
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోలు ధర 64 పైసలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు సోమవారం ప్రకటించాయి.
కాగా, డీజిల్ ధర మాత్రం రూ. 1.35 తగ్గింది. పెంచిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. రెండు వారాల కిందటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా పెంపు నిర్ణయం వినియోగ దారులకు మరింత భారం కానుంది.
అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు అందుబాటులోనే ఉన్నప్పటికీ భారత్లో మాత్రం పెట్రోల్ రేటు పెరిగిపోతుండం గమనార్హం. ధరల పెంపు నిర్ణయం పూర్తి నిర్ణయాన్ని చమురు కంపెనీలకే కట్టబెట్టిన నేపథ్యంలో గత అక్టోబర్ నుంచి ఇంధన ధరల్లో పెరుగుదల, తరుగుదలలు గణనీయంగా చోటుచేసుకోవడం తెలిసిందే. గడిచిన మే 15న పెట్రోల్ పై రూ. 3.13, డీజిల్ పై రూ. 2.71 పెంపు విధించారు.