Indian prisoners
-
విదేశీ జైళ్లల్లో అత్యధికంగా భారతీయులే!
న్యూఢిల్లీ : సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్న విదేశీయులలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. ఈ ఏడాది మే 31 నాటికి సౌదీలోని భారతీయ ఖైదీలు 6శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ జాబితాలో సౌదీ తర్వాత యుఏఈ, నేపాల్‌లో అత్యధిక మంది భారతీయులు అక్కడి జైళ్లలో బంధీలుగా ఉన్నారన్నారు. సౌదీ అరేబియాలో మొత్తంగా 1,811, యుఏఈలో 1,392, నేపాల్‌లో 1,160 మంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. ఇక అమెరికా జైళ్లలో 689, పాకిస్తాన్లో 48 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారన్నారు. పాకిస్తాన్ జైళ్లలో గత ఏడాది 471 మంది భారతీయులు ఉండగా.. ఈ ఏడాది వారి సంఖ్య బాగా తగ్గిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాగా బుధవారం లోక్‌సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ గణాంకాలు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లోని చట్టాలపై సరైన అవగాహన లేకుండా అక్కడికి వెళ్తున్న కారణంగా అత్యధిక మంది ఇబ్బందుల్లో పడుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో జైళ్లలో మగ్గాల్సి వస్తుందని.. అయితే విదేశాల్లో పని చేయాలనుకునే కార్మికులు స్థానిక కాన్సులేట్ సేవలలో ముందుగానే తమ పేరును నమోదు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని తెలిపింది. కాగా సాధారణంగా తమ దేశంలో ఉన్న ఖైదీల విషయంలో చాలా మటుకు దేశాలు వివరాలు ప్రకటించడంలో గోప్యత పాటిస్తాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దాయాది దేశాల్లో బంధీలుగా ఉన్న పౌరుల వివరాలు.. అనేక వేధింపుల తరువాత బహిర్గతమవుతాయన్న అంశం విదితమే. -
పాక్ జైళ్లలో 471 మంది భారతీయులు
-
పాక్‌లో భారతీయ ఖైదీలు 457 మంది
ఇస్లామాబాద్: పాకిస్థాన్ జైళ్లలో అనేక మంది భారతీయులు మగ్గుతున్నారు. దాదాపు 457 మంది తమ దగ్గర బందీలుగా ఉన్నట్లు పాక్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఉన్న కాన్సులర్ యాక్సెస్ అగ్రిమెంట్ (2008 మే 21న రెండు దేశాలు సంతకాలు చేశాయి.) ప్రకారం.. ఈ జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం పాకిస్థాన్, ఇండియాలలోని జైళ్లలో ఉన్న ఖైదీల సమాచారాన్ని సంవత్సరానికి రెండు సార్లు( జనవరి1. జులై1) తెలపాల్సి ఉంటుంది. దానిప్రకారం న్యూఇయర్ రోజున పాకిస్థాన్ ప్రభుత్వం 457 మంది ఖైదీల సంఖ్యను విడుదల చేసింది. -
15 మంది భారతీయులకు ఉరిశిక్షలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : షరియత్ చట్టాలు కఠినంగా అమలయ్యే అరబిక్ దేశం కువైట్‌లో క్షమాభిక్ష అరుదైన మాట. అలాంటిది ఏకంగా 15 మంది భారతీయ ఖైదీలకు మరణశిక్షల నుంచి క్షమాభిక్షను ప్రసాదించడం సంచలనంగా మారింది. మరణశిక్షలను జీవితఖైదుగా మారుస్తూ కువైత్ రాజు జాబర్ అల్ సబా ఉత్తర్వులు జారీచేసినట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం వెల్లడించారు. 15 మంది మరణశిక్షలను జీవితఖైదుగా మార్చడంతోపాటు మరో 119 మంది భారతీయ ఖైదీల శిక్షాకాలాన్ని కూడా తగ్గించారని సుష్మా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అభ్యర్థనను దయతో అంగీకరించిన కువైత్ రాజుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.సాక్షి వెబ్ కువైత్ రాజు తాజా ఉత్తర్వుల ప్రకారం జైళ్ల నుంచి విడుదలకానున్న భారతీయ ఖైదీల విషయంలో స్థానిక అధికారులకు అక్కడి భారత రాయబార కార్యాలయం పూర్తిగా సహకరిస్తుందని సుష్మా చెప్పారు. సాక్షి కువైట్‌లో స్మగ్లింగ్, హత్యా నేరాల కింద శిక్షలు పడిన భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే, శిక్ష తగ్గిన ఖైదీల జాబితాలో తెలుగువారు ఉన్నారా, లేదా అనేది తెలియాల్సిఉంది. -
శిక్ష పూర్తయినా వీడని ‘చెర’
గుర్తింపు చూపకపోవడంతో పాకిస్తాన్ జైల్లోనే మగ్గుతున్న భారత ఖైదీలు సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ఏళ్ల క్రితం పాకిస్తాన్‌కు వెళ్లి వివిధ కేసుల్లో అరెస్టయి జైల్లో మగ్గుతున్న ఖైదీలు శిక్ష పూర్తయినా చెరసాలను వీడే అవకాశం రావడం లేదు. తమ జాతీయతను నిరూపించే గుర్తింపు పత్రాలను చూపని కారణంగా అక్కడి అధికారులు వారిని జైళ్ల నుంచి విడుదల చేయడం లేదు. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ జైల్లో శిక్ష పూర్తి చేసుకున్న 22 మంది ఖైదీల చిత్రాలను ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయ అధికారులు న్యూఢిల్లీలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించారు. వీరు శిక్ష పూర్తి చేసుకున్నా...జాతీయతను గుర్తించని కారణంగా ఇంకా జైల్లోనే ఉంటున్నారని పేర్కొన్నారు. కాగా ఖైదీల ఫొటోలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు హైదరాబాద్‌కు కూడా పంపించారు. ఈ ఫొటోల ఆధారంగా ఎవరైనా తమవారు ఉన్నారని భావిస్తే, అందుకు సంబంధించిన ఆధారాలతో పురానాహవేలిలోని ఓల్డ్ కమిషనర్ ఆఫీసులోని స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసును కలవాలని స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ పోలీసు కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
40 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసిన పాకిస్తాన్
పట్టారి(పంజాబ్): పాకిస్తాన్ 40 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. వారిలో గుజరాత్‌కు చెందిన 35 మంది మత్స్యకారులు కూడా ఉన్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అధికారులు చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం అధికారులు శనివారం ఖైదీలను అట్టారి-వాఘా చెక్‌పోస్ట్ వద్దకు తీసుకువచ్చారు. వారిని ఇక్కడి బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. పాకిస్తాన్ జలాలలోకి వెళ్లినందుకు మత్స్యకారులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 40 మంది ఖైదీలలో ఎక్కువ మంది ఏడాదిగా పాకిస్తాన్ జైళ్లలో ఉన్నారు. ** -
151 మంది భారతీయ ఖైదీలకు పాక్ విముక్తి!
ఇస్లామాబాద్: భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరవుతున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనేందుకు 151 మంది భారతీయ ఖైదీలకు పాకిస్థాన్ విముక్తి కలిగించింది. భారతీయ ఖైదీల విముక్తి వార్తను పాక్ అధికారులు ధృవీకరించారు. కరాచీలోని మలీర్ జైలు నుంచి 59 మందిని, హైదరాబాద్ లోని నారా జైలు నుంచి 92 మందిని విడుదల చేసి.. ఎయిర్ కండీషన్ బస్సులో లాహోర్ కు పంపినట్టు అధికారులు తెలిపారు. విడుదలైన భారతీయ ఖైదీలను వాఘా సరిహద్దులోని చెక్ పోస్ట్ వద్ద భారతీయ అధికారులకు అప్పగించనున్నట్టు పాక్ అధికారులు తెలిపారు. జైలు జీవితం నుంచి విముక్తి కలిగించిన అధికారులకు ఖైదీలు ధన్యవాదాలు తెలిపారు. జైలులో తమకు అన్ని సౌకర్యాలు కల్పించారని ఖైదీలు తెలిపారు. అలాగే భారతీయ జైళ్లలో మగ్గుతున్న పాకిస్థాన్ మత్స్యకారులను విడుదల చేయాలని పాక్ జైలు నుంచి విడుదలైన ఖైదీలు డిమాండ్ చేశారు. -
భారత ఖైదీల విడుదలకు పాక్ పచ్చజెండా
ముంబై: పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలను విడుదల చేసేందుకు అక్కడి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలో 338 మంది భారతీయ ఖై దీలను విడుదల చేసేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వీరు శుక్రవారం విడుదలయ్యే అవకాశముందని, శనివారం నాటికి ఖైదీలంతా స్వదేశానికి చేరతారని పాకిస్థాన్‌లోని న్యాయ సహాయ కార్యాలయం ప్రతినిధి రిజ్వనుల్లా జమిల్ వెల్లడించినట్టు భారత్-పాక్ శాంతి ఉద్యమ కారుడు జతిన్ దేశాయ్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. కరాచీలోని రెండు వేర్వేరు జైళ్ల నుంచి విడుదల చేస్తున్న ఈ ఖైదీలను ప్రత్యేక ఏసీ బస్సుల్లో లాహోర్‌లోని వాఘా, అమృత్‌సర్‌లోని అట్టారీ సరిహద్దుల గుండా భారత్‌కు పంపించనున్నట్టు తెలిపారు. ఖైదీల విడుదల నిర్ణయానికి సంబంధించిన అన్ని పనులూ ఇప్పటికే పూర్తయ్యాయని, ఖైదీలుగా ఉన్న 330 మంది జాలర్లు, ఎనిమిది మంది బాల నేరస్తులను విడుదల చేస్తున్నట్టు జమిల్ చెప్పారని అన్నారు. ‘భారత ఖైదీలను పాక్ విడుదల చేయడం ఆనందదాయకం’ అని జమిల్ అన్నట్టు దేశాయ్ తెలిపారు. -
పాక్ జైల్లో మగ్గుతున్న 11 మంది భారతీయ ఖైదీల వినతి
హోషియార్పూర్ (పంజాబ్): అత్యంత దుర్భర పరిస్థితుల్లో జైల్లో మగ్గిపోతున్న తమకు చావు ప్రసాదించి.. నిస్సార జీవితం నుంచి విముక్తి కల్పించాలని పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గల కోట్ లఖ్‌పత్ జైలులో ఏళ్లుగా కాలం గడుపుతున్న 11 మంది భారతీయ ఖైదీలు విజ్ఞప్తి చేశారు. తాము ఎటువంటి లక్ష్యం, ప్రయోజనం లేకుండా జీవచ్ఛవాల మాదిరిగా బతుకులీడుస్తున్నామని, అందువల్ల తమను కాల్చిచంపి.. ఈ దుర్భర జీవితం నుంచి విముక్తి కల్పించాలని వారు భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలకు విన్నవించారు. ఈ మేరకు వారు సంయుక్తంగా రాసిన లేఖను బీజేపీ రాజ్యసభ సభ్యుడు అవినాష్ రాయ్ ఖన్నాకు పంపారు. లేఖ జిరాక్స్ కాపీలను ఖన్నా శుక్రవారమిక్కడ మీడియాకు అందజేశారు. కాగా నలుగురు మహిళలతోసహా మరో 21 మంది భారతీయ ఖైదీలు కూడా కోట్ లఖ్‌పత్ జైలులో మగ్గుతున్నారని, తీవ్రమైన చిత్రహింసలవల్ల వారికి మతిస్థిమితం తప్పిందని, వారి పేర్లను సైతం మరిచిపోయారని లేఖలో వివరించారు. పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీల సంఖ్య 200 వరకు ఉంటుంది.