డేంజర్గేమ్ బారినపడ్డ తొలి ఇండియన్ | Mumbai: Playing Pokemon Go, Man Rams His Mercedes Into Auto Rickshaw | Sakshi
Sakshi News home page

డేంజర్గేమ్ బారినపడ్డ తొలి ఇండియన్

Published Wed, Jul 27 2016 3:09 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

డేంజర్గేమ్ బారినపడ్డ తొలి ఇండియన్

డేంజర్గేమ్ బారినపడ్డ తొలి ఇండియన్

ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న డేంజర్ గేమ్కు తొలిసారి ఓ ఇండియన్ బాధితుడయ్యాడు. ఈ గేమ్ ఆడుతూ తన మెర్సిడీస్ కారును తీసుకెళ్లి ఆటో గ్యారేజ్ను ఢీకొట్టాడు. దాన్ని ఢీకొట్టిన తర్వాతగానీ అతడికి తానొక యాక్సిడెంట్ చేశానన్న స్పృహరాలేదు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. దీంతో అతడు మరొకరి పరిస్థితి తనలా అవ్వకూడదని హెచ్చరిస్తూ అవగాహన కల్పించడం కోసం తన అనుభవాన్ని చెప్పాడు. జబ్బీర్ అలీ (26) అనే వ్యక్తి ఓ కారు డీలర్.

అతడు బ్యాండ్ స్టాండ్ లోని కార్డర్ రోడ్డులో గల తన నివాసానికి వచ్చేందుకు మెర్సిడీస్ కారును డ్రైవ్ చేస్తూ పోక్మాన్ గో ఆడుకుంటూ వచ్చాడు. ఆ ఆట మాయలో పడి కారును తీసుకెళ్లి గ్యారేజ్ కేసి కొట్టాడు. ఈ ఆట అతి తొందరగా ఓ వ్యక్తిని బానిసగా మార్చుకుంటుందని, వీలయినంత జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చని అతడు చెప్పాడు. ఇప్పటికే ఈ గేమ్ కారణంగా జపాన్, అమెరికాలో పెద్ద మొత్తంలో ప్రమాదాలు జరుగుతుండగా ముంబయిలో తొలి కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement