ఆ ఆస్తులు ఎవ్వరికీ వద్దంట | No takers for Kingfisher Airlines's brands and trademarks in auction | Sakshi
Sakshi News home page

ఆ ఆస్తులు ఎవ్వరికీ వద్దంట

Published Sat, Apr 30 2016 3:03 PM | Last Updated on Sat, Apr 6 2019 9:07 PM

ఆ ఆస్తులు ఎవ్వరికీ వద్దంట - Sakshi

ఆ ఆస్తులు ఎవ్వరికీ వద్దంట

ముంబయి: బ్యాంకులు వేలం వేస్తున్న మాల్యా ఆస్తుల కోసం ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకప్పుడు ఓ వెలుగువెలిగిన మాల్యాకు చెందిన కింగ్‌ ఫిషర్ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకునేందుకు బిడ్డర్లు సాహసించడం లేదు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ బ్రాండ్స్, ట్రేడ్ మార్క్కు శనివారం బ్యాంకులు వేలం నిర్వహించినప్పటికీ ఒక్క బిడ్డరు కూడా కోట్ చేయలేదు.

కనీసం రిజర్వు ధర 366 కోట్లు కూడా కోట్ చేయలేదు. మొత్తం 17 బ్యాంకులు తాము ఇచ్చిన రుణాలను మాల్యా నుంచి రాబట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం కింగ్ ఫిషర్ ఆస్తుల్లో భాగమైన ఎయిర్ లైన్స్ బ్రాండ్స్, ట్రేడ్ మార్క్ రిజర్వు ధర రూ.366.70కోట్లుగా నిర్ణయించారు. అయితే, ఆ ధరను కూడా ఒక్క బిడ్డరూ కోట్ చేయకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement