పుదుచ్చేరి: తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు శ్రేష్టమైన తల్లిపాలు అందించేందుకు నగరంలోని జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జేఐఎమ్ఈఆర్) హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ను ఏర్పాటుచేసింది. 'అముధమ్ తైప్పల్ మైయం' (ఏటీఎమ్) పేరుతో బుధవారం ఈ బ్యాంకు ప్రారంభమైంది.
నెలలో 1,500కు పైగా శిశువులు జేఐఎమ్ఈఆర్ ఆసుపత్రిలో జన్మిస్తుంటారు. వీరిలో 30 శాతం కంటే ఎక్కువ మంది ఉండాల్సిన బరువు కన్నా తక్కువ ఉంటుండటంతో చర్యలు చేపట్టిన ప్రభుత్వం తల్లిపాల ఏటీఎమ్ ను ప్రారంభించింది. నియో నాటల్ ఇన్ టెన్సీవ్ కేర్(ఎన్ఐసీయూ) ఉన్న ప్రతి ఆసుపత్రిలోనూ తల్లిపాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆసుపత్రి డైరెక్టర్ ఎస్సీ పరీజా సూచించారు.