పట్టారి(పంజాబ్): పాకిస్తాన్ 40 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. వారిలో గుజరాత్‌కు చెందిన 35 మంది మత్స్యకారులు కూడా ఉన్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అధికారులు చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం అధికారులు శనివారం ఖైదీలను అట్టారి-వాఘా చెక్‌పోస్ట్ వద్దకు తీసుకువచ్చారు. వారిని ఇక్కడి బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు.
పాకిస్తాన్ జలాలలోకి వెళ్లినందుకు మత్స్యకారులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 40 మంది ఖైదీలలో ఎక్కువ మంది ఏడాదిగా పాకిస్తాన్ జైళ్లలో ఉన్నారు.
**
40 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసిన పాకిస్తాన్
Published Sun, Nov 30 2014 2:56 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement
Advertisement