
ఇస్లామాబాద్ : ఈనెల 9న కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూకు పాకిస్తాన్ ప్రభుత్వం వీసా మంజూరు చేసింది. రాజకీయ ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ సిద్ధూకు పాకిస్తాన్ హై కమిషన్ వీసా మంజూరు చేసిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రం అనుమతి కోసం సిద్ధూ ఇంకా వేచిచూస్తున్నారు.
వీసాతో వాఘా వద్ద సిద్ధూ సరిహద్దు దాటే అవకాశం ఉన్నా పంజాబ్ చట్ట సభ సభ్యుడిగా ఎన్నికైనందున పాక్ ప్రభుత్వం నిర్వహించే ఎలాంటి కార్యక్రమంలోనైనా పాల్గొనేందుకు ఆయనకు కేంద్రం నుంచి క్లియరెన్స్ లభించాల్సి ఉంది. కర్తార్‌పూర్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు అనుమతించాలని కోరుతూ సిద్ధూ ఇప్పటికే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖరాశారు. (చదవండి: కర్తార్‌పూర్ వీడియోలో ఖలిస్తాన్ నేతలు?)
Comments
Please login to add a commentAdd a comment