ఎన్‌కౌంటర్‌; నలుగురు మావోయిస్టుల మృతి | Policeman And Four Maoists Deceased in Chhattisgarh Encounter | Sakshi
Sakshi News home page

చత్తీస్‌గఢ్‌‌లో ఎన్‌కౌంటర్‌; నలుగురు మావోయిస్టుల మృతి

Published Sat, May 9 2020 8:15 AM | Last Updated on Sat, May 9 2020 8:29 AM

Policeman And Four Maoists Deceased in Chhattisgarh Encounter - Sakshi

మన్పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో శుక్రవారం రాత్రి పోలీసులకు, మావోయిస్టులు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక  ఎస్‌ఐ మృతి చెందగా, నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ‌ రాజనందగావ్ జిల్లా మన్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పర్దోని సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మామదన్వాడ పోలీస్ స్టేషన్  ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ నేతృతత్వంలో పోలీసులు శుక్రవారం రాత్రి మన్పూర్‌ నక్సల్స్ ఆపరేషన్ నిమిత్తం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో అప్పటికే మాటు వేసిన మావోయిస్టులు పోలీసులపై మెరుపుదాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులతో పాటు, ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మావోయిస్టుల నుంచి ఏకే-47, రెండు 315-బోర్‌ రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ జితేంద్ర శుక్లా సంఘటనా స్థలానికి వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement