shabari mala yatra
-
అయ్యప్ప మాల వేసుకున్నాక ఏదైనా సమస్య వస్తే..?
-
రెండేళ్లుగా దైవదర్శనానికి దూరంగా.. అయ్యప్పా..
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప సన్నిధికి చేరేందుకు భక్తజన సందోహం పడిగాపులు కాస్తోంది. రెండేళ్లుగా దైవదర్శనానికి దూరంగా ఉన్న భక్తులు ఈసారి భారీ సంఖ్యలోనే మాలధారణ గావించారు. డిమాండ్‌కు తగిన రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒకటే అందుబాటులో ఉంది. ఈ ట్రైన్లో ఇప్పటికే ‘నో రూం’ దర్శనమిస్తోంది. మరోవైపు జంటనగరాల నుంచి ఆ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లన్నీ ఇప్పటికే భర్తీ అయ్యాయి. ఫిబ్రవరి వరకు అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప భక్తులు శబరికి వెళ్లడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఈసారి ఎక్కువ మంది భక్తులు తరలి వెళ్లే అవకాశం ఉండడంతో ప్రైవేట్ వాహనాలు చార్జీల మోత మోగిస్తున్నాయి. ఉన్నది ఒక్కటే.. ► సాధారణంగా ప్రతి ఏటా కనీసం 2.5 లక్షల మందికి పైగా అయ్యప్ప భక్తులు హైదరాబాద్ నుంచి శబరికి వెళ్తారు. జనవరిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ కారణంగా భక్తుల సంఖ్య తగ్తింది. ఈసారి లక్ష మందికి పైగా మాలధారణ చేసినట్లు అంచనా. ప్రతి రోజు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడం వల్ల శబరికి వెళ్లే భక్తుల సంఖ్య కొంత మేరకు తగ్గవచ్చు. కానీ కనీసం 30 వేల మందికి పైగా భక్తులు వెళ్లే అవకాశం ఉంది. ► హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇది రెగ్యులర్ ట్రైన్. ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. మరో నెల రోజుల వరకు కనీసం టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు కూడా అవకాశం లేదు. ఈసారి ఇప్పటి వరకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. సంక్రాంతి ప్రయాణమూ కష్టమే.. ► ఈసారి సంక్రాంతికి సొంత ఊరుకు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో ఫిబ్రవరి వరకు వెయింట్ లిస్టు 200 నుంచి 250 వరకు దాటింది. జనవరి, ఫిబ్రవరి నెలల కోసం అన్ని రైళ్లలో బెర్తులు భర్తీ అయ్యాయి. చాలామంది నిరీక్షణ జాబితాలో ఎదురు చూస్తున్నారు. ► విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్, తదితర ప్రాంతాలకు అదనపు రైళ్లు వేస్తే తప్ప ఊరెళ్లడం సాధ్యం కాదు. మరోవైపు జనవరి మొదటి వారానికే గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్, నర్సాపూర్, ఫలక్‌నుమా, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, సింహపురి, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి, రాయలసీమ తదితర అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు 250 దాటిపోయింది. ప్రైవేట్ బస్సుల్లో చార్జీల మోత... ► రైళ్ల కొరత కారణంగా అయ్యప్ప భక్తులు, సంక్రాంతికి సొంత ఊరు వెళ్లే సాధారణ ప్రజలు సైతం ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహణాలపైన ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్‌లో చార్జీల మోత మోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. చదవండి: ‘బ్రెయిన్లో చిప్స్.. కళ్లల్లో కెమెరా అంటూ ’ -
శబరిమలకి ఆర్టీసీ సర్వీసులు.. ప్రతీ బస్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణం
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రతీ ఒక్క అవకాశాన్ని గరిష్టంగా వినియోగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే కార్తీక మాసం ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఆర్టీసీ తాజాగా అయ్యప్ప స్వాముల కోసం శబరిమలకి బస్సు సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది. శబరికి బస్సులు కార్తీక మాసం రావడంతో పల్లె పట్నం తేడా లేకుండా అయ్యప్పమాల ధరించిన వారే కనిపిస్తున్నారు. స్వామి శరణం మాట ప్రతీ చోట ధ్వనిస్తోంది. ఎక్కువ మంది భక్తులు అయ్యప్ప మాల విరణమ కోసం శబరిమలకి వెళ్తుంటారు. ఇలా వేళ్లే వారు ఇప్పటి వరకు ఎక్కువగా ప్రైవేటు వెహికల్స్‌నే ఆశ్రయిస్తున్నారను. కాగా అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఐదుగురికి ఫ్రీ శబరిమలకి వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్ చేసుకుంటే అదే బస్సులో మరో ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఈ మేరకు వరంగల్ 1 డిపో తరఫున ట్విట్టర్లో ప్రచారం కూడా మొదలు పెట్టారు. బుక్ చేసుకున్న బస్సులో అయ్యప్ప భక్తులతో పాటు ఇద్దరు వంట మనుషులు, ఒక అటెండర్, పదేళ్లలోపు ఇద్దరు మునికంట స్వాములకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అంటోంది. మొత్తంగా మూడు ఫుల్ టిక్కెట్లు, రెండు ఆఫ్ టిక్కెట్లకు ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. శబరిమల వెళ్లే భక్తులకు వరంగల్ 1 డిపో నుండి ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఇవ్వబడును. వివరాలకు డిపోమేనేజర్ ని సంప్రదించగలరు. #choosetsrtc #shabarimala #rtchirebuses @tsrtcmdoffice @TSRTCHQ pic.twitter.com/dQusTBiyde — Depot Manager WL1 (@dmwgl1) November 16, 2021 ఛార్జీలు ఇలా శబరిమలైకి వెళ్లే భక్తులు అయ్యప్ప దర్శనంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తుంటారు. ఈ టూర్‌కి అనుగుణంగా ఆర్టీసీ కిలోమీటర్ల వంతున ఛార్జీలు నిర్ణయించింది. వీటితో పాటు ప్రతీ గంటకు రూ.300ల వంతున వెయిటింగ్ ఛార్జీ్ కూడా ఉంటుంది. గంటకు సగటున 30 కిలోమీటర్ల వంతున ప్రయాణ సమయాన్ని లెక్కిస్తున్నారు. ఆర్టీసీ శబరిమలై బస్సుల ఛార్జీలు ఇలా ఉన్నాయి. - 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సులకు కిలోమీటరుకు రూ.48.96 - 40 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటరుకు రూ.47.20 - 48 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటరుకు రూ.56.64 - 49 సీట్లు ఉన్న ఆర్టీసీ బస్సులకు కిలోమీటరుకు రూ.52.49 చదవండి:ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ప్రిన్స్ మహేశ్.. అదిరింది సార్! -
రేపటి నుంచి శబరిమల కూపన్ల ఆన్లైన్ బుకింగ్
తిరువనంతపురం: శబరిమల యాత్ర సీజన్ వచ్చేనెల నుంచి ప్రారంభం కానుం ది. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లదలచిన భక్తులు మంగళవారం నుంచి ఆన్లైన్లో దర్శన క్యూ కూపన్లను పొందవచ్చు. www.sabarimala.com వెబ్సైట్ ద్వారా కూపన్లను పొందవచ్చని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్శనానికి లక్షలాది మంది బారులు తీరే ఈ సీజన్లో అవాంఛనీయ ఘటనలను నివారించడానికి కేరళ పోలీసుల సూచన మేరకు కొన్నే ళ్ల క్రితమే ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించారు. భక్తులు తమ పేరు, వయసు, చిరునామా, ఫొటో ఐడీ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకొని.. లభ్యతను బట్టి తమకు అనువైన తేదీ, సమయాల్లో దర్శన క్యూ కూపన్లను రిజర్వు చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత దర్శన క్యూ కూపన్లను ప్రింటవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. శబరిమల యాత్రకు వెళ్లినప్పుడు ‘పంప’లోని కౌంటర్లో ఈ కూపన్‌ను చూపించి, ఎంట్రీ కార్డు పొందాలి.