పింప్రి, న్యూస్‌లైన్ : విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులు చేసే విధంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాలల సమితి, పోలీసులు సంయుక్తంగా ఫిర్యాదుల బాక్స్‌లను పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని 4 పోలీస్ జోన్‌లు 8 పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలల్లో ఫిర్యాదు బాక్స్‌లపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులను లైంగికంగా వేధించడం, మభ్యపెట్టడం లాంటి విషయాల సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తు న్నారు. ఆయా పాఠశాలల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బాక్సులల్లో ఫిర్యాదులు వేయాలని సూచిం చారు. పోలీసులు వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారని చెప్పారు.
సామాజిక సంస్థల స్ఫూర్తి..
2005 జనవరిలో యరవాడా పోలీస్ స్టేషన్, సమాజ్ సేవకులు, సామాజిక సంస్థలు ముందుకు వచ్చి నగరంలో బాలికలపై అత్యాచారాలను అరికట్టడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ వివిధ పాఠశాలలకు వెళ్లి మార్గదర్శనం, పిల్లల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేసింది. ఈ క్రమంలో పాఠశాలల్లో ఆడపిల్లలపై విచక్షణ, వేధింపులు తగ్గడాన్ని గమనించి అదే ఫార్ములాను నగరంలోని 4 పోలీస్ జోన్‌ల పరిధిలోని పాఠశాలల్లో అమలు చేయడానికి పోలీస్ డిప్యూటీ కమిషనర్ మనోజ్ పాటిల్ కృషి చేశారు.
ఈ నేపథ్యంలోనే 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో గల ప్రతి హైస్కూలులో ఈ ఫిర్యాదు బాక్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విమానాశ్రయం పోలీస్ స్టేషన్ పరిధిలో గల 21 పాఠశాలల్లో బాక్స్‌ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ప్రతి బాక్స్‌పై ఫోన్ నంబర్ ఉంటుంది. బాక్స్‌లల్లోని ఫిర్యాదులను చూసే బాధ్యతను వారానికో పోలీసు అధికారికి అప్పగించారు. ఈ బాక్స్‌లపై పాఠశాల సిబ్బంది పెత్తనం నిర్వహించడానికి వీలు కాదు. విద్యార్థినులు తమపై ఎవరైనా వెకిలి చేష్టలు, వేధించడం లాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఫిర్యాదుల బాక్స్‌లను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
వేధిస్తే ఫిర్యాధు చేయాలిలా
Published Mon, Aug 11 2014 11:30 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement