
చంద్రబాబు ఢిల్లీ దీక్షకు అనుమతి లేదు
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకోకుండానే ఏపీ భవన్‌లో దీక్ష చేపట్టారు. ఈ విషయాన్ని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ స్పష్టం చేశారు. చంద్రబాబు దీక్షకు అనుమతి లేదని ఆయన చెప్పారు. సోమవారం మధ్యాహ్నం చంద్రబాబు డిమాండ్ ఏంటో చెప్పకుండానే దీక్ష మొదలు పెట్టారు.
హైదరాబాద్‌లో ఉదయం ఆయన ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఢిల్లీ బయలుదేరి వచ్చారు. ఇక్కడ బాపు ఘాట్ వద్ద కూడా నివాళులర్పించి దీక్షకు కూర్చున్నారు. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ఆశయాలకు నిలువునా తూట్లు పొడిచిన చంద్రబాబుకు ఎన్టీఆర్‌ఘాట్ వద్ద నివాళులర్పించే నైతిక హక్కు లేదని ఎన్టీఆర్ అభిమానులు విమర్శించారు.