కట్రా: రైల్వేలను అభివృద్ధి చేయడంలో ప్రైవేట్ సెక్టార్ పాత్ర పెంచనున్న్టట్టు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని ఈ విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించారు. జమ్మూలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు.
'ఎయిర్ పోర్టుల కంటే రైల్వే స్టేషన్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నది మా ఆశయం. ఇదేమంత కష్టమైన పనికాదు. ఈ విషయం గురించి రైల్వే మిత్రులతో చర్చించా. భవిష్యత్లో ఈ మార్పును కచ్చితంగా చూస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికీ లాభదాయకమైన, ఆర్థికంగా ఉపయుక్తమైన ప్రాజెక్ట్ ఇది' అని మోడీ అన్నారు.
రైల్వేలలో ప్రైవేట్ పెట్టుబడులు: మోడీ
Published Fri, Jul 4 2014 3:59 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement