
అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ (పాత చిత్రం)
న్యూఢిల్లీ : పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వ బంగ్లాలలో ఉంటున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌లకు వాటిని ఖాళీ చేయమని కేంద్రం నోటిసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత మంగళవారం స్పందించిన అఖిలేష్ యాదవ్ తనకు అద్దె ఇల్లు దొరికేంత వరకు సమయం ఇవ్వలని లేక సొంత ఇంటి నిర్మాణ చేసుకునేంత వరకు రెండేళ్ల సడళింపు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టును కోరారు. ఇప్పుడు తండ్రి ములాయం సింగ్ కూడా కొడుకు మాటనే అనుసరిస్తూ.. తనకు కూడా రెండు సంవత్సరాల గడువు ఇవ్వాలని కోరారు. కాగా ములాయం సింగ్ లక్నోలోని విక్రమాదిత్య రోడ్డులో నెం.5 బంగ్లాలో గత 27 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఆయన పక్కన నెం.4 బంగ్లాలో అఖిలేష్ యాదవ్ ఉంటున్నారు.
ఇది చదవండి : సొంతిల్లు కట్టుకోకుండా తప్పు చేశా: మాజీ సీఎం
Comments
Please login to add a commentAdd a comment