'హ్యాపీ బర్త్ డే టూ యూ సుమిత్రాజీ' | Modi wishes Speaker Sumitra Mahajan on birthday | Sakshi
Sakshi News home page

'హ్యాపీ బర్త్ డే టూ యూ సుమిత్రాజీ'

Published Sun, Apr 12 2015 10:50 AM | Last Updated on Wed, Aug 15 2018 6:22 PM

'హ్యాపీ బర్త్ డే టూ యూ సుమిత్రాజీ' - Sakshi

'హ్యాపీ బర్త్ డే టూ యూ సుమిత్రాజీ'

న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి ఆరోగ్యంతో ఆమె సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నానని ట్విట్టర్లో తెలియజేశారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. సుమిత్రా మహాజన్ 1943లో ఏప్రిల్ 12న జన్మించారు. ఎనిమిదిసార్లు పార్లమెంటుకు ఎన్నికైన సుమిత్రా.. లోక్సభ స్పీకర్గా పనిచేస్తున్న రెండో మహిళ. లోక్సభ తొలి మహిళా స్పీకర్గా మీరాకుమార్ పనిచేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement