ఆ సీరియల్‌ బ్యాన్‌ చేయాల్సిందే! | online petition to Smriti Irani to Ban Pehredaar Piya Ki Serial | Sakshi
Sakshi News home page

ఆ సీరియల్‌ బ్యాన్‌ చేయాల్సిందే!

Published Thu, Aug 10 2017 2:44 PM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

ఆ సీరియల్‌ బ్యాన్‌ చేయాల్సిందే!

ఆ సీరియల్‌ బ్యాన్‌ చేయాల్సిందే!

వైవిధ్యమైన కాన్సెప్ట్‌ల పేరిట బుల్లితెరపై చేస్తున్నప్రయోగాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. తాజాగా హిందీలో ప్రసారం అవుతున్న ఓ సీరియల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్యాన్‌ చేయాలంటూ ఏకంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీకే విజ్ఞప్తి చేస్తున్నారు. దాని కాన్సెప్ట్‌ అలాంటిది మరి.

వివరాల్లోకి వెళితే... `పెహ్రేదార్ పియా కీ` అనే సీరియ‌ల్‌ సోనీ టీవీలో ప్రసారం అవుతోంది. అందులో 9 ఏళ్ల బాలుడిని 18 ఏళ్ల యువతి కొన్ని పరిస్థితులరీత్యా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆపై జరిగే పరిణామాలు ఏంటన్నదే ఈ సీరియల్‌ కథ. అయితే ప్రైమ్ టైమ్‌లో వ‌స్తున్న ఈ సీరియ‌ల్ ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపటంతోపాటు, పిల్లల ఆలోచ‌నా విధానాల‌ను మార్చే విధంగా ఉందని పలువురు వాదిస్తున్నారు

ఛేంజ్‌.ఓఆర్‌జీ పేరిట మాన్సి జైన్‌ ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. ఇప్పటికే ఈ పిటిష‌న్‌పై 42,000 మంది సంత‌కాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. జూలై 17న మొదటి ఎపిసోడ్‌ ప్రసారంకాగా, ఈ మధ్య కొన్ని ఎపిసోడ్లలో శోభనం రాత్రి, హనీమూన్‌ వంటి రిఫరెన్స్‌లతో కూడిన కొన్నిసన్నివేశాలను చూపించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement