ప్రైవేటు ఆసుపత్రుల ‘స్టెంట్ దోపిడీ’: సీఐసీ
న్యూఢిల్లీ: హృద్రోగులకు అమర్చే స్టెంట్ల విషయంలో ప్రైవేటు వైద్యశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) పేర్కొంది.స్టెంట్లు వేయడం కోసం ఎంతమంది రోగులను ప్రైవేటు వైద్యశాలలకు రెఫర్ చేసిందీ చెప్పాలంటూ కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ)ని సీఐసీ ఆదేశించింది.
గుండెకు స్టెంట్లు వేయడం కోసం ఈఎస్‌ఐ నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు ఎంత మంది రోగులను రెఫర్ చేశారు...అందుకోసం ఎంత మొత్తం చెల్లించారనే వివరాలు ఇవ్వాలంటూ పవన్ సారస్వత్ అనే సమాచార హక్కు కార్యకర్త గతంలో దరఖాస్తు చేశారు. ఈ సమాచారం ఇచ్చేందుకు ఈఎస్‌ఐసీ నిరాకరించడంతో అతను సీఐసీని ఆశ్రయించారు. కేసును విచారించిన కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఇందులో పెద్ద కుంభకోణం దాగి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.