no permission
-
కార్డీలియా క్రూయిజ్‌కు పుదుచ్చేరి సర్కార్ బ్రేక్.. అసలేం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: విలాసవంతమైన నౌక కార్డీలియా క్రూయిజ్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం బ్రేక్ వేసింది. పుదుచ్చేరిలో హాల్ట్‌కి నిరాకరించింది. క్రూయిజ్‌లో కేసీనో, గ్యాంబ్లింగ్ ఉండటంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు. తెల్లవారు జామున 4 గంటల నుంచి షిప్ ఆగిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో క్రూయిజ్ ఆపరేట్లు చర్చలు జరుపుతున్నారు. పాండిచ్చేరి అనుమతించకపోతే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కడులూరు పోర్ట్‌లో నౌకను ఆపేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి.. -
ఓయూలో రాహుల్ గాంధీ సభకు నో పర్మిషన్!
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీలో మే 7న నిర్వహించ తలపెట్టిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సభకు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ అనుమతి నిరాకరించారు. రాహుల్ సభ కోసం విద్యార్థి సంఘాల నుంచి అందిన వినతిపత్రానికి సంబంధించి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన మీదట వీసీ శనివారం ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ఓయూలో సభలు సమావేశాలు, రాజకీయ సమ్మేళనాలకు అనుమతులు ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆ నిర్ణయం మేరకే రాహుల్‌గాంధీ సభకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు వివరించారు. రాహుల్ సభకే కాకుండా ఓయూలో ఎటువంటి సభలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసిన అధికారులు.. క్యాంపస్‌లో కెమెరాలను కూడా నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ సర్కారుపై పోరులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మే 6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభను నిర్వహించనుంది. ఆ మరుసటి రోజు ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ నిర్వహించి, రాహుల్‌గాంధీతో విద్యార్థుల ముఖాముఖి ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించగా వీసీ అనుమతి నిరాకరించారు. వీసీపై విద్యార్థి నేతల ఆగ్రహం రాహుల్ సభకు అనుమతి నిరాకరించడం ఓయూలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. వీసీని కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆర్ట్స్ కళాశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చనగాని దయాకర్‌గౌడ్, లోకేశ్‌యాదవ్, శ్రీధర్‌గౌడ్, కుర్వ విజయ్ తదితరులు మాట్లాడుతూ.. నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చదవండి: రాహుల్ సభ.. రైతుల కోసమే! -
హైదరాబాద్: చలో అంటే చల్తా నై!
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని సమయంలో నగరంలోని రహదారులపైకి దూసుకువస్తున్న భారీ వాహనాలు, డీసీఎంల కారణంగానూ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇలా వస్తున్న వాహనాలకు చలాన్ విధించడంతో సరిపెట్టారు. ఇకపై వీటిని ఆంక్షలున్న సమయం ముగిసే వరకు ఆపేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులు బేఖాతరు.. ►అనుమతి పొందినవి మినహా నగరంలోకి భారీ వాహనాలు, లారీలు, డీసీఎంల ప్రవేశంపై కొన్ని ఆంక్షలు ఉన్నాయి. రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల మధ్యలోనే ఇవి నగరంలో సంచరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తున్న నిర్వాహకులు, డ్రైవర్లు ఎప్పుడుపడితే అప్పుడు దూసుకువచ్చేస్తున్నారు. ఈ ఉల్లంఘనపై ‘నో ఎంట్రీ’ కేసులు రాస్తున్న ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. ఏటా 30 వేల నుంచి 50 వేల వరకు ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. చదవండి: ప్రియుడితో పిజ్జాహట్‌కు.. మొదటి భార్యతో కలసి వీడియో రికార్డింగ్ ►ఆయా వాహనాల డ్రైవర్లు కూడా అనుమతి లేని వేళలో నగరంలోని ప్రవేశించేసి ఓసారి చలాన్ వేయించుకుంటున్నారు. దీన్ని చూపిస్తూ ఆ రోజంతా సిటీలో విహరించేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ప్రతి జంక్షన్‌లోనూ జరిమానా విధించే అవకాశం ఉన్నా.. ఇప్పటి వరకు మానవతా దృక్పథంతో పోలీసులు అలా చేయలేదు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న కొన్ని కంపెనీలు తమ వాహనాలను నో ఎంట్రీ సమయంలోనూ తిప్పేస్తున్నాయి. రోజుకు ఒక చలాన్ చొప్పున చెల్లిస్తూ తమ పని కానిచ్చుకుంటున్నాయి. వీటి వల్ల ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతూ ఇతర వాహనచోదకులు ఇబ్బందులు పడటంతో పాటు కొన్నిసార్లు ప్రమాదాలూ జరుగుతున్నాయి. పెద్ద ప్రహసనమే.. వీటిని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఆయా వాహనాలు కనిపించిన వెంటనే ఆపి చలాన్ వేయడంతో పాటు నిషేధిత సమయం ముగిసే వరకు అనువైన ప్రాంతంలో ఆపేయాలని నిర్ణయించారు. మరోపక్క ఇలాంటి ‘నో ఎంట్రీ వాహనాలను’ స్వాధీనం చేసుకునే ఆస్కారం సైతం పోలీసులకు ఉంది. అయితే దీని వెనక పెద్ద ప్రహసనమే ఉంటోంది. రహదారిలో ఓ ప్రాంతంలో ఇలాంటి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడే ఉంచడం సాధ్యం కాదు. దాని డ్రైవర్‌ను పంపేసినా మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ పోలీసుస్టేషన్కో, గోషామహల్ స్టేడియానికో తరలించాలి. ఆపై సదరు డ్రైవర్/యజమాని జరిమానా చెల్లించి వచ్చి తీసుకువెళ్లే వరకు దాన్ని భద్రపరచాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మించి అనుమతి లేని సమయంలో వచ్చిన భారీ వాహనంలో నిత్యావసర, అత్యవసర, సున్నిత వస్తువులు ఉంటే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదు. భారీ శబ్దాలతో నరకం.. ►నో ఎంట్రీ సమయంలో వస్తున్న భారీ వాహనాల్లో డీసీఎంలే ఎక్కువ. ప్రమాదాల్లోనూ వీటిది పెద్ద స్థానమే. మరోపక్క రాత్రి అయిందంటే చాలు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులతో నిండిపోతున్నాయి. అడ్డదిడ్డంగా నడిచే ఈ వాహనాలు, అడ్డగోలుగా పార్కింగ్స్, భయానకమైన శబ్దాలు చేసే హారన్లు తోటి వాహనచోదకులతో పాటు నగర వాసులకూ నరకాన్ని చూపిస్తున్నాయి. ►రాత్రి 10 గంటల లోపు ప్రైవేట్ బస్సులు సిటీలోకి రావడానికి అనుమతి లేదు. రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు నిబంధనలు బేఖాతరు చేయడం, అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పార్కింగ్ చేయడం పరిపాటగా మారింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆయా వాహనాలకు నిర్దిష్ట విధానం రూపొందించడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ సమస్య తీరాలంటే ప్రయాణికుల్ని ఎక్కించుకోవడానికి, దింపడానికి ఈ వాహనాల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసుస్టేషన్ల వారీగా గుర్తించి ఏర్పాట్లు చేస్తేనే ఈ బస్సుల హడావుడికి చెక్ చెప్పవచ్చనే వాదన వినిపిస్తోంది. -
గవర్నర్ విమాన ప్రయాణానికి సీఎం అడ్డు
ముంబై: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో ఆ పరిస్థితి తీవ్రంగా ఉంది. తాజాగా గవర్నర్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవగా ఆయనకు ప్రభుత్వ అనుమతి లేదని తెలిసి ఆయన ప్రైవేటు విమానంలో డెహ్రూడన్ వెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో వివాదం రాజుకుంది. గవర్నర్ విమాన ప్రయాణానికి ముఖ్యమంత్రి అడ్డు తగిలారనే విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం సీఎం ఉద్దవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి మధ్య విభేదాలు పెరిగాయి. అవి తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నాయి. గవర్నర్ విమాన ప్రయాణానికి మహా అఘాడీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన విషాద సంఘటన గురించి తెలుసుకునేందుకు విమానంలో డెహ్రడూన్ వెళ్లేందుకు కోశ్యారి సిద్ధమయ్యారు. ఈ మేరకు ముంబైలోని విమానాశ్రయానికి వెళ్లి రెండు గంటల పాటు వేచి ఉన్నారు. ప్రభుత్వ విమానంలో కూర్చున్న తర్వాత 15 నిమిషాల తర్వాత టేకాఫ్‌కు అనుమతి రాలేదని ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చెప్పారు. దీంతో కోశ్యారి చివరికి మరో విమానంలో టికెట్ బుక్ చేసుకొని వెళ్లాల్సి వచ్చింది. వారం కిందటే గవర్నర్ పర్యటన గురించి ప్రభుత్వానికి చెప్పినా.. అనుమతి రాకపోవడం చాలా అసహజంగా ఉన్నదని గవర్నర్ కార్యాలయ వర్గాలు చెప్పాయి. దీనిపై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ స్పందించారు. గవర్నర్‌కు విమానం ఇచ్చారో లేదో తనకు తెలియదని, కార్యాలయానికి వెళ్లి తెలుసుకుంటానని చెప్పారు. దీనిపై శివసేన ఎంపీ వినాయక్ రౌత్ కూడా స్పందించారు. ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు గవర్నర్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆయన ప్రభుత్వ అనుమతి కోరారని అయితే ఆ విమానం ప్రయాణించగలదా లేదా అని తెలియలేదని పేర్కొన్నారు. ఈ కారణంగానే గవర్నర్‌కి అనుమతి లభించకపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనలు మాత్రం సీఎం, డిప్యూటీ సీఎం మాత్రమే ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు హక్కు ఉంది. ఇతరులు వాడాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ కారణంగానే అనుమతి లభించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కక్షపూరితంగానే ప్రభుత్వం గవర్నర్‌కు విమానం అనుమతి ఇవ్వలేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య గతంలోనే వివాదాలు ఉన్నాయి. లాక్డౌన్ అనంతరం రాష్ట్రంలో ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై గవర్నర్ ప్రశ్నించారు. దీనిపై సీఎం ఉద్దవ్ థాక్రే, గవర్నర్‌కు మధ్య లేఖల యుద్ధం జరిగింది. ఇప్పుడు తాజాగా విమాన అనుమతి విషయమై వివాదం రేగేలా ఉంది. -
చలో అసెంబ్లీకి అనుమతి లేదు..
సాక్షి, అమరావతి: చలో అసెంబ్లీకి అనుమతి లేదని.. ముట్టడికి యత్నిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయరావు హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ముసుగులో రెచ్చగొట్టేందుకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ నెల 31 వరకు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంత ప్రజలు సహకరిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అరాచక శక్తులపై నిఘా పెట్టామని పేర్కొన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తామని చెప్పారు. అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గరుడా కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ హెచ్చరించారు. -
ర్యాలీలకు అనుమతి నిరాకరణ
సాక్షి, విజయవాడ/గుంటూరు: రేపు (శుక్రవారం) ఉద్దండరాయునిపాలెం నుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు తలపెట్టిన మహిళల ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ విజయరావు తెలిపారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలుల్లో ఉన్నాయని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ర్యాలీలో ఎవరైనా పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బందరు రోడ్డులో ర్యాలీకి అనుమతి లేదు.. అమరావతి పరిరక్షణ సమితి, జాయింట్ యాక్షన్ కమిటీ రేపు (శుక్రవారం) బందరు రోడ్డులో చేపట్టనున్న ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. బెజవాడలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయన్నారు. బందరు రోడ్డులో నిత్యం వైద్య,విద్య,వ్యాపార అవసరాల కోసం ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారన్నారు. బందరు రోడ్డుకు ఆనుకుని ప్లైఓవర్ నిర్మాణ పనులు జరగడంతో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. సాధారణ జన జీవనానికి ఇబ్బంది కలగకుండా చేసే ప్రజా ఉద్యమాలకు పోలీస్ శాఖ సహకరిస్తుందని తెలిపారు. ర్యాలీలకు అనుమతిచ్చిన రోడ్డులో నిరసనలు తెలిపితే ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రజలకు ఇబ్బంది కలిగించే నిరసనలకు అనుమతి ఉండదని సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. -
నరేష్ గోయల్‌కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు గోయల్ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. గ్యారంటీ సొమ్ము చెల్లించకుండా దేశం విడిచి వెళ్లరాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఒకవేళ దేశం విడిచి విదేశాలకు వెళ్లాలనుకుంటే 18వేల కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేమని న్యాయమూర్తి సురేష్ కైత్ స్పష్టం చేశారు. తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్కులర్‌ను సవాల్ చేస్తూ, దేశం విడిచి వెళ్లడానికి కోర్టు అనుమతిని కోరుతూ గోయల్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అలాగే దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా గోయల్ ఆయన భార్య అనిత దుబాయ్‌కు వెళుతుండగా మార్చి 25 న విమానాన్ని దింపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ రంగబ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా, డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో నరేష్ గోయల్‌కు తాజా షాక్ తగిలింది. -
బాక్సైట్ తవ్వకాలకు సర్కారు నో
సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను ఎట్టిపరిస్థితుల్లో జరిపే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయానికి తేల్చి చెప్పింది. బాక్సైట్ సరఫరా ఒప్పందం రద్దు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ నడుస్తున్నందున లండన్ ఆర్బిట్రేషన్‌ను (మధ్యవర్తిత్వం) నిలుపుదల చేయించాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని రాష్ట్ర గనుల శాఖ, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రతినిధి బృందం ఈ మేరకు పీఎంవోకు విజ్ఞప్తి చేసింది. విశాఖపట్నం ఏజెన్సీలో మైనింగ్ లీజులు, ఇతర అనుమతులన్నీ లభిస్తే అక్కడ తవ్వే ఖనిజాన్ని సరఫరా చేస్తామంటూ ఏపీఎండీసీ గతంలో ఆన్‌రాక్ జాయింట్ వెంచర్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తర్వాత కాలంలో ప్రభుత్వాలు మారడం, ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరపరాదని గిరిజనులు డిమాండ్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ఏపీఎండీసీ రద్దు చేసుకుంది. ఈ మేరకు ఏపీఎండీసీ, ఆన్‌రాక్, రస్ ఆల్ ఖైమా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసినట్టు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని ఆన్‌రాక్ సంస్థ హైకోర్టులో సవాల్ చేయగా, విచారణ కొనసాగుతోంది. మరోవైపు దుబాయ్‌కు చెందిన ఆన్‌రాక్ భాగస్వామ్య సంస్థ రస్ ఆల్ ఖైమా సంస్థ లండన్ కోర్టులో ఈ అంశంపై ఫిర్యాదు చేసింది. బాక్సైట్ ఖనిజం సరఫరా ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల తాము నష్టపోయామని, అందుకు భారత ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరింది. దీనిపై ఏడాదిగా లండన్ కోర్టులో ఆర్బిట్రేషన్ సాగుతోంది. ఈ నేపథ్యంలో పీఎంవో రాష్ట్ర అధికారులను పిలిపించి వివరాలు కోరింది. ఆగస్టు 5న లండన్‌లో ఆర్బిట్రేషన్‌కు రావాలని లండన్ కోర్టు నుంచి ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ అందిన నేపథ్యంలో అక్కడ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయడం కోసం పీఎంవో అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పిలిపించారు. ‘ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు, అందుకు దారితీసిన పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన వాదనకు సంబంధించి సమగ్ర పత్రాలు పంపించండి’ అని ప్రధాని కార్యాలయం రాష్ట్ర అధికారులకు సూచించింది. ‘మైనింగ్ లీజులతోపాటు అన్ని అనుమతులు లభిస్తే ఖనిజాన్ని తవ్వి ఆన్‌రాక్, రస్ ఆల్ ఖైమాకు సరఫరా చేస్తామని ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. అయితే, కొన్ని అనుమతులు రాలేదు. దీనివల్ల లీజులు ల్యాప్స్ అయ్యాయి. అందువల్ల ఖనిజాన్ని సరఫరా చేయలేకపోయినందుకు ఏపీఎండీసీ నష్టపరిహారం చెల్లించాల్సిన పనిలేదు’అని సీఎస్ వివరించారు. దీనిని బలపరిచేలా ఆధారాలు పంపాలని పీఎంవో అధికారులు సూచించారు. -
రథయాత్రకు బెంగాల్ సర్కారు నో
కోల్‌కతా: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ చేపట్టదలచిన రథయాత్రకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం అనుమతి నిరాకరించింది. రథయాత్రతో మతఘర్షణలు చెలరేగుతాయని తమకు నిఘా సమాచారం ఉందనీ, కాబట్టి యాత్రను తాము అనుమతించబోమని బెంగాల్ ప్రభుత్వం బీజేపీకి స్పష్టం చేసింది. గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో బీజేపీలోని ముగ్గురితో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా బెంగాల్ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. -
ఓయూలో రాహుల్ సదస్సుకు అనుమతి నిరాకరణ
-
సీపీఎం సభకు అనుమతి రద్దు
హైదరాబాద్: సీపీఎం చేపట్టిన మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 19న నిజాం కాలేజ్ గ్రౌండులో తలపెట్టిన సభకు ఇచ్చిన అనుమతిని పోలీసులు రద్దు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచ్చేస్తున్నారు. అయితే ఆయన రాకను ఆర్ఎస్ఎస్, ఇతర అనుబంధ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాగా, పోలీసులు అనుమతి ఇవ్వకున్నా అదే రోజు మరోచోట సభ నిర్వహిస్తామని సీపీఎం వర్గాలు స్పష్టం చేశాయి. -
ర్యాలీకి వస్తే భవిష్యత్తు ఉండదు: డీసీపీ
-
ర్యాలీకి వస్తే భవిష్యత్తు ఉండదు: డీసీపీ
నగరంలో బుధవారం నాడు తెలంగాణ జేఏసీ నిర్వహించాలని తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. అనుమతి లేని ర్యాలీలలో ఎవరూ పాల్గొనవద్దని ఆయన చెప్పారు. ఈ ర్యాలీలలో పాల్గొంటే నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. అలాంటి ర్యాలీలో పాల్గొన్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఇందిరా పార్కు వద్దకు ఎవరినీ రావద్దని కూడా ఆయన చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. అన్ని జిల్లాల ఎస్పీలు, నగరంలోని అందరు కమిషనర్లకు కోర్టు ఆదేశాల గురించి చెప్పామని అన్నారు. ఇందిరాపార్కు, సుందరయ్య విజ్ఞానకేంద్రం లేదా హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలవైపు రావాలని ప్రయత్నిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను తీసుకొస్తున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని, మొత్తం యువకుల్లో నలుగురైదుగురు అసాంఘిక శక్తులు చొరబడినా విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కాగా.. రేపు తలపెట్టిన భారీ ర్యాలీ నేపథ్యంలో ఇందిరా పార్కు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్కు సమీపంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. మరోవైపు, ఇప్పటికిప్పుడు చెప్పి నాగోలులోని మెట్రో గ్రౌండులో సభ నిర్వహించుకోమంటే ఎలా సాధ్యం అవుతుందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశ్నించారు. ఇప్పటికే తమపై వ్యక్తిగత దాడులు మొదలయ్యాయని, ఒక్కరోజే 600 మందిని అరెస్టు చేశారంటే ఇక రేపటి నిర్బంధం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని అన్నారు. -
మళ్లీ మొదలైంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో ఇసుక దోపిడీకి మళ్లీ తెరలేచింది. ప్రభుత్వ కార్యక్రమాలను సాకుగా చూపించి గోదావరి నదినుంచి ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అనుమతి ఇచ్చిన చోటే కాకుండా వేరే ప్రాంతాల్లోనూ తెగ తవ్వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి కూతవేటు దూరంలో గోదావరి ఇసుకను రెండు రోజులుగా దర్జాగా తరలించుకుపోతున్నారు. ఈ ప్రాంతంలో ర్యాంపు ఏర్పాటుకు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనుల పేరుతో దందా సాగిస్తున్నారు. ఇసుక తరలించే వాహనాలపై పోలవరం రైట్ మెయిన్ కెనాల్, 4 ప్యాకేజీ (పెదవేగి) అని రాసిన స్టిక్కర్లను అతికించారు. ఇక్కడ ఇసుక తవ్వకాలకు నియోజకవర్గంలోని ఒక ప్రజాప్రతినిధి అండదండలు ఉండటంతో అధికార యంత్రాంగం అటు వైపు కన్నెత్తి చూడలేదు. అనధికార అనుమతితో.. పోలవరం కుడి ప్రధాన కాలువ రెండవ ప్యాకేజీలో 14.92 కిలోమీటర్ల వద్ద, 4వ ప్యాకేజీలో పెదవేగి వద్ద కట్టడాలు, కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. రెండో ప్యాకేజీలో పనులకు సంబంధించి పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద మేట వేసిన ఇసుకను తవ్వుకునేందుకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు అనధికార అనుమతి ఇచ్చారు. దీంతో ఇక్కడ కొంతమేర ఇసుకను తవ్వి తరలించారు. అదే ముసుగులో పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో గోదావరి ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను అధికారులు గతంలోనే నిలిపివేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను చూసేం దుకు కేంద్ర బృందం వచ్చినప్పుడు ఇక్కడి తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ దిగువ భాగంలో తవ్వకాల వల్ల ప్రాజెక్ట్‌కు సమస్య వస్తుందని వారు అభ్యంతరం చెప్పడంతో జిల్లా కలెక్టర్ ఈ పనులను నిలిపివేయించారు. తిరిగి ఇప్పుడు తవ్వకాలు మొదలయ్యాయి. ఇదిలావుంటే పోలవరం మండలం గూటాల వద్ద మరో ఇసుక ర్యాంపు సిద్ధమవుతోంది. అభివృద్ధి పనులకు సంబంధించి తమకు అనుమతి వచ్చిందని చెబుతున్నారు. త్వరలో ఈ ర్యాంపులోనూ తవ్వకాలు మొదలు కానున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో ఇసుక తవ్వకాలపై తహసీల్దార్ ఎం.ముక్కంటిని వివరణ కోరగా.. అక్కడ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు. -
యువతపై ఉక్కుపాదమా?
