
81వ పడిలోకి ప్రణబ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా దేశంలోని అగ్రనేతలు, ప్రముఖ వ్యక్తులు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం 81వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
’రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన అపార అనుభవం, ముందుచూపు దేశాన్ని గొప్పగా మార్చాయి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. అలాగే, బీజేపీ సీనియర్ నేత ఎంపీ వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, రాహుల్ గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.