వీడియో దృశ్యం
ముంబై : అభంశుభం తెలియని కుక్క నోటిని, కాళ్లను తాళ్లతో కట్టేసి నీళ్లలోకి విసిరేసిన ఘటనపై పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఆగ్రహం వ్యక్తం చేసింది. దారుణానికి పాల్పడిన ఇద్దరు యువకుల ఆచూకీ చెబితే రూ.50వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. ‘‘ ఆ యువకుల వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే ముందుకు రావాలి. రాక్షస ప్రవృత్తి కలిగిన వారి వల్ల జంతువులకే కాదు మనుషులకు కూడా పెను ప్రమాదమని సైకాలజిస్టులు చెబుతున్నారు. కుక్కల్ని హింసించే భర్తల ద్వారా ఇబ్బందులు పడుతున్నామని 60శాతం మంది మహిళలు కూడా చెబుతున్నారు’’ అని పేర్కొంది. సదరు యువకుల వివరాలు తెలిసిన వారు పెటా హెల్ప్‌లైన్ నెంబర్ +91 9820122602 లేదా e-mail Info@petaindia.org. Informers కు పంపాలని కోరింది. యువకుల ఆచూకీ అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది. ( ఈ మెడికల్ షాపు ప్రత్యేకతేంటో తెలుసా?)
కాగా, వైరల్‌గా మారిన వీడియోలో.. ఇద్దరు యువకులు కుక్క నోటిని, కాళ్లను తాళ్లతో కట్టేసి,గిరగిరా తిప్పుతూ నీటిలో పడేశారు. అంతటితో ఆగకుండా ఓ యువకుడు కుక్క మునిగిపోయిన ప్రదేశంలో రాళ్లను విసిరాడు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియో కొద్దిరోజుల కిత్రం టిక్‌టాక్‌లో విడుదలైంది. దీనిపై స్పందిస్తున్న జంతుప్రేమికులు సదరు యువకులపై నిప్పులు చెరుగుతున్నారు. మనుషులా? క్రూర మృగాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(క్షణం ఆలస్యం అయ్యుంటే పరిస్థితి ఏంటి?)
చదవండి : (కంటతడి పెట్టిస్తోన్న చిన్నారుల లేఖ)
Comments
Please login to add a commentAdd a comment