మోదీ పాలన ఓకే.. 72 శాతం మంది సంతృప్తి! | Modi to satisfy the 72 percent rule.... | Sakshi
Sakshi News home page

మోదీ పాలన ఓకే.. 72 శాతం మంది సంతృప్తి!

Published Wed, Nov 26 2014 1:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

మోదీ పాలన ఓకే.. 72 శాతం మంది సంతృప్తి! - Sakshi

మోదీ పాలన ఓకే.. 72 శాతం మంది సంతృప్తి!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు పనితీరుపై 72 శాతం మంది భారతీయులు సంతృప్తి వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విజయవంతం అయిందని 55 శాతం మంది భావిస్తున్నారు. అయితే, మోదీ ప్రభుత్వం తీరు ‘పని తక్కువ, ప్రచారం ఎక్కువ’ అన్నట్లుగా ఉందని 45 శాతం మంది అభిప్రాయపడగా, అందులో వాస్తవం లేదని 43 శాతం మంది తేల్చిచెప్పారు.

హిందీ న్యూస్ చానెల్ ‘న్యూస్ నేషన్’ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మోదీ ప్రభుత్వ పనితీరుపై 18 శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ గద్దెనెక్కిన తర్వాత భారత్ ప్రతిష్ట అంతర్జాతీయంగా బాగా పెరిగిందని 77 శాతం మంది అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement