నేటి నుంచి మద్యం బంద్! | Partial Liquor Ban Across Bihar From Today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మద్యం బంద్!

Published Fri, Apr 1 2016 10:52 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

నేటి నుంచి మద్యం బంద్!

నేటి నుంచి మద్యం బంద్!

పాట్నా: బిహార్లో మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. తొలుత పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగా మద్యం అమ్మకాలను నిషేధించనున్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు. బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ప్రొహిబిషన్ డే సందర్భంగా మాట్లాడుతూ బిహార్ ను మద్య రహిత రాష్ట్రంగా మారుస్తానని, ఏప్రిల్ 1నుంచి ఆ లక్ష్యానికి పునాది వేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

అందులో భాగంగానే నేటి నుంచి బిహార్ లోని గ్రామీణ ప్రాంతాల్లో దేశీయంగా ఉత్పత్తి అయ్యే మద్యంతోపాటు ఇతర స్పైస్ లిక్కర్ను కూడా బ్యాన్ చేస్తున్నారు. ఈ హెచ్చరికను లెక్కచేయకుండా మద్యం అమ్మకాలు చేపడితే బిహార్ మద్యం పాలసీ సవరణ చట్టం 2016 ప్రకారం వారు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎవరైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తిస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్, జీమెయిల్, టోల్ ఫ్రీ, ఫ్యాక్స్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement