సాక్షి, న్యూఢిల్లీ: నారీ-నారాయణి ద్వారా మహిళల పురోగతిపై దృష్టిపెట్టినట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మహిళల భాగస్వామ్యంతోనే పురోగతి సాధించగలమని తమ ప్రభుత్వం నమ్ముతోందన్నారు. ఈ సందర్బంగా స్వామి వివేకానంద సూక్తిని ఆమె ప్రస్తావించారు. పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలున్నారని ఆమె గుర్తు చేశారు.
మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. ముద్రా లాంటి పథకాలద్వారా మహిళా ఆర్థిక స్వావలంబనకు , మహిళా పారిశ్రామిక వేత్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. స్వయం సహాయక గ్రూప్‌ల(ఎస్‌హెచ్‌జీ) లో ఉన్న మహిళలకు రూ.5వేల ఓవర్ డ్రాఫ్ట్, గ్రూపులోని ఒక మహిళకు ముద్రా స్కీమ్ ద్వారా రూ.లక్ష దాకా రుణ సదుపాయం కల్పిస్తామని ఆమె చెప్పారు.
ఉజ్వల యోజన కింద 35కోట్ల ఎల్‌ఈడీ బల్పుల పంపిణీ చేస్తామని, తద్వారా రూ.18341కోట్ల విలువైన విద్యుత్ ఆదా చేయనున్నామన్నామని ఆర్థికమంత్రి చెప్పారు. కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకొస్తాంమని ప్రకటించిన సీతారామన కార్మికులకు ప్రధాన మంత్రి పెన్షన్ యోజన కింద 30లక్షల మందికి లబ్ది చేకూరుస్తామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కోసం భారత్ నెట్ ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment