King Fisher
-
మార్కెట్లోకి మళ్లీ కింగ్ ఫిషర్ బీర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్ల సరఫరా తిరిగి కొనసాగనుంది. బీర్లను యథాతథంగా సరఫరా చేసేందుకు యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) సంస్థ అంగీకరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే బీర్ల సరఫరాను పునరుద్ధరించాలని నిర్ణయించాం. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)తో నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయి.మేం అడుగుతున్న విధంగా నిర్ణీత కాల వ్యవధిలో ధరలను సవరించేందుకు, బకాయిలను చెల్లించేందుకు కార్పొరేషన్ హామీ ఇచి్చంది. ఈ క్రమంలో బీర్ వినియోగదారులు, మా సంస్థలో పనిచేసే కారి్మకులు, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రయోజనాల మేరకు కొంతకాలం వరకు బీర్లు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’అని యూబీ కంపెనీ ప్రతినిధి నిఖిల్ మల్పాని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ లిమిటెడ్‌కు సోమవారం రాసిన లేఖలో వెల్లడించారు. సోమవారం నుంచే యూబీ బ్రూవరీస్ నుంచి టీజీబీసీఎల్ డిపోలకు కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరా ప్రారంభమైంది. తగ్గిపోయిన బీర్ల నిల్వలురాష్ట్రంలో అమ్ముడయ్యే బీర్లలో 70 శాతం యూబీ కంపెనీకి చెందినవే. ఈ నెల 8వ తేదీన ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం మేరకు.. కింగ్‌ఫిషర్, హెన్కీన్ బీర్ల సరఫరా నిలిచిపోయింది. అయితే అప్పటికే రాష్ట్రంలోని మద్యం డిపోల్లో సుమారు 11 లక్షల కేసుల కింగ్‌ఫిషర్ బీర్లు నిల్వ ఉన్నాయి. వాటితోపాటు ఇతర కంపెనీలు తయారు చేసే మరో ఏడు రకాల బ్రాండ్లు కలిపి మొత్తం 15 లక్షల కేసుల స్టాక్ ఉంది. అయితే యూబీ కంపెనీ నిర్ణయం నేపథ్యంలో బీర్ల కొరత రాకుండా ఎక్సైజ్ శాఖ జాగ్రత్త పడింది. టీజీబీసీఎల్ డిపోల నుంచి గత 12 రోజులుగా రేషన్ పద్ధతిలో బీర్లను మార్కెట్లోకి పంపింది. సంక్రాంతి పండుగ కూడా ఉండటంతో ఎక్కడా బీర్ల కొరత రాకుండా ఉండేలా చూసింది. అయినా ఆదివారం నాటికి బీర్ల నిల్వ లక్ష కేసులకు తగ్గిపోయింది. ఇంకో రెండు రోజులైతే రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉండేది. ఈలోగానే యూబీ కంపెనీ బీర్ల సరఫరా ప్రారంభించింది. రేట్ల పెంపుపై ఏం చేద్దాం? ఈ పరిణామాల నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై ఎక్సైజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు సోమవారం సచివాలయంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మద్యం కంపెనీలు అడుగుతున్న విధంగా బేసిక్ ధరల పెంపు, సీఎం ఆదేశించిన మేరకు కొత్త కంపెనీల నుంచి మద్యం సరఫరా కోసం నోటిఫికేషన్ విడుదల తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది.‘కింగ్ ఫిషర్’బీర్ల ఉత్పత్తి వేగవంతం! సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణలో బీర్ల సరఫరాను పునరుద్ధరించాలని నిర్ణయించిన యూబీ కంపెనీ వేగంగా బీర్ల ఉత్పత్తి చేపట్టింది. సంగారెడ్డి జిల్లాలో ఈ కంపెనీకి ఉన్న రెండు బీర్ ఫ్యాక్టరీల్లో సోమవారమే బీర్ల తయారీని మొదలుపెట్టింది. నిజానికి రాష్ట్రంలో బీర్ల సరఫరాను వీటిలో రోజుకు సుమారు 15 లక్షల బాటిళ్ల బీర్ల ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి బీర్లు సరఫరా చేస్తుంది. అయితే తెలంగాణలో బీర్ల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించిన సమయంలో.. ఈ రెండు ఫ్యాక్టరీల్లో లేఆఫ్‌ను ప్రకటించింది. ఉత్పత్తిని నిలిపివేస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని కారి్మకశాఖకు లేఖ కూడా రాసింది. దీంతో ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న సుమారు 600 మంది ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై యాజమాన్యం ప్రతినిధులు, కారి్మక సంఘాల నేతలతో జిల్లా కలెక్టర్ క్రాంతి సోమవారం చర్చలు జరిపారు కూడా. అయితే బీర్ల సరఫరా పునరుద్ధరణకు నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాక్టరీల్లో లేఆఫ్ ఎత్తివేశారు. -
కేఎఫ్ బీర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఎ క్సైజ్ శాఖకు యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ ఝలక్ ఇచ్చింది. తాము తయారు చేసే బీర్లను ఇక నుంచి తెలంగాణలో సరఫరా చేయబోమని ఆ కంపెనీ ప్రకటించింది. బేసిక్ ధరలు పెంచలేదని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు కంపెనీ నిబంధనల ప్రకారం...ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్), బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగైదు బ్రాండ్ల బీర్లకు మంచి మార్కెట్ ఉంది. అందులో యూబీ తయారు చేసే కింగ్‌ఫిషర్ బీర్లదే సింహభాగం. మొత్తం తెలంగాణ మార్కెట్లో 72 శాతం వరకు ఈ బ్రాండ్‌దే ఉంటుందని అంచనా. ఈ బీర్లు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు సరఫరా చేసినందుకుగాను కేస్‌కు రూ.289 చొప్పున తయారీదారులకు చెల్లిస్తారు. ఈ బేసిక్ ధర పెంచాలన్న డిమాండ్ ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా వినిపిస్తున్నా, అమల్లోకి రాకపోవడంతో తాజా సమస్య ఏర్పడింది. తక్షణమే నిలిపివేస్తున్నాం...యూబీ కంపెనీ సెక్రటరీ నిఖిల్ మల్పానీ పేరుతో బుధవారం స్టాక్ ఎక్సే్చంజ్‌లకు ఇచ్చిన సమాచారాన్ని జాతీయ మీడియా బహిర్గతం చేసింది. ఈ లేఖలో పేర్కొన్న ప్రకారం యూబీ తయారు చేసే బీర్ల సరఫరాను తెలంగాణలో తక్షణమే నిలిపివేయనుంది. 2019–20 నుంచి కంపెనీకి చెల్లించే బేసిక్ ధరలను తెలంగాణ ప్రభుత్వం సవరించలేదని, దీని కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో వెల్లడించారు. టీజీబీసీఎల్ చెల్లించాల్సిన పెద్ద మొత్తం పెండింగ్‌లో ఉందని, ఈ కారణంగానే తాము బీర్లు సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది.పలుమార్లు విజ్ఞప్తులుఐదేళ్లుగా బీర్, లిక్కర్ తయారీదారులకు బేసిక్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదు. ముఖ్యంగా బీర్ తయారీదారులకు ఎప్పటి నుంచో కేస్‌కు రూ.289 మాత్రమే చెల్లిస్తున్నారు. బీర్ల తయారీకి ఉపయోగించేముడి పదార్థాల ధరలు పెరిగినందున బేసిక్ ధరలు పెంచాలని యూబీతోపాటు అనేక కంపెనీలు కూడా ప్రభుత్వాన్ని కోరాయి. కొద్ది రోజుల క్రితం ఆలిండియా బీర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సీఎంతోపాటు ఎక్సైజ్ మంత్రి వద్ద జరిగిన అంతర్గత చర్చల్లోనూ లిక్కర్ కంపెనీల బేసిక్ ధరలు పెంచేది లేదని కరాఖండిగా తేల్చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే యూబీ కంపెనీ తమ ఉత్పత్తులను రాష్ట్రంలో సరఫరా చేయరాదని నిర్ణయించింది. వారం రోజులు ఓకే..బీర్ల సరఫరా తక్షణమే నిలిపివేసినా, మార్కెట్లో బీర్ల కొరత ఇప్పటికిప్పుడే రాదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే యూబీ కంపెనీ నుంచి టీజీబీసీఎల్‌కు అందిన బీర్లు మరో ఆరేడురోజుల పాటు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతేనే ఫలానా బ్రాండ్ బీర్ల కొరత ఏర్పడుతుందని చెబుతున్నాయి. అయితే వైన్‌షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. వీలున్నంత ఎక్కువగా కింగ్‌ఫిషర్ బీర్లకు ఇండెంట్ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిపోల వద్ద రేషన్ విధించే యోచనలో ఎక్సైజ్ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. చర్చలకు సిద్ధంగా ఉన్నాం : టీజీబీసీఎల్ ఎండీకి యూబీ కంపెనీ లేఖధరల పెంపు, బకాయిల విషయంలో నిర్ణయం తీసుకోనందునే తాము బీర్ల సరఫరాను బుధవారం నుంచి నిలిపివేసినట్టు, ఈ ప్రతిష్టంభనను తొలగించకుకోవడానికి టీజీపీసీఎల్తో చర్చలకు సిద్ధమని యూబీ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు టీజీ బీసీఎల్ ఎండీ, ఎక్సైజ్ డైరెక్టర్ చెవ్వూరి హరికృష్ణకు యూబీ కంపెనీ చీఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ ఆఫీసర్ గరీమాసింగ్ లేఖ రాశారు. ఏప్రిల్ 1, 2024 నాటికి తమకు రూ.702 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, గత ఏడాది అక్టోబర్ నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదని ఆ లేఖలో తెలిపారు. బేసిక్ ధర పెంపు నిర్ణయం జరిగిన వెంటనే బీర్ల సరఫరాను యథాతథంగా కొనసాగిస్తామని వెల్లడించారు. తమ బకాయిలు సెప్టెంబర్ 2025 లోపు దశలవారీగా చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీజీ బీసీఎల్‌కు రాసిన లేఖలో గరీమాసింగ్ స్పష్టం చేశారు.ధరలు పెంచడమే న్యాయం ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో బీర్ తయారీ కంపెనీలకు బేసిక్ ధర పెంచడమే న్యాయం. ఈ క్రమంలో స్థానిక అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపి పెంచితే మంచిది. ప్రభుత్వం రమ్మంటే వెళ్లి చర్చిస్తాం. యూబీ కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడతాం. కానీ, న్యాయమైన ధర మాత్రం ఇవ్వాల్సిందే. – ఎం.కామేశ్వరరావు, అసోసియేషన్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్» స్టాక్ ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ వర్గాల్లో అలజడి» మార్కెట్లో 72 శాతానికి పైగా వాటా ఉన్న కింగ్‌ఫిషర్ బ్రాండ్ తయారు చేసేది యూబీనేధరల పెంపుపై ఒత్తిడి తేవడం పద్ధతి కాదు: జూపల్లిబీర్ల ధరల పెంపు అంశంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకోకముందే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌పై ఒత్తిడి తేవడం పద్ధతి కాదని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గుత్తాధిపత్యంతో బీర్ల ధరలు పెంచాలని యూబీ కంపెనీ చూస్తోందని విమర్శించారు. ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం తలొగ్గే ప్రశ్నే లేదన్నారు. బుధవారం సచివాలయ మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడారు. ఒక్కో బీరుపై దాదాపు 33.1 శాతం పెంచాలని కంపెనీ అడుగుతోందని, అలా చేస్తే బీరు ధర రూ.150 నుంచి రూ.250 వరకు పెరుగుతుందన్నారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో గతంలోనే కమిటీ వేశామని, కమిటీ నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యూబీ కంపెనీ మార్కెట్ షేర్ 72 శాతం ఉంది కదాని.. ప్రజలు డిమాండ్ చేస్తారు కదాని ఇష్టానుసారంగా ధరలు పెంచాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,130 కోట్లు చెల్లించామని, ఇంకా రూ. 658 కోట్లు చెల్లించాల్సి ఉందని, కానీ కంపెనీ రూ.702 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలోని బకాయిలే రూ.407 కోట్లు ఉన్నాయన్నారు. పక్క రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువ రేట్లు ఉన్న విషయం వాస్తవమేనని, కర్ణాటకలో రూ.190, ఏపీలో రూ.180 ఒక్కో బీరు ధర ఉంటే, తెలంగాణలో రూ.150 ఉందన్నారు. 14 లక్షల కేసుల స్టాక్ ప్రస్తుతం ఉందని, సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పైసా కూడా ట్యాక్స్ పెంచలేదని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. -
కప్పం కడితేనే ‘కింగ్ ఫిషర్’!
సాక్షి, అమరావతి: ‘మాకు లాభం ఉంటేనే లారీలు కదులుతాయి’.. ‘మాకు కప్పం కడితేనే కింగ్ ఫిషర్ బీరు మార్కెట్లోకి వస్తుంది.. లేదంటే అంతే సంగతులు’ అని పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.. టీడీపీ కూటమి ముఠా. డీల్ సెట్ కాకపోతే కంపెనీలోకి ఒక్క లారీని రానివ్వం.. పోనివ్వం అని తెగేసి చెబుతోంది. దీంతో కింగ్ ఫిషర్ బీరును ఉత్పత్తి చేసే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ అధికార పార్టీ దాష్టీకానికి బెంబేలెత్తుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్న ఈ సిండికేట్‌ను ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు వర్గం తెరముందు నడుపుతుంటే.. తెర వెనుక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వర్గం చక్రం తిప్పుతోంది. నెలకు రూ.1.50 కోట్లు చొప్పున ఏడాదికి రూ.18 కోట్లు తమకు కప్పం కింద కట్టాలని కంపెనీకి కూటమి ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకు యునైటెడ్ బ్రూవరీస్ సిద్ధంగా లేకపోవడంతో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి మొదలుకావడం లేదు.అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ కూటమి ముఠా..శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) బీర్ కంపెనీ ఉంది. తమ ఫ్యాక్టరీలో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆ కంపెనీ చేస్తున్న యత్నాలకు అడుగడుగునా టీడీపీ కూటమి ముఠా అడ్డు పడుతోంది. ముడి సరుకును ఫ్యాక్టరీకి తీసుకువచ్చి, ఉత్పత్తి చేసిన సరుకును ఫ్యాక్టరీ నుంచి బయటకు తీసుకువెళ్లే ఒక్కో లారీకి రూ.వేయి చొప్పున కప్పం చెల్లించాలని ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం కరాఖండీగా తేల్చిచెప్పిందనే విషయం సంచలనం సృష్టించింది. ఎందుకంటే లోడింగ్, అన్ లోడింగ్ కోసం రోజుకు సగటున 500 లారీలు వస్తాయి.. ఆ లెక్కన రోజుకు రూ.5 లక్షల చొప్పున నెలకు రూ.1.50 కోట్ల వరకు కప్పంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఈ మొత్తం 18 కోట్లు. అంత భారీ మొత్తం కప్పంగా చెల్లించలేమని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులు ఏకంగా ఆ ఫ్యాక్టరీపై దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కంపెనీ ఆస్తులను ధ్వంసం చేయడమేకాకుండా కంపెనీలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై దాడి చేసి భయోత్పాతం సృష్టించారు.దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు మొదట పట్టించుకోలేదు. కేంద్ర హోం శాఖకు నివేదించడంతో ఢిల్లీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో పోలీసులు ఒక రోజు తరువాత కేసు నమోదు చేశారు. మరోవైపు కంపెనీ ఉద్యోగులపై ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించడం గమనార్హం. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని కప్పం కట్టేలా డీల్ సెట్ చేసినట్టు సమాచారం. ఆయన ఆదేశాలతో కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరరావుతో రాజీ చర్చలు కూడా జరిపారు. తాము అడిగినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు కప్పం కడితేనే బీర్ ఉత్పత్తి ప్రారంభించకోవచ్చని ఎమ్మెల్యే వర్గం కంపెనీకి తేల్చిచెప్పింది. కంపెనీ యాజమాన్యం ససేమిరా.. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం డిమాండ్ చేసినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు వరకు కప్పంగా చెల్లించేందుకు యూబీ కంపెనీ యాజమాన్యం ససేమిరా అన్నట్టు సమాచారం. బంటుమల్లిలోని ఒక్క యూనిట్‌కే ఏడాదికి ఏకంగా రూ.18 కోట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మామూళ్లుగా ఇవ్వడం తలకుమించిన భారంగా ఆ కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో రూపంలో కొంత మొత్తం అయితేనే ఇవ్వగలమని చెప్పినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం భగ్గుమంది. ఫ్యాక్టరీలోని బీరు ఉత్పత్తికి అడ్డుపడుతోంది. రెండు రోజులుగా ఫ్యాక్టరీకి లారీలు వస్తున్నా అందులోని ముడి సరుకును అన్లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా ఇప్పటికే ఉత్పత్తి చేసిన బీరును మార్కెట్లోకి పంపేందుకు లారీల్లోకి లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా కళాసీలెవరూ పనిలోకి రావడానికి వీల్లేదని ఎమ్మెల్యే వర్గం ఆల్టిమేటం జారీ చేసింది. ఎమ్మెల్యే వర్గం గుప్పిట్లోనే కళాసీల సంఘం ప్రతినిధులు ఉండటం గమనార్హం. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయుల దాష్టీకంతోయూబీ ఫ్యాక్టరీ ముందు భారీ సంఖ్యలో లారీలు బారులు తీరి ఉన్నాయి. ఎమ్మెల్యే వర్గం హెచ్చరికలకు భయపడి ఎవరూ ముడి సరుకును అన్లోడింగ్ చేయడం లేదు. దాంతో యూబీ ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు ఉత్పత్తి కోసం తెప్పించిన ముడి సరుకు సైతం లారీల్లోనే మగ్గిపోతోంది. ముడి సరుకు పాడైపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కంపెనీ ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.డ్రామాను అదరగొడుతున్న అచ్చెన్నఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు డబుల్ గేమ్ ఆడుతుండటం గమనార్హం. కంపెనీ ప్రతినిధులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావుతో మాట్లాడినట్టు అచ్చెన్నాయుడు కథ నడిపించారు. తాను చెబుతున్నా కళాసీలు వినడం లేదని చెప్పి ఎమ్మెల్యే ఈశ్వరరావు తప్పించుకున్నారు. అయితే మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే ఈశ్వరావు పక్కా పన్నాగంతోనే ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా సాగదీస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి కొన్ని రోజుల పాటు నిలిచిపోతే యాజమాన్యం తప్పనిసరిగా తమ కాళ్లబేరానికి వస్తుందనేదే ఇద్దరు నేతల ఉద్దేశమని అంటున్నారు. అదే అదనుగా భారీగా కప్పం డిమాండ్ చేసి సాధించుకోవచ్చని కుట్రపన్నారు. పారిశ్రామికవేత్తల ఆందోళన..అధికారంలోకి వచ్చీ రావడంతోనే కూటమి నేతల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామికవేత్తల పట్ల ప్రభుత్వ వైఖరిపై వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ పంతం వీడటం లేదు. యూబీ కంపెనీ ఉదంతం ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము డిమాండ్ చేసినంత కప్పం కడితేనే రాష్ట్రంలో ఏ కంపెనీ అయినా మనుగుడ సాగిస్తుంది.. లేదంటే ఆ కంపెనీ మూత పడాల్సిందేనని స్పష్టం చేస్తోంది. -
ఆకాశం హద్దులు దాటించిన వ్యక్తి.. ఇప్పుడెక్కడ?
Deccan Aviations GR Gopinath దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. ఆ మాటల స్ఫూర్తికి వాస్తవ రూపం ఇచ్చినవారిలో జీఆర్ గోపినాథ్ ఒకరు. విమాన ప్రయాణం చేసే హక్కు సంపన్నులకే కాదు. ఈ దేశంలో ఉన్న సామాన్యులకు కూడా ఉందని చాటి చెప్పారు. ఒక్క రూపాయికే ఆకాశయానం కలిగించిన గొప్ప ఎంట్రప్యూనర్ గోపినాథ్. ఆకాశం నీ హద్దురా డైనమిక్ ఎంట్రప్యూనర్, సోషల్ రీఫార్మర్, దేశభక్తుడైన గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఆకాశం నీ హద్దురా అనే సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఇప్పుడా గోపినాథ్ ఏం చేస్తున్నారు. తన దక్కన్ ఏవియేషన్ సంస్థ గురించి ఏం చెప్పారు. ఈ దేశ భవిష్యత్తు గురించి ఆయన కంటున్న కలలు ఏంటీ ? ఇటీవల మనీ కంట్రోల్ మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్య అంశాలు మీ కోసం.. మిస్ అవుతున్నా దక్కన్ ఏవియేషన్స్ సీఈఓగా ఉన్నప్పుడు సామాన్యులను విమానంలోకి ఎక్కించడం, టైర్ టూ సిటీల మద్య ఎయిర్ కనెక్టివిటీ కల్పించడం వంటి పనులు చేపట్టినప్పుడు ఒంట్లో కొత్త శక్తి ప్రవహించేది. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఇప్పుడది మిస్ అవుతున్నాను. ఆ తప్పు చేయను పునర్జన్మలపై నాకు నమ్మకం లేదు, కానీ మళ్లీ జన్మంటూ ఉంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నా డెక్కన్ ఏవియేషన్‌ను విజయ్‌మాల్యాకు అమ్మను గాక అమ్మను. డెక్కన్ ఏవియేషన్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకోవడం పొరపాటు. నేను నా మనసు మాట విని ఉండాల్సింది. కానీ అలా చేయకుండా డెక్కన్ ఏవియేషన్‌లో పెట్టుబడిదారుల అభిప్రాయం వైపుకే మొగ్గు చూపాను. డెక్కన్ ఏవియేషన్‌ని అమ్మేయడం వల్ల మాకు లాభాలు వచ్చాయనే మాట నిజమే. కానీ సామాన్యులకు విమానయానం దగ్గర చేయాలనే నా కల. కానీ అలా జరగలేదు. అయితే జరిగినదాని గురించి జరగబోయేదాని గురించి నాకు పెద్దగా బాధ అయితే లేదు. రాజకీయాల్లో... కింగ్‌ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యాకు ఎయిర్ దక్కన్ని అమ్మేసిన తర్వాత ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో బెంగళూరు సౌత్ నియోకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను. అయినా సరే నా ప్రయాణం అపకుండా అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నాను. ఆప్ పార్టీ పెట్టగానే దానిలో చేరాను. అయితే ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నియంత్రృత్వ పోకడలు నచ్చక ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేశాను. కానీ పార్టీ పెట్టిన తీరు, ఎన్నికల్లో గెలిపించిన వైనం, పరిపాలన చేస్తున్న విధానాల పరంగా అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇప్పటికీ అభిమానం, గౌరవం ఉన్నాయి. రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా ప్రారంభించారనే నమ్ముతాను. అలాంటి నేతలు కావాలి బడా కార్పోరేట్ కంపెనీలు అన్ని కూడా పాలసీ తయారీలో కీలకంగా ఉండే వారితో దగ్గరి సంబంధాలు నెరుపుతున్నాయి. కార్పోరేట్ శక్తులకు మంచి నాయకులు కాదు మనకు కావాల్సింది. సామాజికంగా విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చే సృజనాత్మక ఐడియాలు కలిగిన ఎంట్రప్యూనర్లు ప్రోత్సహించేవారు కావాలి. అప్పుడే మన సమాజం వేగంగా మార్పులు వస్తాయి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి. వారిపైనే ఆశలు ఇప్పుడున్న ఎంట్రప్యూనర్లలో ఓలా భవీష్ అగర్వాల్, పేటీఎం విజయ్ శేఖర్ శర్మలు ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నారు. ఇలా వ్యక్తులు మనకు వేలమంది కావాలి. వారంత విభిన్న రంగాల్లోకి చొచ్చుకుపోవాలి. తమకున్న ఐడియాలను ఆచరణలోకి తెచ్చి దేశ గతిని మార్చేయాలి. నా దృష్టిలో ఈ రోజుల్లో ఫ్రీడం ఫైటర్లు అంటే ఎంట్రప్యూనర్లే. వారే ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలరు. అలా జరగడం లేదు నరేంద్రమోదీ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టగానే రెడ్టేపిజంలో మార్పులు వస్తాయని ఆశించాను. కానీ అలా ఏం జరగడం లేదు. రెట్రోట్యాక్స్ను రద్దు చేయడానికే ఏడేళ్లు సమయం తీసుకున్నారు. కొత్త ఎంట్రప్యూనర్లకు క్షేత్రస్థాయిలో అనవసరంగా ఎదురయ్యే అడ్డంకులు తొలగించాలి. ఐడియాలో సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి వచ్చే వెసులుబాటు ప్రభుత్వ పరంగా ఉండాలి. అప్పుడే మనం చైనాను దాటి అభివృద్ధిలో ముందుకు పోగలం. రిటైర్ అయ్యాక రిటైర్మెంట్ అంటూ ఏమీ లేదు. దక్కన్ ఏవియేషన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బిజిగానే ఉంటున్నాను. కర్నాటకలోని మా సొంతూరిలో వ్యవసాయం క్షేత్రంలో ఎక్కువ సేపు గడుపుతుంటా. దీంతోపాటు డెక్కన్ ఛార్టర్స్ అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా హోదాలో ఉన్నాను. ఈ సంస్థ ఆధీనంలో యాభై వరకు హెలికాప్టర్లు, జెట్ విమానాలు ఉన్నాయి. వీటి నిర్వాహణకు సంబంధించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. ఇక రాజకీయాలు, భారత ఆర్థిక వ్యవస్థ, అవినీతి తదితర అంశాలపై గంటల తరబడి జరిగే చర్చాగోష్టీల్లో భాగమవుతాను. వర్తమాన అంశాలపై పుస్తకాలు కూడా రాస్తుంటాను. ఇప్పటికే సింపుల్ ఫ్లై, వన్ కనాట్ మిస్ ద ఫ్లైట్ అనే పుస్తకాలు అచ్చయ్యాయి. - సాక్షి , వెబ్‌డెస్క్ చదవండి: స్త్రీలు ఎగరేసిన విమానం -
మత్తు వదిలించే కింగ్‌ఫిషర్
‘‘ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టు ‘కింగ్‌ఫిషర్’ టైటిల్ క్యాచీగా ఉంది. నేటివిటీ, ఎమోషన్, సెంటిమెంట్ మిస్ కాకుండా కథ రాయడంలో చిన్నికృష్ణ దిట్ట’’ అన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ రఘురామకృష్ణ రాజు. రచయిత చిన్నికృష్ణ ‘కింగ్‌ఫిషర్’ చిత్రంతో నిర్మాతగా మారారు. హైదరాబాద్‌లో చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోగో ఆవిష్కరణలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు పడే కష్టం మాకు తెలుసు.. అందుకే ఎప్పుడూ నిర్మాతలు కాకూడదనుకున్నాం. చిన్నికృష్ణ నిర్మాతగా మారుతున్నాడని తెలిసి ఆశ్చర్యపోయా. కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తాడనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చిన్నికృష్ణ వెన్నతాగే కృష్ణుడిలా కాకుండా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టాలి’’ అన్నారు రచయిత విజయేంద్రప్రసాద్. ‘‘నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి చిన్నికృష్ణ గారే కారణం’’ అన్నారు దర్శకుడు కేయస్ రవీంద్ర (బాబి). ‘‘సమరసింహా రెడ్డి’తో నా లైఫ్ టర్న్ తీసుకుంది. కథ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌గారికి థ్యాంక్స్. ‘నరసింహనాయుడు’తో నా కెరీర్ మరో మలుపు తిరిగింది. ఆ చిత్రానికి కథ ఇచ్చింది చిన్నికృష్ణ’’ అన్నారు దర్శకుడు బి.గోపాల్. చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘సినిమాల మీద ఆసక్తితో తెనాలి నుంచి చెన్నై వెళ్లాను. భాగ్యరాజాగారి దగ్గర పనిచేశాను. సుజాత రంగరాజన్‌కి ఏకలవ్య శిష్యుణ్ణి. ఆ తర్వాత పరుచూరి సోదరులు, బి.గోపాల్గారు నన్ను ప్రోత్సహించారు. ఓ యువ దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తాడు. జనరల్‌గా కింగ్ ఫిషర్ అనగానే బీర్ గుర్తుకువస్తుంది. ‘కింగ్‌ఫిషర్’ అనేది ఒక పక్షి పేరు. ఆ కింగ్‌ఫిషర్ కిక్ ఇస్తుంది.. మా కింగ్‌ఫిషర్ మత్తుని వదిలిస్తుంది’’ అన్నారు. జడ్జి మాధవ్ పట్నాయక్, నిర్మాత దాసరి కిరణ్, హీరో హవీష్, కత్తి మహేష్, జగన్ పాల్గొన్నారు. -
దయచేసి డబ్బు తీస్కోండి.. నన్నొదిలిపెట్టండి!
లండన్ : వేలకోట్లకు ఎగనామం పెట్టి.. బ్యాంకులను మోసం చేసిన ప్రముఖ లిక్కర్ వ్యాపారీ విజయ్ మాల్యా మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై విరుచుకుపడ్డాడు. సీబీఐ తనకు వ్యతిరేకంగా క్షుద్రవేట సాగిస్తోందని మండిపడ్డాడు. భారత్‌కు అప్పగింత విషయమై అప్పీల్ చేసుకునేందుకు బ్రిటన్ హైకోర్టు విజయ్ మాల్యాకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ మాల్యా ట్విటర్లో వ్యాఖ్యలు చేశారు. ‘దేవుడు గొప్పవాడు. న్యాయం ఇంకా మిగిలి ఉందిఒ. సీబీఐ నాపై మోపిన ప్రాథమిక అభియోగాలపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ఇంగ్లిష్ హైకోర్టు డివిజన్ బెంచ్ అప్పీల్‌కు అవకాశమిచ్చింది. సీబీఐ అభియోగాలు తప్పు అని నేను చెప్తూ వస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ పూర్తిగా తిరిగి చెల్లిస్తానని, దయచేసి డబ్బు తీసుకొని.. తనను వదిలిపెట్టాలంటూ మరోసారి విజయ్ మాల్యా వేడుకున్నాడు. ‘కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వచ్చినప్పటికీ.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలన్నింటినీ పూర్తిగా చెల్లిస్తానని మరోసారి ఆఫర్ ఇస్తున్నాను. దయచేసి డబ్బు తీసుకోండి. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు కూడా డబ్బు చెల్లించి.. జీవితంలో ముందుకు సాగుతాను’ అని మాల్యా పేర్కొన్నాడు. సీబీఐ తనపై మోపిన ప్రాథమిక అభియోగాలను సవాల్ చేసేందుకు బ్రిటన్ హైకోర్టు తనకు అనుమతి ఇచ్చిందని, తనను హేళన చేస్తున్న వాళ్లంతా ఈ విషయాన్ని అందరూ గమనించాలని మాల్యా కోరాడు. -
బ్యాంకులకు మాల్యా బంపర్ ఆఫర్
ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా జెట్ ఎయిర్వేస్ వివాదంపై స్పందించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను, ఉద్యోగులను కాపాడేందుకు తన డబ్బులను తీసుకోవాలంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటికైనా దీనిపై బ్యాంకులు పునరాలోచించాలని కోరాడు. దీంతోపాటు సంక్షోభంలో ఉన్న తన పట్ల డబుల్ స్టాండర్డ్స్‌ని అవలంబిస్తోందంటూ మంగళవారం ట్విటర్లో వరుస ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డాడు. అలాగే సంస్థను ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ను రక్షించేందుకు ప్రభుత్వం రంగ బ్యాంకులు బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించడంపై మాల్యా సంతోషం వ్యక్తం చేశాడు. కానీ ఇదే తన విషయంలో కూడా జరిగి వుంటే బావుండేదంటూ వాపోయాడు. బీజేపీ ప్రభుత్వం లోని ప్రభుత్వ బ్యాంకులు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని ఆరోపిస్తూ మాల్యా వరుస ట్వీట్లు చేశాడు. దేశ అత్యుత్తమ వైమానిక సంస్థ కింగ్ ఫిషర్, దాని ఉద్యోగులు, వ్యాపారం నిర్దాక్షిణ్యంగా కూలిపోతోంటే ఎన్డీఏ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎందుకు స్పందించలేదని ట్వీట్ చేశాడు. సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్ సంస్థను, సంస్థ ఉద్యోగులను కాపాడేందుకు 4వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టానని మాల్యా చెప్పుకొచ్చాడు. దీన్ని గుర్తించకుండా తనను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నాడు. అలాగే తన లిక్విడ్ ఆస్తులను తీసుకోవాలని గౌరవనీయమైన కర్నాటక హైకోర్టు ముందు ఇప్పటికే తన ప్రతిపాదనను ఉంచానని కానీ ప్రభుత్వ బ్యాంకులు, ఇతర రుణ దాతలు ఎందుకు సమ్మతించడం లేదని ఆయన ప్రశ్నించారు. తన సొమ్మును తీసుకోవడం ద్వారా జెట్ ఎయిర్‌వేస్‌ని కాపాడాలని మాల్యా బ్యాంకులను కోరాడు. జెట్ ఎయిర్వేస్ లాంటి సంక్షోభ పరిస్థితినే మాల్యా సొంతమైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంది. దివాలా కారణంగా కింగ్ ఫిషర్ 2012లో కుప్పకూలింది. దీంతో బ్యాంకులకు 9వేల కోట్ల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో కేసు విచారణను ఎదుర్కొంటుండగా గతవారం ఫెరా (విదేశీఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్) ఉల్లంఘన కేసులో బెంగళూరులోని మాల్యా ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి వాదనలు జులై 10న జరగనున్నాయి. కాగా జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించేందుకు ఛైర్మన్ నరేష్ గోయల్ ఎట్టకేలకు సోమవారం (మార్చి 25) న దిగి వచ్చారు. ఆయన భార్య అనితాతోపాటు సంస్థ బోర్డును వీడుతున్నట్టు ప్రకటించారు. దీంతో రుణదాతలు 1500 కోట్ల రూపాయల బెయిల్ అవుట్ ప్యాకేజీకి అంగీకరించిన సంగతి తెలిసిందే. (చదవండి : గోయల్.. ‘జెట్’ దిగెన్!) Happy to see that PSU Banks have bailed out Jet Airways saving jobs, connectivity and enterprise. Only wish the same was done for Kingfisher. — Vijay Mallya (@TheVijayMallya) March 25, 2019 And I repeat once again that I have placed liquid assets before the Hon’ble Karnataka High Court to pay off the PSU Banks and all other creditors. Why do the Banks not take my money. It will help them to save Jet Airways if nothing else. — Vijay Mallya (@TheVijayMallya) March 26, 2019 -
కేఎఫ్ బీర్లను విక్రయించాలి.. వైరల్ లేఖ
సాక్షి, జగిత్యాల : ప్రజావాణిలో జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు ఓ వ్యక్తి రాసిచ్చిన ఫిర్యాదు లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైన్స్‌షాపుల్లో, బార్లలో కింగ్ ఫిషర్ బీర్లను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాలకు చెందిన అయిల సూర్యనారాయణ(టీవీ.సూర్యం) సోమవారం జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మద్యంప్రియులు, యువత ఎక్కువగా ఇష్టపడే కింగ్‌ఫిషర్ బీర్ల విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందన్నారు. మద్యం విక్రయదారులు సిండికేట్‌గా మారి కింగ్‌ఫిషర్ బీర్లను విక్రయించడం మానేశారని, వాటి స్థానంలో నాసిరకం బీర్లను విక్రయిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 లో పేర్కొన్న ప్రాథమిక హక్కులలోని స్వేచ్ఛతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీర్ల విక్రయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో బీర్లపై ఫిర్యాదు రావడంతో అధికారులతో పాటూ, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు. అధికారులు ఆ లేఖను అబ్కారీ శాఖకు పంపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ -
ధైర్యమున్న పిల్లే!
కింగ్ ఫిషర్స్ క్యాలెండర్ గురించి మీరు వినే ఉంటారు. చాలా ఫేమస్.అందులో లేడీ మోడల్స్ ఉంటారు. అయితే ఇందులో మేల్ మోడల్స్ఉంటారు. అందుకే దీన్ని క్వీన్ ఫిషర్స్ క్యాలెండర్ అనొచ్చు. విశేషం ఏంటంటే.. ఈ మేల్ క్యాలెండర్ కోసం బాలీవుడ్ బాయ్స్‌ని షూట్ చేసింది... ఓ లేడీ ఫొటోగ్రాఫర్. ధైర్యమున్న పిల్లే! మహిళా మోడళ్లతో ఏ దివిలోనో ఫొటో సెషన్ పెట్టి, ఏటా అందమైన క్యాలెండర్ రిలీజ్ చేసి, ఓ ట్రెండ్ సెట్ చేసింది ‘కింగ్ ఫిషర్స్’ సంస్థ. అయితే ఆ క్రెడిట్ అంతా ఫొటోగ్రాఫర్ అతుల్ కాస్బేకర్ది. అలా స్త్రీ సౌందర్య రాశులను మగ ఛాయాచిత్ర గ్రాహకులు అందాల చట్రంలో బంధించడం అన్నది ఓ సంప్రదాయం అయింది. అయితే ఇప్పుడా సంప్రదాయాన్ని బద్దలు కొట్టేశారు లేడీ ఫొటోగ్రాఫర్ శర్వీ చతుర్వేది. ఎలా సాధ్యం అయింది? శర్వీ 2015లో తొలిసారిగా.. కింగ్ ఫిషర్ క్యాలెండర్ చిన్నబుచ్చుకునేలా.. ఆల్ మేల్ మోడల్స్‌తో ఫొటో షూట్ చేశారు. మేల్ మోడల్స్‌గా పోజ్ ఇచ్చిన వాళ్లంతా బాలీవుడ్ యంగ్ చాప్స్. ‘‘లైఫ్ ఇన్ ఏ డాట్ సిరీస్’’ అనే పేరుతో ఆ షూట్‌ను నిర్వహించారు శర్వీ. కింగ్‌ఫిషర్ క్యాలెండర్.. స్విమ్ సూట్లో అమ్మాయిలను షూట్ చేసినట్టే శర్వీ కూడా పన్నెండు మంది బాలీవుడ్ అబ్బాయిలను స్విమ్‌సూట్‌లో షూట్ చేశారు. ఇలాంటి షూట్ చేసిన ఫిమేల్ ఫొటోగ్రాఫర్స్ చాలా చాలా అరుదు. వాళ్లలో శర్వీ ఒకరు. ‘‘చాలా మందికి విడ్డూరంగా అనిపించవచ్చు. కాని ఇది ఫోటోగ్రాఫర్ ఈస్థటిక్స్‌కు సంబంధించింది. ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడానికి, ఆవిష్కరించడానికి పరిణతి ఉండాలి. కళాత్మకతతో పాటు గ్లామరస్ ఫార్మెట్ కూడా అవసరం’’ అంటారు శర్వీ. ఇక్కడ జెండర్ ప్రాధాన్యం కాదు అని కూడా అంటారు శర్వీ.‘‘ స్విమ్‌సూట్‌లో అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఫొటోగ్రాఫర్‌కు ఇమేజ్ ముఖ్య భూమిక పోషిస్తుంది. అమ్మాయిలతో ఫొటో షూట్ అంటే వందరకాల ప్రయోగాలకు ఆస్కారం ఉంటుంది. అదే అబ్బాయిలతో అంతగా ఉండదు. చాలెంజింగ్ తీసుకోవాలి. స్టీరియోటైప్‌ను బ్రేక్‌ను చేయాలి. మోడల్స్‌తో కంటే యాక్టర్స్‌తో షూట్ తేలిక అనుకుంటున్నా. ఎందుకంటే క్యాలెండర్‌కు ఓ థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ప్రకారమే ఫొటో ఇమేజెస్‌ను ప్రొజెక్ట్ చేయాలి. అంటే ఒకరకంగా వాళ్లతో యాక్ట్ చేయించడమన్నట్టే కదా. యాక్టర్స్ అయితే కాన్సెప్ట్‌ను త్వరగా అర్థం చేసుకుంటారు. కావల్సిన హావభావాలు పలికిస్తారు. అందుకే మెడల్స్ కన్నా యాక్టర్స్తోనే ఫోటో షూట్ ఈజీ అనుకుంటున్నా’’ అని అంటారు శర్వీ. ఈ ఫొటో షూట్ కోసం దబ్బూ రత్నాని, సుభాష్ ఘై లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారు శర్వీ. ‘‘దబ్బూ సర్.. అబ్జర్వేషన్ స్కిల్స్‌ను ఎలా పెంపొందించుకోవాలో, సహనంగా ఎలా ఉండాలో నేర్పారు. ఇక సుభాష్ ఘై సర్.. ‘‘గ్రహించాలి.. వినాలి.. చదవాలి’’ అనే మూడు ప్రిన్సిపల్స్ పాటిస్తారు. తనతో పనిచేసేవాళ్లు అవి పాటించేలా చూస్తారు. ‘‘జీవితంలో నువ్వు నిత్య విద్యార్థివే’’ అని చెప్తుంటారు’’ అని వాళ్లతో పనిచేసిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు శర్వీ చతుర్వేది. లైఫ్ ఇన్ ఏ డాట్ అంటే? డాట్ అంటే శర్వీ భావనలో ఒక వృత్తం. జీవితమనే పరిపూర్ణమైన వృత్తం. జీవితంలోని ప్రతి పని ఆ వృత్తాన్ని పెంచుతూ ఉంటుంది. దీనికి లైఫ్ ఇన్ ఏ డాట్ అనే లోగోలో పెద్ద ఎర్ర కుర్చీని సంకేతంగా చూపించారు శర్వీ. ఇలా డిఫరెంట్ ఫొటో షూట్‌ను కంటిన్యూ చేయడం ఇష్టమేనని, చాలెంజెస్‌ను స్వీకరించడం తన నైజమని అంటున్నారు శర్వీ చతుర్వేది. -
ఆ ఆస్తులు ఎవ్వరికీ వద్దంట
ముంబయి: బ్యాంకులు వేలం వేస్తున్న మాల్యా ఆస్తుల కోసం ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకప్పుడు ఓ వెలుగువెలిగిన మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకునేందుకు బిడ్డర్లు సాహసించడం లేదు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ బ్రాండ్స్, ట్రేడ్ మార్క్‌కు శనివారం బ్యాంకులు వేలం నిర్వహించినప్పటికీ ఒక్క బిడ్డరు కూడా కోట్ చేయలేదు. కనీసం రిజర్వు ధర 366 కోట్లు కూడా కోట్ చేయలేదు. మొత్తం 17 బ్యాంకులు తాము ఇచ్చిన రుణాలను మాల్యా నుంచి రాబట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం కింగ్ ఫిషర్ ఆస్తుల్లో భాగమైన ఎయిర్ లైన్స్ బ్రాండ్స్, ట్రేడ్ మార్క్ రిజర్వు ధర రూ.366.70కోట్లుగా నిర్ణయించారు. అయితే, ఆ ధరను కూడా ఒక్క బిడ్డరూ కోట్ చేయకపోవడం గమనార్హం. -
అదిరిపోయిన కింగ్‌ఫిషర్ ఫ్యాషన్‌షో
-
జస్ట్ మ్యూజిక్
డీజే బీట్... మ్యూజిక్ హోరు... ఆపై కుర్రకారు గ‘మ్మత్తు’ల హుషారు. రెండు రోజుల పాటు సిటీ యూత్‌ను ఊపేసిన కింగ్ ఫిషర్ ‘ది గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్’ ఆదివారంతో ముగిసింది. చివరి రోజు నిర్వహించిన గ్రాండ్ గాలా ఈవెంట్... క్లాసికల్ మ్యూజిక్కు ఫ్యూజన్ సంగీతం మిక్సింగ్‌తో దుమ్ము రేగింది. హాస్యం, మెడ్లీ, సౌతిండియన్, బాలీవుడ్, మెటల్ మ్యూజిక్ మ్యాజిక్కు అమ్మాయిలు, అబ్బాయిలు ఆడి పాడి ఆసాంతం ఆస్వాదించారు. -
ముగింపు జిగేల్