తిరువనంతపురం: శబరిమల యాత్ర సీజన్ వచ్చేనెల నుంచి ప్రారంభం కానుం ది. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లదలచిన భక్తులు మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దర్శన క్యూ కూపన్లను పొందవచ్చు. www.sabarimala.com వెబ్‌సైట్ ద్వారా కూపన్లను పొందవచ్చని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్శనానికి లక్షలాది మంది బారులు తీరే ఈ సీజన్‌లో అవాంఛనీయ ఘటనలను నివారించడానికి కేరళ పోలీసుల సూచన మేరకు కొన్నే ళ్ల క్రితమే ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించారు. భక్తులు తమ పేరు, వయసు, చిరునామా, ఫొటో ఐడీ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకొని.. లభ్యతను బట్టి తమకు అనువైన తేదీ, సమయాల్లో దర్శన క్యూ కూపన్లను రిజర్వు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత దర్శన క్యూ కూపన్లను ప్రింటవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. శబరిమల యాత్రకు వెళ్లినప్పుడు ‘పంప’లోని కౌంటర్‌లో ఈ కూపన్‌ను చూపించి, ఎంట్రీ కార్డు పొందాలి.
రేపటి నుంచి శబరిమల కూపన్ల ఆన్‌లైన్ బుకింగ్
Published Mon, Oct 14 2013 2:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM
Advertisement
Advertisement