
‘సుప్రీం’లో పెండింగ్ కేసుల పెరుగుదల 88%
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) 1950, జనవరి 28న ప్రారంభమైంది. ఆ తర్వాత సరిగ్గా సంవత్సరానికి ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య 690. అప్పటినుంచి పెండింగ్ కేసుల సంఖ్య ఏటా పెరిగిపోతూ వచ్చి గత సెప్టెంబర్ నాటికి 60,938కి చేరింది. అంటే పెండింగ్ కేసుల సంఖ్యలో పెరుగుదల ఏకంగా 88 శాతం.
సుప్రీంకోర్టు విడుదల చేసిన ‘భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2015–16’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆరంభమైన తొలి ఏడాదిలో 1,215 కేసులు దాఖలవగా.. గతేడాది జనవరి– సెప్టెంబర్ కాలంలో 59,386 కేసులు దాఖలయ్యాయంటే దాఖలవుతున్న కేసుల సంఖ్య ఎలా పెరిగిపోతోందో తేటతెల్లమవుతోంది.