
న్యూఢిల్లీ: వరుసగా ఏడోరోజు కూడా పార్ల మెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందో ళనలు కొనసాగడంతో కీలకమైన ఆర్థిక బిల్లుపై చర్చను చేపట్టలేకపోయారు. బ్యాంకింగ్ కుంభకోణాలపై ఓటింగ్‌తో కూడిన చర్చ కోసం కాంగ్రెస్, తృణమూల్‌తో పాటు ఇతర విపక్షాలు డిమాండ్ చేయగా.. ఏపీకి ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ, టీడీపీలు, తెలంగాణ లో రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్ ఎంపీలు నినాదా లతో ఉభయ సభల్ని హోరెత్తించారు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌సభ, రాజ్యసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
ఆర్థిక బిల్లుతో పాటు 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు చెందిన వినిమయ బిల్లులపై లోక్‌సభలో మంగళవారం చర్చ జరగాల్సి ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షంతో పాటు ప్రాంతీయ పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు కొనసాగించడంతో స్పీకర్ సభను 50 నిమిషాలు వాయిదా వేశారు. రైల్వే, వ్యవసాయం, రైతుల సంక్షేమం, సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలకు గ్రాంట్ల కేటాయింపు డిమాండ్లపై తీర్మానాల్ని కూడా అజెండాలో పొందుపరిచినా.. వాటిపై కూడా ఎలాంటి చర్చా జరగలేదు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో సభ మళ్లీ ప్రారంభమైనా ఆందోళనలు ఆగలేదు. పీఎన్‌బీ కుంభకోణంపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు, ఏపీకి ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు, తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంచాలని టీఆర్‌ఎస్, కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు కోసం అన్నాడీఎంకేలు ఆందోళన చేశాయి. లెఫ్ట్ పార్టీల ఎంపీలు కూడా నినాదాలు చేశారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే రాజ్యసభ కూడా బుధవారానికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment