ఇస్లామాబాద్: పాకిస్థాన్ జైళ్లలో అనేక మంది భారతీయులు మగ్గుతున్నారు. దాదాపు 457 మంది తమ దగ్గర బందీలుగా ఉన్నట్లు పాక్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఉన్న కాన్సులర్ యాక్సెస్ అగ్రిమెంట్ (2008 మే 21న రెండు దేశాలు సంతకాలు చేశాయి.) ప్రకారం.. ఈ జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం పాకిస్థాన్, ఇండియాలలోని జైళ్లలో ఉన్న ఖైదీల సమాచారాన్ని సంవత్సరానికి రెండు సార్లు( జనవరి1. జులై1) తెలపాల్సి ఉంటుంది. దానిప్రకారం న్యూఇయర్ రోజున పాకిస్థాన్ ప్రభుత్వం 457 మంది ఖైదీల సంఖ్యను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment