న్యూఢిల్లీ: భార్యాభార్తల మధ్య భౌతికపరమైన సంబంధాలను అత్యాచారంగా పరిగణించలేమని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం కేసులో ఓ వ్యక్తికి విముక్తి కల్పించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఫిర్యాదు దారు (భార్య), నిందితుడు (భర్త) రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు అతను ఆమె ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఆ సమయంలో తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడంటూ ఆ మహిళ ఆరోపించింది. ఆ మరుసటి రోజు ఆమెను తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పలుమార్లు తన భర్త తనపై అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన అడిషనల్ సెషన్స్ జడ్జి వీరేందర్ భట్ .. మహిళ అనుమతి లేకున్నా భార్యాభర్తల మధ్య సంబంధాలను అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొన్నారు.
ఆ బంధం అత్యాచారం కాదు
Published Fri, Jun 13 2014 4:40 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement
Advertisement