క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ భేటీ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సర్జికల్ అనంతరం పాకిస్థాన్, భారత్ బార్డర్లోని పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ(సీసీఎస్) శుక్రవారం సమావేశమైంది. ఈ సమావేశంలో పాకిస్థాన్తో అనుసరించాల్సిన విధానం, ఉగ్రవాదుల నియంత్రణకు మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశంలో రక్షణ మంత్రి మనోహర్ పరికర్,ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ,హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి జై శంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.