సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ అనగానే ఆర్థిక మంత్రులు బ్రీఫ్‌కేస్‌తో పార్లమెంట్‌లో అడుగుపెట్టడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. స్వతంత్ర భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముగం చెట్టి బడ్జెట్ బ్రీఫ్‌కేస్‌ను చేతబట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
ఇక 2019-20 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రీఫ్‌కేస్ స్ధానంలో బడ్జెట్ పత్రాలను ఎరుపు రంగు క్లాత్‌తో చుట్టిన పట్టు వస్త్రంలో తీసుకుని పార్లమెంట్‌కు బయలుదేరారు. ఇక ఫ్రెంచ్ పదం బుగెటి నుంచి బడ్జెట్ పదం వాడుకలోకి రాగా, బుగెటి అర్ధం బ్రీఫ్‌కేస్ కావడం గమనార్హం. మరోవైపు శుక్రవారం 11 గంటలకు నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment