సియాచిన్‌ను వదులుకోం: పరీకర్
న్యూఢిల్లీ: సియాచిన్ గ్లేసియర్‌ను ఖాళీ చేయబోమని రక్షణమంత్రి పరీకర్ అన్నారు. ఒక వేళ దానిని ఖాళీ చేస్తే, వ్యూహాత్మక ప్రాంతమైన సియాచిన్‌ను పాకిస్తాన్ ఆక్రమించుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ విషయం చెప్పారు. పాక్ సియాచిన్‌ను ఆక్రమించుకుంటే అది మనకు ప్రమాదకరమని, భారత్ మరింతమంది ప్రాణాలను కోల్పోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. క్లిష్టమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న జవాన్ల మేలుకోసం ఏడో వేతనసంఘం పలు సిఫారసులు చేసిందని, అయితే అవేమిటో ప్రస్తుతం చెప్పలేనని మంత్రి పరీకర్ వ్యాఖ్యానించారు.
పార్లమెంటు సమాచారం
► ఆగ్నేయాసియాలో నమోదవుతున్న 70శాతం మలేరియా కేసులు భారత్‌నుంచి వచ్చినవే. ఇందులో మరణాలే ఎక్కువని సర్కారు తెలిపింది.
► రైళ్లో మనం కప్పుకునే దుప్పట్లను రెండు నెలలకోసారి ఉతుకుతారని.. బెడ్‌రోల్స్, బెడ్‌షీట్లను రోజూ ఉతుకుతారని రైల్వేశాఖ సహాయమంత్రి వెల్లడించారు.
► 2012నుంచి మహిళల హక్కుల ఉల్లంఘనపై 93వేల కేసులు, పిల్లలపై 45వేలకు పైగా లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.
► తాజా జనాభా లెక్కల ప్రకారం లింగనిష్పత్తి 933 నుంచి 943 పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. 2012-14 మధ్య కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఐదుశాతం పెరిగినట్లు వెల్లడించింది.
► {V>Ò$×, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు ‘హార్డ్ ఏరియా’ అలవెన్సును అదనంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
► వ్యవసాయాధారిత భూముల సంఖ్య దేశంలో తగ్గుతోందని, వ్యవసాయ ఉత్పత్తిలో పెరుగుదల ఉందని తెలిపింది.
► బీడీ కట్టపై పుర్రె గుర్తు ముద్రణతో మెజారిటీ బీడీ తయారీ యూనిట్లు మూతబడ్డాయని సీపీఎం ఎంపీ రాజ్యసభలో తెలిపారు. ప్రభుత్వం మానవతాధృక్పథంతో ఆలోచించి తెరిపించాలన్నారు.