ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది:సుప్రీం
Published Fri, Apr 22 2016 7:56 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ ఆరాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాలను ఆనెల 27 వరకు తాత్కాలికంగా నిలివేస్తూ ఆదేశాలను జారీ చేసింది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీ కోర్టులో హైకోర్టు తీర్పను సవాల్ చేయడంతో జస్టిస్ శివకీర్తి సింగ్ ,జస్టిస్ దీపక్ మిశ్రా ఈ ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర ముఖ్మమంత్రిగా హరీష్ రావత్ పదవీ బాధ్యతలు స్వీకరించడంపై సుప్రీ తీర్పు ప్రభావం పడనుంది. కేంద్ర ప్రభుత్వంఅప్పీల్ చేసినందునఉత్తారాఖండ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని ఆరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీం నోటీసులు పంపింది.
Advertisement