
పేర్లు నమోదు చేసుకుంటున్న శృతి, తిమ్మేశ్
కర్ణాటక, మండ్య: వివాహంతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన నవదంపతులు సమాజానికి ఉత్తమ సందేశం అందించారు.నేత్రదానానికి తమపేర్లు నమోదు చేసి స్ఫూర్తిగా నిలిచారు. జిల్లాలోని పాండవపుర తాలూకా ఈరేనగౌడనకొప్పలు గ్రామానికి చెందిన శృతి, మద్దూరు తాలూకా అబలవాడికి చెందిన తిమ్మేశ్‌లకు ఆదివారం మండ్యలోని చంద్రదర్శన్ భవనంలో వివాహం జరిగింది.
వివాహ కార్యక్రమం ముగిసిన వెంటనే 30వ జాతీయ నేత్రదాన దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన నేత్రదాన నమోదు కార్యక్రమంలో నవదంపతులు పాల్గొని పేర్లు నమోదు చేసుకున్నారు.కొత్త దంపతులు నేత్రదానికి ముందుకు రావడాన్ని అభినందించిన బంధువులు,స్నేహితులు కూడా నేత్రదానంలో పేర్లు నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా తమ వివాహానికి హాజరైన బంధువులు,స్నేహితులకు మొక్కలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment