151 మంది భారతీయ ఖైదీలకు పాక్ విముక్తి!
151 మంది భారతీయ ఖైదీలకు పాక్ విముక్తి!
Published Sun, May 25 2014 3:58 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
ఇస్లామాబాద్: భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరవుతున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనేందుకు 151 మంది భారతీయ ఖైదీలకు పాకిస్థాన్ విముక్తి కలిగించింది.
భారతీయ ఖైదీల విముక్తి వార్తను పాక్ అధికారులు ధృవీకరించారు. కరాచీలోని మలీర్ జైలు నుంచి 59 మందిని, హైదరాబాద్ లోని నారా జైలు నుంచి 92 మందిని విడుదల చేసి.. ఎయిర్ కండీషన్ బస్సులో లాహోర్ కు పంపినట్టు అధికారులు తెలిపారు.
విడుదలైన భారతీయ ఖైదీలను వాఘా సరిహద్దులోని చెక్ పోస్ట్ వద్ద భారతీయ అధికారులకు అప్పగించనున్నట్టు పాక్ అధికారులు తెలిపారు. జైలు జీవితం నుంచి విముక్తి కలిగించిన అధికారులకు ఖైదీలు ధన్యవాదాలు తెలిపారు.
జైలులో తమకు అన్ని సౌకర్యాలు కల్పించారని ఖైదీలు తెలిపారు. అలాగే భారతీయ జైళ్లలో మగ్గుతున్న పాకిస్థాన్ మత్స్యకారులను విడుదల చేయాలని పాక్ జైలు నుంచి విడుదలైన ఖైదీలు డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement