కోల్‌కతా: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ చేపట్టదలచిన రథయాత్రకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం అనుమతి నిరాకరించింది. రథయాత్రతో మతఘర్షణలు చెలరేగుతాయని తమకు నిఘా సమాచారం ఉందనీ, కాబట్టి యాత్రను తాము అనుమతించబోమని బెంగాల్ ప్రభుత్వం బీజేపీకి స్పష్టం చేసింది. గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో బీజేపీలోని ముగ్గురితో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా బెంగాల్ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, డీజీపీలను హైకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment