న్యూయార్క్లోనూ చీపురుకట్టలు! | BJP launches clean city campaign in New York | Sakshi
Sakshi News home page

న్యూయార్క్లోనూ చీపురుకట్టలు!

Published Sat, Oct 4 2014 3:16 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

న్యూయార్క్లోనూ చీపురుకట్టలు! - Sakshi

న్యూయార్క్లోనూ చీపురుకట్టలు!

నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛభారత్ అభియాన్' గురించి ఎన్నారైలలో అవగాహన పెంచేందుకు బీజేపీ ఓ సరికొత్త కార్యక్రమం చేపట్టింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కూడా 'క్లీన్ సిటీ ప్రోగ్రాం' మొదలుపెట్టింది. ఈ విషయాన్ని బీజేపీ నాయకుడు విజయ్ జోలీ తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన క్లీన్ ఇండియా ప్రచారంతరహాలోనే అక్కడ కూడా పరిశుభ్రతను ప్రచారం చేయడానికి దీన్ని చేపట్టారు.

బీజేపీ నాయకులతో పాటు పలువురు వలంటీర్లు డౌన్ మన్హట్టన్ లోని 52వ వీధి, రెండు, మూడో ఎవెన్యూలోను చీపుళ్లు పట్టుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. మోదీ నేతృత్వంలో భారతదేశంలోని ప్రభుత్వం, పౌరులు ఏం చేస్తున్నారో తాము కూడా ఇక్కడ అదే చేస్తున్నామని జోలీ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా అమెరికాలో పరిశుభ్ర వాతావరణాన్ని గురించిన అవగాహన పెంచుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement