రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ముందు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు తర్వాత ఓటు వేశారు.
దామాషా ప్రాతినిధ్యం విధానంలో రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతోంది. 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 33 మంది పరిశీలకులను నియమించింది. పార్లమెంట్ హౌస్‌లో ఇద్దరిని, అసెంబ్లీల్లో ఒక్కొక్కరిని నియమించారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, విపక్ష అభ్యర్థి మీరా కుమార్ పోటీలో ఉన్నారు. ఈ నెల 20న కౌంటింగ్ నిర్వహిస్తారు.