రేపటి నుంచి కోవింద్ రాష్ట్రాల పర్యటన
లక్నో: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ రేపటి (జూన్ 25) నుంచి దేశవ్యాప్తంగా పర్యటన ప్రారంభించనున్నారు. తొలుత ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించనున్న కోవింద్.. జూలై 17న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఉభయ సభల సభ్యులను కోరనున్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ ఎన్నికకు సంబంధించి తగు చర్యలు తీసుకుంటూ విధాన సభ అధికారులతో శనివారం చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటుగా కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న పలు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు, ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.