♦ హోదా ఉద్యమకారులపై సర్కారు నిర్బంధం ♦ శాంతియుత ప్రదర్శనలపైనా ఆంక్షలు ► ఉద్యమాన్ని నీరుగార్చడమే లక్ష్యం ► హోదా పోరాటానికి అనుమతి లేదు: డీజీపీ ► విశాఖ దారుల్లో చెక్‌పోస్టులు, బీచ్‌లో సీసీ కెమెరాలు, ► అయినా వెనుకంజ వేసేది లేదంటున్న యువత ► ఇది ఆఖరిపోరాటం అంటూ కదులుతున్న యువతీ యువకులు సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి, అమరావతి, విశాఖపట్నం: సాగరతీరాన ఉత్తుంగ తరంగా లను ఆంక్షలతో ఎవరైనా ఆపగలరా?... జల్లికట్టు పోరాట స్ఫూర్తితో ప్రత్యేకహోదాను సాధించుకోవడం కోసం ఉరకలెత్తుతున్న యువతను అనుమతుల పేరుతో ఆపాలను కోవడం సరిగ్గా అలాంటిదే. గణతంత్ర దినో త్సవాన విశాఖ తీరంలోనూ, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలోనూ జరిగే కార్య క్రమాలలో పాల్గొనాలని, హోదా పట్ల తమ ఆకాంక్షను కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు గుర్తిం చేలా చేయాలని యువత సర్వసన్నద్ధమవు తు న్న నేపథ్యంలో వారిని ఎలాగైనాసరే అడ్డుకుని ఉద్యమాన్ని నీరుగార్చడానికి సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. హోదా కోసం జరిగే ర్యాలీలకు అనుమతి లేదని, తరలి వచ్చేవారిని అడ్డుకుంటామని డీజీపీ నండూరి సాంబశివరావు మంగళవారం మీడియా సమావేశంలో హెచ్చరించారు. విశాఖలో ప్రదర్శనలకు, ర్యాలీలకు ఎలాంటి అనుమతీ లేదని ఆయన స్పష్టం చేశారు. విశాఖతో పాటు విజయవాడ, తిరుపతి కార్యక్రమాల కూ అనుమతి లేదని డీజీపీ ప్రకటించారు. అనుమతుల్లేని ర్యాలీలు, ప్రదర్శనలలో పా ల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుం టామ ని, కేసులు పెడతామని విశాఖ కలెక్టర్, పోలీ సు కమిషనర్ హెచ్చరించారు. అన వసరంగా భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని విద్యార్థుల కు హితవు పలికారు. అవసరమైతే హౌస్ అరెస్టులు చేస్తామని, విశాఖ బీచ్‌లో సీసీ కెమెరాలు పెట్టామని వారు పేర్కొన్నారు. అయితే ఎంతటి నిర్బంధం ఎదురైనా వెను కంజ వేసే ప్రసక్తిలేదని, ప్రత్యేక హోదా ఉద్య మాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకే తీసుకు పోతామని యువత స్పష్టం చేస్తోంది. హోదా కోసం జరిగే అన్ని కార్యక్రమాలకు సంఘీభా వం ప్రకటించాలని, హోదా ఆకాంక్షను వెల్లడి స్తూ 26న కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనాల ని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునివ్వడం యువతలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. హోదాపై ఇంత నిర్బంధమా..? ఐదున్నర కోట్ల మంది ప్రజల ఏకైక ఆకాంక్ష ప్రత్యేక హోదాపై ఈ స్థాయిలో నిర్బంధం ప్రయోగించడం చూసి రాష్ట్రప్రజలు విస్తుపో తున్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున డీజీపీ ఇలా ప్రకటించారంటే అది ముఖ్యమంత్రి మాటగానే భావించాల్సి ఉంటుందని చర్చించుకుంటున్నారు. ప్రజల ఆకాంక్ష కోసం తాను ముందుండి కేంద్రంపై పోరాడాల్సిన ముఖ్యమంత్రి ఇలా ఉద్యమాన్ని నిర్బంధం ప్రయోగించి నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుం డడం విచారకరమని వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుప్రజల ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ.. తెలుగుప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా మారిన ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అనుమతిలేని నిరసనలు, ర్యాలీలలో పాల్గొనే వారిని అరెస్టు చేస్తామని, జైళ్లలో నిర్బంధిస్తా మని పోలీసులు అంటున్నారు. డీజీపీ వ్యాఖ్య లతో రాష్ట్రంలోని 13 జిల్లాల పోలీసు అధికా రులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ జరపతలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలను భగ్నం చేయడానికి వ్యూహాలు రచించడం ప్రారంభించినట్లు పోలీసు వర్గాల లో వినిపిస్తోంది. ముఖ్యనేతల గృహనిర్బంధా లతో ఉద్యమాన్ని నీరుగార్చాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిం చడంపైనా ఆంక్షలు విధిస్తుండడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మరో వైపు జిల్లాల్లో ప్రత్యేక హోదా ఉద్యమం విషయంలో చురుకుగా వ్యవహరిస్తున్న యువతీయువకుల సమాచారంపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు వినిపిస్తోంది. ఏది ఏమైనా ముందుకే.. రాష్ట్రానికి అపర సంజీవని అయిన ప్రత్యేక హోదాను ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ సాధించుకో లేమన్న అభిప్రాయం యువతలో గట్టిగా నెలకొంది. రెండున్నరేళ్లుగా ఎదురు చూసిన యువత ఇటు ఉద్యోగాలు లేక, అటు పరిశ్రమలు రాక తీవ్ర నిరాశలో కూరుకుపో యింది. దీనికి ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారం అన్న అభిప్రాయానికి వచ్చారు. పొరుగున ఉన్న తమిళనాడులో సాంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం రాష్ట్రమంతా ఒక్కతాటి పైకి రాగలిగినప్పుడు ఐదున్నరకోట్ల మంది ప్రజల జీవన్మరణ సమస్యగా ఉన్న ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకోలేమా అని ప్రశ్నతో యువత రగిలిపోతోంది. అందుకే ఎంతటి నిర్బంధం ఎదురైనా వెనుకంజ వేసేది లేదని యువతీయువకులు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చెబుతున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున జిల్లాకేం ద్రాలకు చేరుకునేందుకు అన్ని జిల్లాల్లోనూ యువతీయువకులు సన్నద్ధమౌతున్నారు. అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారు. పార్టీల కతీతంగా జరుగుతున్న ఈ పోరాటం లో అందరూ ఒక్కతాటిపై నిలవాలని, హోదా సాధించేవరకు పట్టుదలగా పోరాడాలని సామాజిక మాధ్యమాలలో ఒకరికొకరు సందే శాలు పంపించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ప్రత్యేకహోదాకు సంబంధించిన పోస్టులు, చర్చలే ఉంటున్నాయి. వ్యక్తిగత ప్రొఫైల్స్‌కు సంబంధించిన డిస్ప్లే పిక్చర్లన్నీ ప్రత్యేక హోదా డిమాండ్‌తో కూడిన పిక్‌లుగా మారిపోయాయి. ర్యాలీలను అనుమతించం..: డీజీపీ ‘‘ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న విశాఖ బీచ్ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోను అనుమ తించం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’అని డీజీపీ నండూరి సాంబశివరరావు ప్రకటించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళ వారం ఆయన మీడియా సమావేశం నిర్వహిం చారు. జల్లికట్టును ఆదర్శంగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం విశాఖ బీచ్‌లో యువత నిరసన తెలపాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న మెస్సేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియలేదన్నారు. ఎవరు నాయకత్వం వహిస్తున్నారో తెలియని ఇటువంటి కార్యక్రమాలతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పారు. పెద్ద కార్యక్రమాలు చేపట్టినప్పుడు నిర్వాహకులు ఎవరన్నది చూసి అనుమతి ఇస్తామని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వీఐపీలు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి నిరసనలు, ఆందోళనలు వంటి సోషల్ మీడియా పిలుపులకు, ట్వీట్లకు స్పందించి యువత పాల్గొనవద్దని కోరారు. విశాఖ బీచ్‌లోనే కాదు సోషల్ మీడియాలో పిలుపునిచ్చినట్టు విజయ వాడ, తిరుపతిలో ర్యాలీలకు అనుమతిలేదని, నిరసనలు జరుగుతాయనుకున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులోకి తెస్తామని, కాదని వస్తే అడ్డుకుంటామని డీజీపీ చెప్పారు. 26న కార్యక్రమాలకు అనుమతి లేదు: విశాఖ కలెక్టర్, కమిషనర్ విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ నెల 26న యువత తలపెట్టిన మౌన ప్రదర్శన. నిరసన కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ యోగానంద్‌లు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి యువత ఈ ప్రదర్శనల్లో పాల్గొని తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. ప్రత్యేక హోదా ఉద్యమ నేపథ్యంలో అప్రమత్త మైన జిల్లా యంత్రాంగం మంగళవారం సమీక్షించింది. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్, సీపీలు మీడియాతో మాట్లాడారు. ’జనవరి 26న రిపబ్లిక్ డే.. 27, 28 తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో ప్రదర్శనలు..ర్యాలీలు చేయడం తగదని కలెక్టర్, సీపీలు పేర్కొన్నారు. ఎలాంటి అనుమతుల్లేని ర్యాలీలు, ప్రదర్శనల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. కేసులు నమోదు చేస్తాం.. అనవసరంగా భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సీపీ హెచ్చరించారు ర్యాలీ చేయడానికి సిద్ధమైతే హౌస్ అరెస్ట్‌లు సైతం చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. ఇందుకోసం ఆర్కేబీచ్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, పోలీస్ చెక్‌పోస్టులు, పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
నిరసన కార్యక్రమాలకు పోలీసుల అనుమతి లేదు
-
ముద్రగడ యాత్రకు అనుమతులు లేవు
ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ రావులపాలెం (కొత్తపేట) : ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతులు లేవని ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ స్పష్టం చేశారు. రావులపాలెంలో చేపడుతున్న ముందస్తు చర్యలు పర్యవేక్షించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అనుమతులు కోరుతూ పోలీస్ అధికారులకు ఎవ్వరూ దరఖాస్తు చేయలేదన్నారు. అనుమతులు లేనందునా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు పోలీస్‌స్టేçÙ¯ŒSలో బందోబస్తు చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. బందోబస్తుపై సమీక్ష అమలాపురం టౌ¯ŒS : కాపుల పాదయాత్రకు సంబంధించి అమలాపురం పట్టణ పోలీసు స్టేష¯ŒSలో ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ పోలీసు అధికారులతో సోమవారం రాత్రి సమీక్షించారు. యాత్ర అనివార్యమైతే అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చించారు. కోనసీమలో జిల్లాల వారీగా నియమింపబడ్డ బందోబస్తుల జాబితాలకు అనుగుణంగా ప్రతి మండలంలో పోలీసు బలగాలపై ఆరా తీశారు. వంతెనలపై ఏర్పాటు చేసే చెక్ పోస్టులు, డ్రో¯ŒS కెమెరాలు, రాపిడ్ యాక్ష¯ŒS ఫోర్సు తదితర అంశాలపై ఆయన లోతుగా సమీక్షించారు. డీఎస్పీ లంక అంకయ్య, సీఐలు వైఆర్కే శ్రీనివాస్, జి.దేవకుమార్, ఇతర సీఐల నుంచి కూడా డీఐజీ బందోబస్తుకు సంబంధించి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. కోనసీమ దిగ్బంధనానికి రూపొం దించిన ప్రణాళికపై ఆయన చర్చించారు. -
క్రమ‘బద్ధ’కంగా
నెలాఖరవుతో ముగుస్తున్న గడువు జిల్లాలో అనధికార కట్టడాలు సుమారు 10,000 వచ్చిన దరఖాస్తులు 6,690 రెగ్యులైజేషన్‌లో తాత్సారం క్రమబద్దీకరణ జరిగినవి కేవలం 929 మాత్రమే పరిశీలనలో 5,757 మండపేట : బీపీఎస్ రెగ్యులైజేషన్‌లో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది. వచ్చిన అరకొర దరఖాస్తుల క్రమబద్దీకరణ నత్తనడన సాగుతోంది. తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తయినవి కేవలం 13 శాతం మాత్రమే. నెలాఖరుతో భవనాల క్రమబద్ధీకరణ గడువు ముగియనుండగా నిర్ణీత లక్ష్యం చేరుకోవడం ప్రశ్నార్ధకంగా మారింది. బీపీఎస్‌కు జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల నుంచి 6,690 దరఖాస్తులు రాగా కేవలం 929 మాత్రమే క్రమబద్ధీకరించారు. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) ద్వారా పట్టణ ప్రాంతాల్లో 1985 జనవరి 1వ తేదీ నుంచి 2014 డిసెంబరు 31 మధ్యకాలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు గత ఏడాది మే నెల నుంచి డిసెంబరు నెలాఖరవు వరకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో దాదాపు 10 వేలు వరకు అనధికార కట్టడాలుండగా వీటి ద్వారా ఆయా స్థానిక సంస్థలకు సుమారు రూ.25 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా. నిర్ణీత గడువు ముగిసేనాటికి 6,690 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటి ద్వారా సుమారు రూ.8 కోట్లు ఆదాయం మాత్రమే సమకూరనుంది. జాప్యం ఇలా... మొదటి నుంచీ భవనాల క్రమబద్ధీకరణలో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది. జనవరి నుంచి రెగ్యులైజేషన్ చేపట్టారు. జూలై నెలాఖరు నాటికి భవనాల