న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్(ఎస్‌ఐసీ)లలో పోస్టులను భర్తీచేయకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. తెలంగాణ, త్రిపుర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో సేవలు అందించడానికి ఎలాంటి సమాచార కమిషనర్లు అందుబాటులో లేరంటూ సమాచారహక్కు(ఆర్టీఐ)చట్టం కార్యకర్త అంజలీ భరద్వాజ్ వేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
‘ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయండి. లేదంటే ఆర్టీఐ చట్టం నిరీ్వర్యమైపోతుంది’ అంటూ కేంద్రప్రభుత్వం, రాష్ట్రాలను ఆదేశించింది. ‘ రాష్ట్ర సమాచార కమిషన్‌లలో అనుమతించిన పోస్టులు ఎన్ని? ఖాళీలెన్ని? పెండింగ్‌లో ఉన్న కేసులెన్ని? అనే వివరాలను నివేదించండి’ అని సిబ్బంది, శిక్షణ శాఖను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment