కోల్కతా: జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎమ్బీ) తీవ్రవాద సంస్థ సభ్యులు ఇద్దరిని కోల్కతా పోలీసులు (ఎన్ఐఎ ఎస్టీఎఫ్) బృందం గురువారం అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన ఇన్మౌల్ ముల్హా, హబీబుల్ హాక్వె అనే ఇద్దరు వ్యక్తులకు బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఎన్ఐఎ (జాతీయ దర్యాప్తు సంస్థ), స్పెషల్ టాస్క్ఫోర్స్(ఎస్టీఎఫ్) జాయింట్ ఆపరేషన్లో భాగంగా గతరాత్రి మెటిబ్రజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో దాడులు జరిపినట్టు తెలిపారు.
2014లో జరిగిన బురద్వాన్ బాంబు పేలుడు కేసులో వీరిద్దరికి సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో వీరి పాత్ర ఎంతవరకూ ఉందన్న దానిపై విచారించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కోల్కతాలో బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ పలువురిని సభ్యులుగా చేర్చుకున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని పోలీస్ అధికారి యూసఫ్ గెజి వెల్లడించారు. తాజాగా ఇద్దరి అరెస్ట్.. మిగతా తీవ్రవాద సభ్యులను పట్టుకోనేందుకు ఉపయోగపడుతుందని యూసఫ్ అభిప్రాయపడ్డారు.
కోల్కతాలో ఇద్దరు తీవ్రవాద సభ్యుల అరెస్ట్
Published Wed, Mar 16 2016 12:04 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM
Advertisement
Advertisement