క్రమబద్ధీకరణకు గడువు ముగియగా పదిశాతం కూడా పూర్తికాకపోవడంతో మరో రెండు నెలలపాటు ప్రభుత్వం గడువు పెంచింది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండగా 77 శాతం దరఖాస్తులు ఇంకా ప్రోసెసింగ్లోనే ఉన్నాయి. మొత్తం 6,690 దరఖాస్తులు రాగా మంగళవారం నాటికి ఆన్లైన్ వివరాలు మేరకు రాజమండ్రి కార్పొరేషన్లో రెండు, అమలాపురంలో రెండు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన వాటిలో 929 దరఖాస్తులు పరిష్కరించగా మిగిలిన 5,757 దరఖాస్తులు ప్రోసెసింగ్‌లో ఉన్నాయి. క్రమబద్ధీకరణలో పెద్దాపురం మున్సిపాల్టీ ముందంజలో ఉండగా కాకినాడ, రాజమండ్రి నగర పాలక సంస్థలతోపాటు అమలాపురం, మండపేట తదితర పలు మున్సిపాల్టీల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్లాన్‌కు సంబంధించిన వివరాలు, యజమాని ఆధార్‌కార్డు, అటెస్టెడ్ దస్తావేజు కాపీలు తదితర వివరాలను ఆన్‌లైన్‌కు అప్లోడ్ చేయడంలో జాప్యం, దరఖాస్తుదారుల నుంచి పెనాల్టీ సొమ్ములు సకాలంలో వసూలు కాకపోవడం తదితర కారణాలతో క్రమబద్దీకరణ ఆశించిన స్థాయిలో జరగడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలాఖరవుతో గడువు ముగుస్తుండటంతో మిగిలిన దరఖాస్తులు ఏ మేరకు పరిష్కారమవుతాయనేది అనుమానాలకు తావిస్తోంది. గడువు ముగిసేనాటికి క్రమబద్ధీకరణ జరగకుంటే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధమమవుతోంది. ప్రోసెసింగ్‌లో ఉన్నందున చాలా వరకు క్రమబద్ధీకరణవుతాయని పట్టణ ప్రణాళికా విభాగం అధికారవర్గాలంటున్నాయి. జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో వచ్చిన దరఖాస్తులు, ఇప్పటి వరకు వాటి ప్రగతి వివరాలు కింది విధంగా ఉన్నాయి. పట్టణం వచ్చిన దరఖాస్తులు పరిష్కారమైనవి ప్రోసెసింగ్‌లో ఉన్నవి కాకినాడ 2,077 157 1,920 రాజమండ్రి 2,923 507 2,414 అమలాపురం 392 13 377 మండపేట 302 12 290 పెద్దాపురం 203 99 104 పిఠాపురం 119 17 102 రామచంద్రపురం 37 1 39 సామర్లకోట 51 19 32 తుని 421 71 350 గొల్లప్రోలు 38 4 34 ముమ్మిడివరం 79 11 68 ఏలేశ్వరం 45 18 27 -
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటా?
అనుమతుల్లేకుండా సన్నద్ధం న్యాయ పోరాటం చేస్తాం.. వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి కావటి మనోహర్‌నాయుడు అమరావతి: మండల కేంద్రమైన అమరావతి మద్దూరుడౌన్ సెంటర్లో ఎటువంటి అనుమతులు లేకుడా ఎన్టీఅర్ విగ్రహం ఏర్పాటు చేయడంపై పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కావటి శివనాగమనోహరనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎస్.ఐ వెంకటప్రసాద్‌కు ఫిర్యాదు అందించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ నగరాల అభివృద్ది పేరుతో ఆలయాలను నేలమట్టం చేసిన ప్రభుత్వం విజయవాడలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వైఎస్సార్ విగ్రహన్ని తొలగించటం దారుణమన్నారు. ఇటీవల అమరావతిలో రోడ్డు విస్తరణ అడ్డుగా ఉన్నాయనే సాకుతో జాతీయ నాయకులైన మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను తొలగించి, పక్కనే మూడు రోడ్ల కూడలిలో ఎన్టీఅర్ విగ్రహం ఏర్పాటు చేయడం టీడీపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. -
'అనుమతి లేకుండా చంద్రబాబు భవన నిర్మాణం'
-
'అనుమతి లేకుండా చంద్రబాబు భవన నిర్మాణం'
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హైదరాబాద్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.65లో ఆయన చేపడుతున్న ఇంటి నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతి మంజూరు కాలేదు. ఈ విషయాన్ని స్వయంగా జీహెచ్ఎంసీయే ప్రకటించింది. ఇప్పటివరకు భవన నిర్మాణానికి పెట్టుకున్న దరఖాస్తును అనుమతించలేదంటూ చెబుతుండగా, తాము రెండు రోజుల క్రితమే ఆ దరఖాస్తును తిరస్కరించామని ఇప్పుడు జీహెచ్ఎంసీ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ దరఖాస్తు తమ వద్ద పెండింగులో లేదని తెలిపాయి. చంద్రబాబు, లోకేష్ మే 18వ తేదీన జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారని, అయితే లే అవుట్ ప్రకారం చూస్తే భవనం ఎత్తు, నిర్మాణ సెట్ బ్యాక్ నిబంధనలకు అనుగుణంగా లేవని జీహెచ్ఎంసీ తెలిపింది. అందుకే తాము ఈనెల 16వ తేదీన చంద్రబాబు, లోకేష్ పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించామంది. అయితే.. అనుమతి లేకుండానే అక్కడ భవన నిర్మాణానికి పిల్లర్లు వేశారని, ఇప్పటివరకు దీనిపై వచ్చిన కథనాలు అవాస్తవమని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. అయితే, సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగిస్తున్న భవనాలకు ఆస్తి పన్ను కడితేనే తన ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారంటూ చంద్రబాబు నాయుడు బుధవారం నాడు కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. దాదాపు నెలన్నర నుంచి తన దరఖాస్తును అనుమతించకుండా పెండింగులో ఉంచారని ఆయన అన్నారు. సెక్షన్ 8 అమలులో లేకపోవడం వల్లే హైదరాబాద్ నగరంలో స్వయంగా తాను కూడా ఇబ్బందుల పాలవుతున్నానని చెప్పారు. అయితే ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్ ఉందన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. ఇప్పుడు నిబంధనలను అతిక్రమించడం వల్లే దరఖాస్తు తిరస్కరించినట్లు జీహెచ్ఎంసీ చెప్పడం గమనార్హం. -
'చిరంజీవి ఆవిష్కరించిన విగ్రహానికి అనుమతిలేదు'
-
'చిరంజీవి ఆవిష్కరించిన విగ్రహానికి అనుమతిలేదు'
రైల్వేకోడూరు: రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరులో సినీ నటుడు, ఎంపీ చిరంజీవి పాల్గొన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. రైల్వేకోడూరులో చిరంజీవి.. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్నిఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే నిర్వాహకులు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి తీసుకోలేదు. దాంతో విగ్రహం పెట్టడానికి అనుమతి లేదంటూ 18 మంది నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆగ్రాలోనూ కుదరదు..
ఆగ్రా: ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి మరోసారి భంగపాటు ఎదురైంది. ఆగ్రాలో ఈ నెలలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు జిల్లా అధికారులు. స్థానిక ఎంఐఎం నేతలు మార్చి 29న ఆగ్రాలో ర్యాలీ, బహిరంగసభను ఏర్పటు చేశారు. దీనికి ఓవైసీ హాజరుకానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పాఠశాలల ఫైనల్ పరీక్షల కారణంగా బహిరంగ నిర్వహించడం సాధ్యంకాదని జిల్లా అధికారి రాజేష్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ఓవైసీ సభకు అనుమతిస్తే నగరంలోని ప్రశాంతవారణానికి విఘాతం కలిగే అవకాశ ఉందనీ...అనుమతి నిరాకరించాలని కోరుతూ భజరంగ దళ్, వీహెచ్‌పీ, హిందూజాగరణ్ మంచ్ లాంటి సంస్థలు స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో కూడా ఒవైసీ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. -
'ఉల్లంఘిస్తే అరెస్ట్‌లు తప్పవు'
హైదరాబాద్: సచివాలయాన్ని ఎర్రగడ్డకు... చెస్ట్ ఆసుపత్రిని అనంతగిరికి తరలించొద్దంటూ టీ పీసీసీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర నిర్వహించనుంది. కాగా ఈ పాదయాత్రకు నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. తాము అనుమతి కోరిన పోలీసులు నిరాకరించారంటూ టీ పీసీసీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పాదయాత్రలో పాల్గొనే నేతలు, కార్యకర్తలను తరలించేందుకు పోలీసులు వాహనాలను సిద్ధం చేశారు. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. అరెస్ట్‌లు తప్పవంటూ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఎర్రగడ్డకు... చెస్ట్ ఆసుపత్రిని అనంతగిరికి తరలించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అన్ని రాజకీయా పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర నిర్వహించి... గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాలని భావించారు. పాదయాత్రకు పోలీసుల అనుమతి కోరగా... వారు నిరాకరించారు. -
'నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమే'
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారంపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ, రెవిన్యూ అధికారులు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ భవనాన్ని తనిఖీ చేసి అక్రమ నిర్మాణం చేపట్టారని గుర్తించగా, ఎన్ కన్వెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమేనని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి హైకోర్టులో వాదించారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారని చెప్పారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎన్కన్వెన్షన్ నిర్మాణానికి చేసిన దరఖాస్తును జీహెచ్ఎంసీ తిరస్కరించిందని అన్నారు. తనిఖీలు కోసమే ఎన్కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లారని కోర్టుకు తెలిపారు. హైదరాబాద్‌లో చెరువులను పట్టించుకోవడం లేదంటూ లోకాయుక్తలో గతంలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయని, లోకాయుక్త ఆదేశాలమేరకే లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎన్కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీకి కూల్చివేతతో సహా అన్ని అధికారాలున్నాయని, హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఎలాంటి చర్యలకూ దిగబోమని చెప్పారు. కాగా ఇది ఏమాత్రం సర్వే ఎక్సర్సైజ్ కాదని, నోటీసులు ఇవ్వకుండా వ్యక్తుల ఆస్తుల్లోకి చొరబడటం హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్ కన్వెన్షన్ తరపు న్యాయవాదులు వాదించారు. జీహెచ్ఎంసీ అధికారులు చట్టపరమైన ప్రక్రియను అనుసరించలేదని చెప్పారు. ప్రైవేటు ఆస్తుల్లో తనిఖీలు చేసేముందు కచ్చితంగా నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. -
చంద్రబాబు ఢిల్లీ దీక్షకు అనుమతి లేదు
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకోకుండానే ఏపీ భవన్లో దీక్ష చేపట్టారు. ఈ విషయాన్ని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ స్పష్టం చేశారు. చంద్రబాబు దీక్షకు అనుమతి లేదని ఆయన చెప్పారు. సోమవారం మధ్యాహ్నం చంద్రబాబు డిమాండ్ ఏంటో చెప్పకుండానే దీక్ష మొదలు పెట్టారు. హైదరాబాద్‌లో ఉదయం ఆయన ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఢిల్లీ బయలుదేరి వచ్చారు. ఇక్కడ బాపు ఘాట్ వద్ద కూడా నివాళులర్పించి దీక్షకు కూర్చున్నారు. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ఆశయాలకు నిలువునా తూట్లు పొడిచిన చంద్రబాబుకు ఎన్టీఆర్ఘాట్ వద్ద నివాళులర్పించే నైతిక హక్కు లేదని ఎన్టీఆర్ అభిమానులు విమర్శించారు.