23 ఏళ్ల తర్వాత రూపాయి నోటు | new one rupee note introduced in tamil nadu | Sakshi
Sakshi News home page

23 ఏళ్ల తర్వాత రూపాయి నోటు

Published Thu, Jan 11 2018 3:15 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

new one rupee note introduced in tamil nadu - Sakshi

సాక్షి, చెన్నై: 23 సంవత్సరాల తర్వాత తమిళనాడులో కొత్తగా ఒక రూపాయి కరెన్సీ నోటు చలామణిలోకి వచ్చింది. గత ఏడాది నవంబర్‌లో చేపట్టిన  కరెన్సీ నోట్ల రద్దు తరువాత కొత్తగా రూ. 2 వేలు, రూ. 500, రూ. 200, రూ.50, రూ.10 ల కొత్త కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఈ నోట్లు అన్నీ కొత్త రూపాల్లో పలు రంగుల్లో ముద్రితమయ్యాయి. రూ.10 నోటు, దీనిపైబడి విలువ కలిగిన నోట్లను రిజర్వు బ్యాంకు అచ్చు వేస్తుంది. ఈ కరెన్సీ పై రిజర్వుబ్యాంకు గవర్నర్‌ సంతకం ఉంటుంది.

కానీ రూపాయి నోటును మాత్రం భారత ప్రభుత్వమే స్వయంగా విడుదల చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ఈ క్రమంలో కొత్తగా విడుదల చేసిన రూపాయి నోటుపై కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ కార్యదర్శి సంతకం ముద్రితమై ఉంటుంది. ఈ నోటు వెనుక భాగంలో కరెన్సీ ముద్రించిన సంవత్సరం ఉంటుంది. ఈ రూపాయి నోటు అచ్చు వేయడం 1994 లో నిలిపి వేశారు. తిరిగి 23 ఏళ్ల తరువాత మళ్లీ రూపాయి నోట్లు చలామణిలోకి వచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement