20 ఏళ్లలో 12 వేల మందిని చంపిన నక్సల్స్ | Over 12,000 killed in Naxal violence in past 20 years | Sakshi
Sakshi News home page

20 ఏళ్లలో 12 వేల మందిని చంపిన నక్సల్స్

Published Wed, Mar 12 2014 3:38 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

Over 12,000 killed in Naxal violence in past 20 years

న్యూఢిల్లీ: గత 20 ఏళ్ల కాలంలో మావోయిస్టులు దేశవ్యాప్తంగా 12 వేలకు మందికి పైగా చంపారని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. హతుల్లో భద్రత సిబ్బంది సహా సాధారణ పౌరులు, రాజకీయ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. వీరిలో 9471 మంది పౌరులు, 2712 మంది కేంద్ర, రాష్ట్ర భద్రత సిబ్బంది ఉన్నారు. సమాచార హక్కు చట్టం కింద ఓ కార్యకర్త దరఖాస్తు మేరకు కేంద్ర హోం శాఖ ఈ వివరాలను వెల్లడించింది.

తొమ్మిది రాష్ట్రాల్లో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని పేర్కొంది. బాధిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేవ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. నక్సల్స్ 2010లో అత్యధికంగా 1005 మందిని చంపారు.

Advertisement
Advertisement