సాక్షి, న్యూఢిల్లీ : సాంకేతిక విద్యను కరెస్పాండెన్స్(సుదూర) కోర్సులు ద్వారా అందించవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇంజనీరింగ్ లాంటి సడ్జెట్లకు విద్యా సంస్థలు దూర విద్యా విధానంలో అందిస్తున్న కోర్సులపై సుప్రీంకోర్టు పరిమితులు విధించింది. ఈ కోర్సుల్లో దూర విద్యకు వ్యతిరేకంగా తీర్పు చెప్పేందుకు, ఇదే అంశంపై పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
అదేవిధంగా టెక్నికల్ విద్యను కరెస్పాండెన్స్ ద్వారా అందించేందుకు ఒడిశా హైకోర్టు ఇచ్చిన అనుమతిని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. కంప్యూటర్ సైన్సు డిగ్రీని కరెస్పాండెన్స్ ద్వారా పొందితే దాన్ని రెగ్యులర్ క్లాస్ మాదిరి పరిగణలోకి తీసుకోమని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు రెండేళ్ల క్రితం తీర్పునిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment