అలక తుస్‌.. ఇక ప్రచార హోరులో పెద్దాయన | Mulayam Approves SP-Cong Alliance, Will Campaign from Tomorrow | Sakshi
Sakshi News home page

అలక తుస్‌.. ఇక ప్రచార హోరులో పెద్దాయన

Published Mon, Feb 6 2017 12:32 PM | Last Updated on Sat, Aug 25 2018 4:30 PM

అలక తుస్‌.. ఇక ప్రచార హోరులో పెద్దాయన - Sakshi

అలక తుస్‌.. ఇక ప్రచార హోరులో పెద్దాయన

న్యూఢిల్లీ: అనుకున్నదే అయింది. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అలక పూర్తిగా పోయింది. చిన్నచితక అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రేపటి నుంచి ప్రచార రంగంలోకి ఆయన దూకుతున్నారు. అది కూడా పూర్తి సంతృప్తితో.. తమ పార్టీ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ విషయంలో కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ.. ‘ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో మా కూటమి విజయం సాధిస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కూటమి గెలిస్తే అఖిలేశ్‌ సింగ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి’ అని ములాయం సోమవారం పార్లమెంటులో చెప్పారు.

ఆయన సోదరుడు శివపాల్‌ యాదవ్‌ ఎస్పీతో విభేదించి ఎన్నికల తర్వాత కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న అంశంపై ప్రశ్నించగా ‘అతను ఎలా కొత్త పార్టీ పెడతారు? ఒక వేళ మాట్లాడి ఉంటే ఏదో కోపంలో అనుంటాడు. పార్టీని విడిచి పెట్టి నాసోదరుడు ఎక్కడికీ వెళ్లడు. నేను కూడా రేపటి నుంచి ప్రచారంలోకి దిగుతాను’ అని స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్‌-ఎస్పీ కూటమి విషయంలో ములాయం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన ప్రచారంలోకి కూడా వెళ్లకపోవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, వాటన్నంటికీ ముగింపు పలుకుతూ ములాయం తాజా నిర్ణయం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement