కొలంబో: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి హింసాత్మక ఘటనలూ నమోదు కాలేదు. చివరి సమాచారం అందేసరికి 75 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను ఈయూ, కామన్వెల్త్ తదితర దేశాల నుంచి 100 మందికి పైగా అంతర్జాతీయ పరిశీలకులు పర్యవేక్షిస్తున్నారు.
38 మంది బరిలో దిగినా ప్రధాన పోటీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, విపక్ష నేత సజిత్ ప్రేమదాసతో పాటు జనాదరణతో దూసుకుపోతున్న జనతా విముక్తి పెరమున (జేవీపీ) చీఫ్ అనూర కుమార దిస్సనాయకె మధ్యే నెలకొనడం తెలిసిందే. రేసులో దిస్సనాయకె ముందున్నట్టు ముందస్తు సర్వేలన్నీ తేల్చాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటర్లు ముగ్గురు అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓటేస్తారు. పూర్తి మెజారిటీ సాధించే అభ్యర్థి విజేత అవుతాడు.
Comments
Please login to add a commentAdd a comment