
ఏపీ పోలీసులపై ప్రెస్ కౌన్సిల్ ఫైర్
రాజధాని భూ అక్రమాలపై వరుస కథనాలు ప్రచురిం చిన సాక్షి జర్నలిస్టులను వేధించడం సరైన పద్ధతి కాదని ఏపీ పోలీసులపై భారత ప్రెస్ కౌన్సిల్
- రాజధాని భూ అక్రమాల కథనాలపై ‘సాక్షి’కి నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టిన కౌన్సిల్
- ఏపీ డీజీపీ వివరణ ఇవ్వాలని ఆదేశం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజధాని భూ అక్రమాలపై వరుస కథనాలు ప్రచురిం చిన సాక్షి జర్నలిస్టులను వేధించడం సరైన పద్ధతి కాదని ఏపీ పోలీసులపై భారత ప్రెస్ కౌన్సిల్ (పీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తలకు ఆధారాలు చూపించాలని జర్నలిస్టులకు నోటీసులివ్వడాన్ని, ఎంపిక చేసి మరీ కొందరు జర్నలిస్టులను పోలీసు స్టేషన్లకు రప్పించే ప్రయత్నాలను ప్రెస్ కౌన్సిల్ తప్పుబట్టింది. నేర న్యాయ స్మృతి (సీఆర్‌పీసీ) సెక్షన్ 91 కింద నేరుగా నోటీసులు ఇవ్వడమే తప్పు కాగా అందులో పోలీసులు వాడిన రాజకీయ భాష మరింత అభ్యంతరకరమంది. జరిగిన పరిణామాలపై సంబంధిత అధికారి, బాధ్యుడైన జిల్లా పోలీసు అధికారితో పాటు రాష్ట్ర డీజీపీ స్వయంగా వివరణ ఇవ్వాలని కౌన్సిల్ సోమవారం విచారణ సందర్భంగా ఆదేశిం చింది. గతేడాది మార్చిలో ‘సాక్షి’ తగిన సాక్ష్యాధారాలతో వరుస కథనాలు ప్రచురిం చిన విషయం విదితమే.
వీటిపై తమకు ఫిర్యాదులు అందాయంటూ మంగళగిరి పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఎంపిక చేసిన కొందరు రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లకు నోటీసులిస్తూ వేధింపులకు పాల్పడ్డారు. ఇది దారుణమని, పత్రికా స్వేచ్ఛకు భంగకరమని ఆరోపిస్తూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ప్రెస్ కౌన్సిల్ సుమోటాగా కేసును విచారించింది. దీనిలో భాగంగా ప్రెస్ కౌన్సిల్ ఇచ్చిన నోటీసు మేరకు ‘సాక్షి’ ఇందుకు సంబంధించిన తదనంతర పరిణామాలను వివరించింది. ఈనేపథ్యంలో ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపివేయాలని గత విచారణ సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పలు దఫాల విచారణల్లో భాగంగా పీసీఐ తాజా విచారణ సోమవారం ఢిల్లీలో జరిగింది. పోలీసు విభాగం తరఫున గుంటూరు రూరల్ అడిషనల్ ఎస్పీ రామాంజ నేయులు, గుం టూరు అర్బన్ ఏఎస్పీ సుబ్బారాయుడు విచారణకు హాజరయ్యారు. నాన్ కాగ్నిజబుల్ కేసు అయినందున మెజిస్టీ రియల్ కోర్టు అనుమతి తీసుకునే జర్నలిస్టులపై కేసులు నమోదు చేశామని వారు విచారణ కమిటీకి తెలిపారు. ‘‘ఎడిటరో, పబ్లిషరో తెలుపకుం డా, పత్రికల్లో వచ్చిన కథనాల్లో పేర్లు (బైలైన్) లేకుండా రాసింది ఈ నలుగురు జర్నలిస్టులే అని మీకెలా తెలిసింది. వారికే ఎలా నోటీసులు ఇచ్చారు..’’ అని కౌన్సిల్ అడిగిన ప్రశ్నకు పోలీసు అధికారులు సమాధానం ఇవ్వలేకపోయారు.
ఇది తప్పని, పోలీసులై నా, మరే ప్రభుత్వ అధికారులైనా రాజ్యాం గానికి, చట్టాలకు లోబడి పనిచేయాలి తప్ప రాజకీయ నేతలకు లోబడి కాదని పీసీఐ చైర్మన్ జస్టిస్ సి.కె.ప్రసాద్ వ్యాఖ్యానించారు. కోర్టు అనుమతితోనే కేసు నమోదు చేశామని, నిబంధనల మేరకే సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. సెక్షన్ 91 కింద మంగళగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నోటీసులు ఇవ్వడం తమకు ఎవరికీ తెలిసి జరగలేదని, అది తమకు ఆశ్చర్యంగా ఉందని ఇద్దరు అధికారులు కౌన్సిల్‌కు తెలిపారు. దాంతో ఆగ్రహించిన చైర్మన్, సభ్యులు ఇందుకు డీజీపీ వివరణ ఇవ్వాల్సిందేనన్నారు. నిర్దేశించిన గడువులోపు కౌన్సిల్‌కు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
రాజకీయ కరపత్రంలా ఉంది
‘ఈ ప్రాంతం అభివృద్ధికి గౌరవ ముఖ్య మంత్రి ఎంతగానో కృషిచేస్తున్నా రు, విపక్ష నేతకు లబ్ధి చేకూరేలా సాక్షి కథనాలు ప్రచురిస్తోంది..’ అంటూ పోలీసు అధికారు లు నోటీసులో పేర్కొన డాన్ని పిటిషనర్ కౌన్సిల్ దృష్టికి తెచ్చిన ప్పుడు కౌన్సిల్ చైర్మన్, సభ్యులు విస్మయం వ్యక్తంచేశారు. ఒక పోలీసు అధికారిచ్చిన నోటీసులా కాకుండా రాజకీ య భాషతో రాజకీయ కరపత్రంలా ఉంద న్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఐజేయూ తరఫున సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ‘సాక్షి’ తరఫున ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు.