
సాక్షి, బెంగళూరు : హిందువుల షాపుకు వెళ్లిన ముస్లిం మహిళలపై కొందరు ముస్లిం యువకులు దూషణలకు దిగుతూ అరాచకం సృష్టించారు. మానవత్వం సైతం తలదించుకునే ఈ దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దావణగెరెలో బుర్ఖా ధరించిన ఇద్దరు ముస్లిం యువతులు ఓ దుకాణంలో దుస్తులు కొనుగోలు చేశారు. అయితే అది హిందువుల దుకాణం కావడంతో కొందరు ముస్లింలు వారిని అడ్డగించి బూతులు తిట్టారు. దుస్తులు కొనుగోలు చేసిన కాషాయం సంచులను వారి చేతుల్లో నుంచి బలవంతంగా లాక్కుని దౌర్జన్యానికి దిగారు. (డెలివరీ బాయ్ ముస్లిం అని...)
'ఏదైనా అవసరం ఉంటే ముస్లింల దుకాణాల్లో కొనాలి కానీ, హిందువుల దుకాణంలో కొనడమేంట'ని వారిపై పరుష పదజాలాన్ని ప్రయోగించారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండంటూ బెదిరింపులకు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై బీజేపీ సీనియర్ నాయకురాలు శోభా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "అది కర్ణాటకా లేకా ఇతర ఇస్లామిక్ దేశమా? హిందువుల దుకాణంలో కొన్నందుకు ఆ దుండగులు ముస్లిం మహిళలను బెదిరిస్తారా? ఇలా మతపిచ్చిపట్టిన తీవ్రవాదులకు భారత చట్టాల రుచి చూపించాలి" అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. (ముస్లిం కుటుంబాన్ని కాపాడిన బీజేపీ కౌన్సిలర్)
Comments
Please login to add a commentAdd a comment