గోవా బీచ్ లల్లో బికినీలపై నిషేధం లేదు: పరిక్కర్
పనాజీ: గోవా బీచ్ లలో బికినీ ధరించడంపై నిషేధం విధించడం లేదని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ ఓ ప్రకటన చేశారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధం ఉంటుందన్నారు.
బికినీలు, మినీ స్కర్టులను నిషేధించాలంటూ గోవా రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి సుదిన్ ధవలికర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో పరిక్కర్ బుధవారం స్పందించారు. మంత్రి సుదీన్ వ్యాఖ్యలపై మహిళ సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీచ్ లలో బికినీలను ధరించడాన్ని ప్రభుత్వం వ్యతిరేకించడం లేదని పరిక్కర్ వివరణ ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి గోవాకు వచ్చే టూరిస్తులు బికినీలు ధరించాడన్ని అడ్డుకోలేమని పరిక్కర్ అన్నారు.