేర్చడానికే వినియోగించారు. ఈ నేపథ్యంలోనే ఇవి పేలినప్పుడు అందులో నుంచి కరపత్రాలు ఎగిరిపడ్డాయి. వీటిని బంగ్లా ప్రభుత్వం లెటర్ బాంబులుగా పేర్కొంది. ఎక్కడా ప్రాణనష్టం లేనప్పటికీ ఢాకాలో మాత్రం ఓ బాంబును గుర్తించిన ఇంటెలిజెన్స్ అధికారి దాన్ని తన చేతిలోకి తీసుకున్నారు. ఆ వెంటనే అది పేలిపోవడంతో ఆయన మరణించారు. ఈ కేసులో అరెస్టు అయిన కౌసర్ జైల్లో ఉండగా బంగ్లా పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో రెహ్మాన్ మృతిచెందాడు. న్యాయస్థానం కౌసర్‌కు జీవితఖైదు విధించింది. జైల్లో ఉన్న ఇతడిని రక్షించడానికి జేఎంబీ క్యాడర్ 2009లో పట్టపగలు దాడి చేసింది. ఆ సందర్భంలో ఆరుగురు పోలీసుల్ని చంపేసిన కౌసర్ తప్పించుకుని సరిహద్దులు దాటి భారత్‌లో తలదాచుకున్నాడు. తొలినాళ్లలో పశ్చిమ బెంగాల్‌లోని బురాధ్వన్లో షెల్టర్ తీసుకున్నాడు. కొందరు జేఎంబీ ఉగ్రవాదుల్ని అక్కడకు పిలిచి దేశీయంగా పేలుళ్లకు కుట్రపన్నాడు. అయితే, ఆ ఏడాది అక్టోబర్ 2న వీరి గదిలో తయారు చేస్తున్న బాంబు పేలి ఇద్దరు చనిపోగా కౌసర్ తప్పించుకుని పారిపోయాడు. ఆపై చెన్నైతోపాటు హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలోనూ కొన్నాళ్లు వ్యాపారిగా అవతారమెత్తి షెల్టర్ తీసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉండగానే బిహార్‌లోని బోధ్‌గయను టార్గెట్‌గా ఎంచుకున్నాడు. మయన్మార్‌లో రోహింగ్యాలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రతీకారం తీర్చుకోవాలని జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) ఉగ్రవాద సంస్థ భావించింది. బౌద్ధ ప్రార్థన స్థలాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతోపాటు తమ ప్రతీకారం తీర్చుకోవాలని గత ఏడాది జనవరి 19న తమ పథకాన్ని అమలు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ అధికారులు గత ఏడాది ఆగస్టులో కౌసర్‌ను బెంగళూరులో పట్టుకున్నారు. దేశంలోని అనేక కేసులతోపాటు బంగ్లాదేశ్‌లోనూ ఇతడు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు. ఇక్కడి కేసుల విచారణ తర్వాత ఆ దేశానికి తీసుకువెళ్లనున్నారు. -
గుండెల్ని కాల్చి తిన్నాడు..!
వాషింగ్టన్: చేసిన పాపం ఊరికే పోదంటారు. లైబీరియా అంతర్యుద్ధంలో వందలాది మందిని పొట్టనపెట్టుకుని అమెరికాకు పారిపోయివచ్చిన ఓ నర హంతకుడి విషయంలో అదే రుజువైంది. ఓ తీవ్రవాద సంస్థకు చెందిన కమాండర్ మొహమ్మద్ జబ్బతెహ్(51) గతాన్ని వెలికితీసిన అమెరికా అధికారులు అతన్ని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా అతని బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలు విన్న న్యాయమూర్తులు సైతం విస్తుపోయారు. లైబీరియా నుంచి విచారణకు హాజరైన ఓ మహిళ(60) జడ్జీల ముందు వాంగ్మూలమిస్తూ.. ‘జంగిల్ జబ్బాగా పేరుగాంచిన మొహమ్మద్ జబ్బతెహ్, అతని సైనికులు మా ఊరిపై 1991లో దాడిచేశారు. నా భర్తతో పాటు, మరిది గుండెల్ని పెకలించి హత్యచేశారు. తర్వాత తినేందుకు వీలుగా ఆ గుండెలను వండాలని ఆదేశించారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘ధైర్యం తెచ్చుకో. వెంటనే మంట రాజేసి ఆ గుండెల్ని వండకుంటే జబ్బతెహ్ నీతో పాటు నన్నూ చంపేస్తాడు’ ఆ దళ సభ్యుడు ఒకరు తనతో చెప్పాడని పేర్కొన్నారు. లైబీరియాలోని ఓ తీవ్రవాద సంస్థకు చెందిన జబ్బతెహ్ అత్యంత కిరాతకుడిగా ముద్రపడ్డాడు. 1991–98 మధ్య చెలరేగిన అంతర్యుద్ధంలో అతని సైనికులు వందలాది మందిని ఊచకోత కోశారు. చిన్నారులను సైనికులుగా మార్చడం, హత్యలు, బహిరంగ అత్యాచారాలు వంటి అకృత్యాలకు పాల్పడ్డారు. అనంతరం 1998లో అమెరికాకు శరణార్థిగా పారిపోయిన జబ్బతెహ్.. అక్కడే వివాహం చేసుకుని ఫిలడెల్ఫియాలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. అయితే అమెరికాలో ప్రవేశించేముందు తన నేర చరిత్రను జబ్బతెహ్ అధికారులకు వెల్లడించలేదు. 2013లో జబ్బతెహ్ గతాన్ని గుర్తించిన హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు.. అప్పట్లో జరిగిన మారణహోమం బాధితుల్ని సాక్షులుగా ప్రవేశపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పలువురు సాక్షుల్ని విచారించిన ధర్మాసనం.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో జబ్బతెహ్‌ను గతేడాది అక్టోబర్‌లో దోషిగా తేల్చింది. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన నేపథ్యంలో జబ్బతెహ్‌కు 30 ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించే అవకాశముందనీ, అలాగే అతణ్ని వెంటనే స్వదేశానికి పంపేస్తారని అధికారులు తెలిపారు. కాగా, ఈ కేసులో గురువారం ఇక్కడి కోర్టు జబ్బతెహ్‌కు శిక్ష ఖరారు చేయనుంది. -
భారత్‌పై దాడులకు అడ్డాగా ఉండొద్దు
పాక్ హామీ ఇవ్వాలన్న అమెరికా వాషింగ్టన్: ప్రధాని మోదీ నేపథ్యంలో పాక్‌కు అమెరికా గట్టి సందేశం పంపింది. భారత్‌లపై దాడులు జరిపే ఉగ్రవాద సంస్థలకు పాక్‌ను అడ్డాగా మార్చొద్దని, ఆ విధంగా హామీ ఇవ్వాలని కోరింది. ఉగ్రవాద సంస్థలకు పాక్ స్థావరంగా మారిందని మోదీ అమెరికా పర్యటనలో పేర్కొనడం తెలిసిందే. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని పాక్‌ను అమెరికా ప్రోత్సహించడం ముందడుగని అమెరికా ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు. ఆ రెండు దేశాల మధ్య సహాయ సహకారాలు పెంపొందుతాయని, ఆ దిశగా చర్చలు సాగితే ఉద్రిక్తతలు తగ్గుతాయ చెప్పారు. మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా మధ్య జరిగిన చర్చల్లో పాకిస్తాన్ అంశం కూడా ఉందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో నెలకొన్న అనేక అంశాలను విస్తృతంగా చర్చించారన్నారు. అమెరికాతో భారత్, పాక్ ద్వైపాక్షిక సంబంధాలు వేరని, కానీ, ఆ రెండు దేశాల మధ్య సంబంధాలనేవి వాటి ప్రాధాన్యతల మీద ఆధారపడి ఉంటాయన్నారు. -
కోల్‌కతాలో ఇద్దరు తీవ్రవాద సభ్యుల అరెస్ట్
కోల్‌కతా: జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎమ్బీ) తీవ్రవాద సంస్థ సభ్యులు ఇద్దరిని కోల్‌కతా పోలీసులు (ఎన్ఐఎ ఎస్టీఎఫ్) బృందం గురువారం అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన ఇన్మౌల్ ముల్హా, హబీబుల్ హాక్వె అనే ఇద్దరు వ్యక్తులకు బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఎన్ఐఎ (జాతీయ దర్యాప్తు సంస్థ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్) జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా గతరాత్రి మెటిబ్రజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో దాడులు జరిపినట్టు తెలిపారు. 2014లో జరిగిన బురద్వాన్ బాంబు పేలుడు కేసులో వీరిద్దరికి సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో వీరి పాత్ర ఎంతవరకూ ఉందన్న దానిపై విచారించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కోల్‌కతాలో బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ పలువురిని సభ్యులుగా చేర్చుకున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని పోలీస్ అధికారి యూసఫ్ గెజి వెల్లడించారు. తాజాగా ఇద్దరి అరెస్ట్.. మిగతా తీవ్రవాద సభ్యులను పట్టుకోనేందుకు ఉపయోగపడుతుందని యూసఫ్ అభిప్రాయపడ్డారు. -
మసూద్‌ను ఆంక్షల జాబితాలో చేర్చండి: భారత్
న్యూయార్క్: ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్, పఠాన్‌కోట్ ఉగ్ర దాడి కుట్రదారు మసూద్ అజార్ పేరును భద్రతా మండలి ఆంక్షల జాబితాలో చేర్చాలని భారత్ ఐరాసను కోరింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, దౌత్యవేత్త సయీద్ అక్బరుద్దీన్ ఈమేరకు న్యూజిలాండ్ రాయబారి, 1267 అల్ కాయిదా ఆంక్షల కమిటీ అధ్యక్షుడు జెరార్డ్ జాకౌబ్స్ వాన్ బోహెమెన్కు ఈమేరకు లేఖరాశారు. జైషే సంస్థ ఉగ్ర కార్యకలాపాలకు, పఠాన్‌కోట్ దాడి ఘటనకు ఆ సంస్థ చీఫ్ మసూద్ ప్రమేయమున్నట్లు పటిష్ట ఆధారాలు చూపుతూ దీన్ని రాశారు. మసూద్‌ను ఆంక్షల జాబితాలో చేర్చకుంటే భారత్‌తోపాటు దక్షిణాసియాలోని ఇతర దేశాలకు ముప్పు ఉంటుందని స్పష్టంచేశారు. -
ఐఎస్ ఉగ్రవాదులు అణు సునామీ సృష్టిస్తారట!
బెర్లిన్: ఇస్లాం రాజ్యస్థాపన పేరిట అరాచకం సృష్టిస్తూ ఇప్పటికీ పాశ్చాత్య ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐస్ టెర్రరిస్టులు పాశ్చాత్య దేశాల ప్రజలందరిని మట్టుపెడతారట. ప్రపంచవ్యాప్తంగా ఖలీఫా రాజ్య స్థాపనే లక్ష్యంగా హిందువులు, విగ్రహారాధకులు, నాస్తికులు, యాజిదీలే కాకుండా, షియా ముస్లింలందరిని హతమార్చేందుకు టెర్రరిస్టులు వ్యూహం పన్నుతున్నారట. ఇంతటి మానవ హననానికి బాంబులు, శతఘ్నలు సరిపోవని, అందుకోసం అణ్వాయుధాలను ఉపయోగించుకునేందుకు వారు సమాయత్తమవుతున్నారట. ఈ విషయాలను ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులతో పది రోజులు గడిపి, వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపి, వారి వ్యూహ ప్రతి వ్యూహాల గురించి క్షున్నంగా తెలసుకున్న మాజీ జర్మన్ ఎంపీ, 75 ఏళ్ల జర్నలిస్ట్ జూర్జెన్ టోడెన్హోఫర్ జర్మన్ టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టుల మూలాలను, వారి మనోభావాలను తెలుసుకొని ఓ పుస్తకం రాయడం కోసం టోడెన్హోఫర్ ముందుగా ‘స్కైప్’ ద్వారా వారితో సంబంధాలను నెలకొల్పుకున్నారు. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా విధానాలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ మంచి క్రిటిక్‌గా పేరు తెచ్చుకున్నందున టోడెన్హోఫర్ను టెర్రరిస్టులు తమ వద్దకు ఆహ్వానించారు. వారితో పాటు ఇరాక్‌లోని మోసుల్ నగరంలో, పరిసర గ్రామాల్లో పది రోజుల పాటు గడిపారు. ఇరాక్‌లోని సున్నీలంతా అక్కడి టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నారని, అంతకుముందు పాలనలో వారు తీవ్రమైన అణచివేతకు గురవడమే అందుకు కారణం కావచ్చని టోడెన్ తెలిపారు. పట్టుబడిన వారిని అతి దారుణంగా చంపి, వాటిని వీడియోలుగా తీయడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని, ప్రజల్లో భీతావహాన్ని సృష్టించడం ద్వారానే వారు ఇరాక్‌లోని పలు నగరాలను, సిరియా ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగారని ఆయన చెప్పారు. తాను బ్యాక్ ప్యాక్, స్లీపింగ్ బ్యాగ్‌తో వారివద్దకు వెళ్లానని, తన వద్దనున్న సెల్‌ఫోన్‌ను వారు లాగేసుకున్నారని తెలిపారు. ఈ పది రోజులు నేలపైనే స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకున్నానని చెప్పారు. ఐఎస్ఐఎస్ నుంచి పొంచి వున్న ముప్పును పాశ్చాత్య దేశాలు తక్కువగా అంచనా వేస్తున్నారని, వారేమో 50 కోట్ల మందిని చంపడం గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. ఖలీఫా రాజ్యం కోసం వారు పన్నుతున్న వ్యూహాలు భయానకంగా ఉన్నాయని, అణు సునామీని సృష్టించి ప్రపంచాన్ని శవాల దిబ్బగా మార్చడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని 75 ఏళ్ల టోడెన్ తెలిపారు. వారి మనోభావాలనుగానీ, మానసిక పరిస్థితిలోగానీ మార్పులు వచ్చే అవకాశాలు ఏ మాత్రం తనకు కనిపించలేదని అన్నారు. చివరకు వారి వద్ద నుంచి తాను తీవ్ర నిరాశ నిస్పృహలతో వెనక్కి రావాల్సి వచ్చిందని చెప్పారు. మానవ చరిత్రలో ఊహకందని విపత్తును చూడాల్సి వస్తోందన్న భయం కలుగుతోందని అన్నారు. ఆయన అక్కడ గడిపిన పది రోజుల అనుభవాలను వివరిస్తూ ‘ఇన్సైడ్ ఐఎస్-టెన్ డేస్ ఇన్ ది ఇస్లామిక్ స్టేట్’ పేరిట పుస్తకం రాశారు. -
ఢిల్లీలో ఇద్దరు హుజీ ఉగ్రవాదుల అరెస్ట్
ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వారిని హైదరాబాద్ తరలిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు కొద్ది గంటల ముందు హైదరాబాద్ హూజీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.., హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే మెదక్ జిల్లా జహీరాబాద్ కు చెందిన షేక్ నూర్, ఢిల్లీకి చెందిన హకీంను ఢిల్లీలో పట్టుకున్నారు. వారిని హైదరాబాద్ తరలించారు. వీళ్లిద్దరూ ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్న యువకులను బార్డర్ దాటించడంలో దిట్ట అని సిట్ పోలీసులు వెల్లడిస్తున్నారు.